Remove ads
బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలు From Wikipedia, the free encyclopedia
బ్రహ్మోత్సవాలు హిందూ దేవాలయాలలో జరిగే అమిత ప్రాముఖ్యమైన ఉత్సవాలు.కొన్ని ప్రముఖ దేవాలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలు గురించి ఈ వ్యాసంలో తెలుసుకోవచ్చు.
యాదాద్రి (యాదగిరిగుట్ట) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి -భువనగిరి జిల్లాలోని మండల కేంద్రం . ఇక్కడి దైవం శ్రీలక్ష్మీనరసింహ స్వామి . 18 పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఈ ఆలయం మూలం గురించి ప్రస్తావించబడింది. దీని ప్రకారం రుష్య శృంగ మహర్షి కుమారుడు హాద మహర్షి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహ స్వామి ప్రభువు కోసం తపస్సు చేశారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆశీర్వాదం పొందిన తరువాత, ఉగ్ర రూపముతోతో ఉన్న స్వామిని, శాంతరూపముతో ప్రసన్నం కావలెనని కోరగా లక్ష్మినరసింహ స్వామిని ఇక్కడనే నివసించమని ప్రార్థించంచగా స్వామి వారు లక్ష్మి నరసింహ స్వామిగా శాంతా స్వరూపముతో కొండపై ఉండమని కోరగా స్వామి కొండపై కొలువై ఉండి పోయారు . స్వామి ఇక్కడ శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ గండబెరుండ నరసింహ, శ్రీ లక్ష్మి నరసింహ అని పిలువబడే ఐదు అవతారాలలో ఉనికిలోకి వచ్చారు. అందుకని దీనిని “పంచ నరసింహ క్షేత్రం” అంటారు. ఈ దేవతను భక్తితో ఆరాధించే భక్తులు, వారి “గ్రహ” విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, దుష్టశక్తుల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు, వారి మానసిక సమస్యలన్నీ నయం చేయబడుతున్నాయి [1]
బ్రహ్మోత్సవాలు: ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవములు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవములు పాల్గుణ శుద్ధ విదియ రోజున అంకురార్పణతో ప్రారంభమై 11 దినములు జరిగి, పాల్గుణ శుద్ధ ద్వాదశితో సమాప్తం అవుతాయి [2] ఇక్కడ స్వామి వారిని ప్రతిరోజూ ఉదయం, రాత్రి స్వామిని వివిధ అలంకారములతో, శ్రీకృష్ణుడి అలంకారంలో,హంస వాహనలో, వటపత్ర శాయి,, పొన్న వాహన సేవలో,గోవర్ధన గిరిధారి అలంకారములో, సింహ వాహన సేవలో, జగన్మోహిని అలంకార సేవలో, అశ్వవాహన సేవలో, శ్రీరామ అలంకార సేవ, గజవాహన సేవ, శ్రీమహావిష్ణు అలంకారం దివ్య విమాన రథోత్సవంలో లలో ఊరేగిస్తారు . మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీస్వామి వారి శ్రీపుష్ప యాగం, డోలోత్సవం,శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో సేవలు నిర్వహిస్తారు.[3]
కదిరి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభుగా కాదెరి చెట్టులోని మూలముల నుంచి ఉద్భవించారు . కాలక్రమేణా కాదిరి నుంచి కదిరిగా మారింది . ఆలయములో స్వామి వారు ఎనిమిది చేతులతో సింహ రూపములతో ఉంటారు . హిరణ్యకశిపుని సంహరిస్తూవుంటే, ప్రహ్లాదుడు ఈ దేవాలయములో ముడుచుకున్న చేతులతో ఉంటారు . ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, స్వామి వారి అభిషేకం తర్వాత లక్ష్మీ నరసింహ విగ్రహానికి చెమట పట్టడం .ఈ ఆలయ నిర్మాణం చాళుక్య పాలనలో ప్రారంభమైనట్లు చెబుతారు, కాని ఇది విజయనగర పాలకుల కాలంలో పూర్తయింది. ఆలయంలోని శాసనాలు ఎక్కువగా విజయనగర కాలానికి సంబంధించినవి. సా.శ. 1332 లో బుక్కారాయల పాలనలో ఈ ఆలయాన్ని ఒక నాయకుడు నిర్మించాడని వాటిలో ఒకటి పేర్కొంది. రాజా గోపురం హరిహరాయ నిర్మించారు. విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయలు మహారాష్ట్ర రాజు శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి ఉప దేవాలయాలు, మహిసాసురమర్దని ఆలయాన్ని నిర్మించారు [4]
బ్రహ్మోత్సవాలు: కదిరి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధనవమి అంకురార్పణతో నుంచి ఫాల్గుణ బహుళ అష్టమి వరకు (15 రోజుల) జరుగుతాయి . స్వామి వారు ప్రతి రోజు హంస వాహనము సింహా వాహనం, హనుమంత వాహనము,గరుడ వాహనము, శేష వాహనం, సూర్య, చంద్ర వాహనములు,విద్యా - మోహిని వాహనం,గరుడ సేవ,, గజ వాహనం,,అశ్వవాహనం, పుష్ప యాగం మొదలైన పూజలతో కదిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సాలు జరుగుతాయి [5]
ఈ ఆలయం జగిత్యాల్ జిల్లాలో ఉంది. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి క్షేత్రం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రములలో ఉన్న నవ ( తొమ్మిది) నర్సింహ క్షేత్రాలలో ఒకటి. ఈ పట్టణమును ధర్మ వర్మ అనే రాజు పాలనతో, ధర్మపురి అనే పేరు వచ్చింది .క్రీస్తుపూర్వం 850-928 కి ముందే ఉన్నది . స్వామి వారు సాలగ్రామ రూపములో ఉంటారు. గోదావరి నది తీరమున ఉన్నది . ధర్మపురిని ‘దక్షిణ కాశీ’ అని కూడా పిలుస్తారు.ఈ ఆలయములో శ్రీ రామలింగేశ్వర దేవాలయాలు, మసీదు పక్కపక్కనే ఉంది.ముస్లిం, హిందువుల ఐక్యత సమగ్రతకు సాక్ష్యం. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రతి సంత్సరము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ అష్టమి వరకు 13 రోజుల పాటు జరుగుతాయి.[6] [7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.