మధ్య ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో పన్నజిల్లా ఒకటి. పన్నా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
పన్నా జిల్లా
पन्ना जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Sagar |
ముఖ్య పట్టణం | Panna, India |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Khajuraho |
విస్తీర్ణం | |
• మొత్తం | 7,135 కి.మీ2 (2,755 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,16,028 |
• జనసాంద్రత | 140/కి.మీ2 (370/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.08% |
• లింగ నిష్పత్తి | 907 |
ప్రధాన రహదార్లు | NH 75 |
Website | అధికారిక జాలస్థలి |
దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1950లో పన్నా జిల్లా రూపొందించబడింది. బ్రిటిష్ ఇండియా లోని రాజాస్థానాలైన పన్నా, జాసో, అజ్ఘర్ రాజాస్థానంలో అధికభాగం, పాల్డియో రాజాస్థానంలో కొంత భాగం కలిపి ఈ జిల్లా రూపొందించబడింది. పన్నా జిల్లా సరికొత్త భారతీయ రాష్ట్రం అయిన విద్యప్రదేశ్లో భాగంగా ఉండేది. వింధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయిన తరువాత ఇది 1956 నవంబరు 1 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయింది.
పన్నా జిల్లా 23° 45' నుండి 25° 10' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79° 45' నుండి 80° 40' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.[1] జిల్లా వైశాల్యం 7,135 చ.కి.మీ.[2] జిల్లా గుండా కెన్ నది ప్రవహిస్తుంది. జిల్లాలో పాండవ జలపాతాలు, గథ జలపాతాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న " పన్నా నేషనల్ పార్క్ " పర్యాటక ఆకర్షణగా ఉంది. .[3]
జిల్లాలో ఉన్న వజ్రాల గనులు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయి. వజ్రాల గనులు పన్నా నగరానికి 80 కి.మీ దూరంలో ఉన్నాయి. [2] పురాతన కాలంలో గనులు అధికంగా సుకారియూ గ్రామంలో ఉండేవి.[4] ప్రస్తుత కాలంలో గనులు మఝగావ్ మాత్రమే ఆసియా ఉనికిలో ఉన్న ఏకైక వజ్రాలగనిగా గుర్తించబడుతుంది. [5]
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పన్నా జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[6]
జిల్లాలోని కమ్యూనిటీ డేవెలెప్మెంటు బ్లాకులు. [7], గ్రామ పంచాయితీ అంటారు.[8] తాలూకాలు [9] లేక తెహ్సిల్స్ .[9] పన్నా జిల్లాలో 5 ఉపవిభాగాలు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,016,028,[10] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[11] |
అమెరికాలోని. | మొంటోనా నగర జనసంఖ్యకు సమం..[12] |
640 భారతదేశ జిల్లాలలో. | 442వ స్థానంలో ఉంది..[10] |
1చ.కి.మీ జనసాంద్రత. | 142 [10] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.62%.[10] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 907:1000 [10] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 66.08%.[10] |
జాతియ సరాసరి (72%) కంటే. |
పన్నా జిల్లాలో హిందీ భాషతో పాటు లెక్సికల్ భాషను పోలిన బుండెలి భాష 72.91% ప్రజలలో వాడుకలో ఉంది.[13][14] దీనిని బగేల్ఖండ్ ప్రాంతంలో దాదాపు 78,00,000 మంది మాట్లాడుతున్నారు.[13] ద్రవిడ భాషలలో ఒకటైన భరియా భాషను జిల్లాలో 20,000'మంది భరియా ప్రజలలో వాడుకలో ఉంది. భరియా ప్రజలు ద్రావిడ భాషా లిపిని వాడుకుంటారు. వీరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు. .[15]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.