పెంచల కోన

From Wikipedia, the free encyclopedia

పెంచల కోనmap

పెంచలకోన ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, రాపూరు మండలం లోని శ్రీ పెనుశిల లక్మీ నరసింహస్వామి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం. ఇది నెల్లూరునకు 70 కిమీ దూరంలో ఉంది.[1] రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విభేదాలు లేకుండావారి పాపాల నుండి స్వామి వారిని దర్శించి విముక్తులగుచున్నారు.ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండల కేంద్రానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య శ్రీ పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

త్వరిత వాస్తవాలు పెంచల కోన శ్రీ పెనుశిల నరసింహస్వామి దేవస్థానం, పెంచలకోన, దేశం ...
పెంచల కోన
శ్రీ పెనుశిల నరసింహస్వామి దేవస్థానం, పెంచలకోన
Thumb
Thumb
పెంచల కోన
పెంచల కోన
ఆంధ్రప్రదేశ్ పటంలో పెంచలకోన స్థానం
Thumb
పెంచల కోన
పెంచల కోన
పెంచల కోన (India)
Coordinates: 14.338904°N 79.412613°E / 14.338904; 79.412613
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానెల్లూరు జిల్లా
Named forదేవాలయం
Government
  Typeఎండోమెంట్స్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  Bodyశ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ, పెంచలకోన
Elevation
914.4 మీ (3,000.0 అ.)
భాష
  అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
Vehicle registrationAP
సమీప నగరంనెల్లూరు
సమీప విమానాశ్రయంతిరుపతి
Websitehttp://www.penchalakona.co.in/
మూసివేయి

గ్రామం పేరు వెనుక చరిత్ర

చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచల కోన గా మారింది.దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.

పెనుశిల నరసింహస్వామి ఆలయ చరిత్ర

Thumb
పెంచలకోనలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమావేశం, శిక్షణ

శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది.

దీంతో ఆమే ధైర్య సాహసాలు, అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు.

ఆలయ విశేషాలు

తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు. కోనలోని గర్భగుడి 2020 సంవత్సరం నాటికి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.[2]భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవి లోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెబుతుంటారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ ఉంది.

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం ఇక్కడ మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. [3]తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని ప్రతీతి. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి. కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడతారు.

ప్రయాణ మార్గాలు

పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమీటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40 కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

గూడూరు రైల్వే జంక్షన్‌ నుండి 70 కిలోమీటర్ల దూరం ఇక్కడి నుండి రోడ్దు మార్గాన రాపూరుకు చేరుకోని కోనకు వెళ్లవచ్చు. కడపజిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చేరుకోని ఇక్కడకి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమీటర్ల దూరం ఉంది.

విజయేశ్వరీదేవి ఆశ్రమం

పెంచలకోనలో "విజయేశ్వరీదేవి ఆశ్రమం" అనే ఆశ్రమం ఉంది. దాని నిర్వాహకురాలు విజయేశ్వరీదేవి ఆమె ఇక్కడ 30 సవత్సరాల పైబడి నుండి తపస్సు చేస్తుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.