వి ఆనంద్ దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం. From Wikipedia, the free encyclopedia
డిస్కో రాజా[2][3] 2020, జనవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[4][5] వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, వెన్నెల కిషోర్, సత్య, అజయ్, బాబీ సింహా తదితరులు నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. ఎస్.టి.ఆర్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
డిస్కో రాజా | |
---|---|
దర్శకత్వం | వి ఆనంద్ |
రచన | వి ఆనంద్ అబ్బూరి రవి (మాటలు) |
స్క్రీన్ ప్లే | వి ఆనంద్ |
కథ | వి ఆనంద్ |
నిర్మాత | రామ్ తాళ్లూరి |
తారాగణం | రవితేజ పాయల్ రాజ్‌పుత్ నభా నటేష్ తాన్యా హోప్ |
Narrated by | వి ఆనంద్ |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | శ్రవణ్ కటికనేని |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | ఎస్.టి.ఆర్. ఎంటర్టైన్మెంట్స్ |
పంపిణీదార్లు | ఎస్.టి.ఆర్. ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 24 జనవరి 2020 |
సినిమా నిడివి | 2 గంటల 29 నిముషాలు (149 నిముషాలు) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹30 కోట్లు[1] |
లడఖ్‌లో ప్రారంభమై ఢిల్లీ, చెన్నై, రుద్రాపూర్, ముంబై, గోవాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వాసు (రవితేజ) ఓ అనాథ. తనతో పాటు మరికొంతమంది అనాథలతో రామచంద్రం అనే ఓ పెద్దాయనతో కలిసి ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే నభా (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. అయితే తన కుటుంబానికి వచ్చిన సమస్యను సెటిల్మెంట్ చేసుకోవడం కోసం గోవా వెళ్లిన వాసు తిరిగిరాడు. అయితే ఇదే క్రమంలో కొన్ని అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. మరోవైపు పరిణితి ( తాన్యా హోప్), పాల్గుణి (వెన్నెల కిశోర్) అండ్ టీం చేసిన ఓ ప్రయోగం సక్సెస్ అవుతుంది. చివరికి ఆ ప్రయోగం చేసింది డిస్కో రాజా(రవి తేజ)పై అని తెలుసుకుంటారు. అయితే ఇంతకీ ఆసలు డిస్కో రాజా ఎవరు? బర్మా సేతు (బాబీ సింహా), హెలెన్ (పాయల్ రాజ్‌పుత్), భరణి (రామ్కీ), పీటర్ (సత్య), ఉత్తరకుమారా అలియాస్ దాస్ (సునీల్)లు ఈ కథలో ఎందుకు ఎంటర్ అవుతారా? అసలు వాసు, డిస్కో రాజాకు ఉన్న సంబంధం ఏమిటి? డిస్కో రాజాపై వారు చేసిన ప్రయోగం ఏమిటి? అనేదే డిస్కోరాజా సినిమా కథ.[6][7]
డిస్కో రాజా | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 2020 | |||
Recorded | 2019 | |||
Venue | ఏఎమ్ స్టూడియోస్ | |||
Studio | చెన్నై | |||
Genre | సినిమా పాటలు | |||
Label | లహరి మ్యూజిక్, టీ-సిరీస్ | |||
Producer | ఎస్.ఎస్.తమన్ | |||
ఎస్.ఎస్. తమన్ chronology | ||||
| ||||
|
ఈ చిత్రం రవితేజ, తమన్ కాంబినేషన్లో పదకొండవ సినిమా కాగా.. వి ఆనంద్, తమన్ కాంబినేషన్లో టైగర్ తరువాత రెండవ సినిమా.[13] సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో ఎస్.పి. బాలసుబ్రమణ్యం పాడిన నువ్వు నాతో ఏమన్నావో పాట 2019, అక్టోబరు 19న విడుదలయింది.[14] రామజోగయ్య శాస్త్రి రచనలో ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్ తదితరులు పాడిన ఢిల్లీ వాలా పాట 2019, డిసెంబరు 20న విడుదలయింది.[15] సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో రవితేజ, బప్పీలహరి, శ్రీకృష్ణ తదితరులు పాడిన రమ్ పమ్ బమ్ పాట 2020, జనవరి 16న విడుదలయింది. ఫ్రీక్ ఔట్ థీమ్ మ్యూజిక్ 2020, జనవరి 21న విడుదలయింది.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నువ్వు నాతో ఏమన్నావో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రమణ్యం | 5:40 |
2. | "ఢిల్లీ వాలా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | ఆదిత్య అయ్యంగార్, గీతా మాధురి, రాహుల్ నంబియార్ | 5:11 |
3. | "రమ్ పమ్ బమ్ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | రవితేజ, బప్పీలహరి, శ్రీకృష్ణ | 3:26 |
4. | "ఫ్రీక్ ఔట్" | థీమ్ మ్యూజిక్ | వాయిద్యం | 2:15 |
మొత్తం నిడివి: | 15:22 |
2019, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రవితేజ పుట్టినరోజున ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదలయింది.[16] 2019, నవంబరు 6న బాబీ సింహా పుట్టినరోజున బర్మా సేతు పాత్రలో ఉన్న తన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయింది.[17] 2019, డిసెంబరు 4న రవితేజ ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదలచేస్తూ టీజర్ విడుదల తేదీ ప్రకటించబడింది.[18] 2019, డిసెంబరు 5న పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజున తన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయింది.[19] 2019, డిసెంబరు 11న నభా నటేష్ పుట్టినరోజున తన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలయింది.[20] 2019, డిసెంబరు 6న ఈ చిత్ర తొలి అధికారిక టీజర్ విడుదలయింది.[21] 2020, జనవరి 13న ఈ చిత్ర రెండవ అధికారిక టీజర్ విడుదలయింది.[22] 2020, జనవరి 19న హైదరాబాదు మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.[23]
ఈ చిత్రం 2020, జనవరి 24న విడుదలయింది.[24][25] సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.