తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ స్వరూపం అధికంగా మారిపోయింది. నిజామాబాదు జిల్లాలో మొత్తం 9 శాసనసభ నియోజకవర్గములు ఉండగా 4 శాసనసభ నియోజకవర్గములు కొత్తగా ఏర్పడిన జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోకి వెళ్ళగా కరీంనగర్ జిల్లాకు చెందిన 2 శాసనసభ నియోజకవర్గములు కోరుట్ల, జగిత్యాల శాసనసభ నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.[1] ఒక్క శాసనసభ నియోజకవర్గము కూడా రిజర్వుడు కిందికి రాకపోవడం ఈ లోక్‌సభ నియోజకవర్గం యొక ప్రత్యేకత.[2][3]

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గపు జనాభా : 18,66, 386
  • ఓటర్ల సంఖ్య : 12,71,976
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 14.03%, 5.32%

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మరింత సమాచారం లోక్‌సభ, సంవత్సరం ...
లోక్‌సభ సంవత్సరం పదవీకాలం గెలిచిన అభ్యర్థి పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ ఆధిక్యత
మొదటి 1952 1952 - 1957 హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ కాశీనాథరావు ముక్పాల్కర్ సోషలిస్టు పార్టీ 31201[4]
రెండవ 1957[5] 1957-62 హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ గడ్డం రాజారాం స్వతంత్ర అభ్యర్థి 37529
మూడవ 1962[6] 1962-67 హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ ఎం. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థి 27020
నాలుగవ 1967[7] 1967-71 ఎం. నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థి హెచ్.సి.హెడా భారత జాతీయ కాంగ్రెస్ 20245
ఐదవ 1971[8] 1971-77 ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కె.అనంతరెడ్డి తెలంగాణా ప్రజాసమితి 59737
ఆరవ 1977[9] 1977-80 ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ గడ్డం గంగారెడ్డి బి.ఎల్.డి 159393
ఏడవ 1980[10] 1980-84 ముదుగంటి రామగోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.ఎం.ఖాన్ జనతా పార్టీ 200315
ఎనిమిదవ 1984[11] 1984-89 తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ ఎం.నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2547
తొమ్మిదవ 1989[12] 1989-91 తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ పి.శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ 24099
పదవ 1991[13] 1991-96 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ తాడూరి బాలాగౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 68348
పదకొండవ 1996[14] 1996-98 గడ్డం ఆత్మచరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ మండవ వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీ 43599
పన్నెండవ 1998[15] 1998-99 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ గడ్డం ఆత్మచరణ్ రెడ్డి భారత జనతా పార్టీ 32756
పదమూడవ 1999[16] 1999-04 గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ శనిగరం సంతోష్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 3436
పదునాలుగవ 2004[17] 2004-09 మధు యస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ సయ్యద్ యూసుఫ్ అలీ తెలుగుదేశం పార్టీ 137871
పదిహేనవ 2009[18] 2009-14 మధు యస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ బిగళ గణేష్ గుప్తా తెలంగాణా రాష్ట్ర సమితి 60390
పదహారవ 2014[19] 2014-2019 కల్వకుంట్ల కవిత తెలంగాణా రాష్ట్ర సమితి మధు యస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ 167184
పదిహేడవ 2019 [20] 2019 - 2024 ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవిత తెలంగాణా రాష్ట్ర సమితి
18వ 2024[21] 2024 - ప్రస్తుతం ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ టి.జీవన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 10,9,241
మూసివేయి

2004 ఎన్నికలు

2004 ఎన్నికల ఫలితాలను చూఫే "పై" చిత్రం

  సయ్యద్ యూసుఫ్ ఆలీ (38.89%)
  యడ్ల రాము (2.70%)
  బైసా రామదాసు (1.90%)
మరింత సమాచారం Party, Candidate ...
భారత సాధారణ ఎన్నికలు,2004:నిజామాబాదు
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ మధు గౌడ్ యాష్కీ 442,142 56.51 +7.46
తెలుగుదేశం పార్టీ సయ్యద్ యూసుఫ్ ఆలీ 304,271 38.89 -10.62
బహుజన సమాజ్ పార్టీ యడ్ల రాము 21,133 2.70
Independent బైసా రామదాసు 14,893 1.90
మెజారిటీ 137,871 17.62 +18.08
మొత్తం పోలైన ఓట్లు 782,439 69.37 +0.49
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +7.46
మూసివేయి

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బి.గణేష్ గుప్తా పోటీ చేస్తున్నాడు.[22] భారతీయ జనతా పార్టీ తరఫున సి.జంగయ్య పోటీలో ఉన్నాడు.[23] కాంగ్రెస్ పార్టీ తరఫున మధు యాస్కీకి టికెట్ లభించింది.[24] ప్రజారాజ్యం పార్టీ తరఫున పుంజుల విజయ్‌కుమార్ పోటీపడుతున్నాడు.[25]

2024 ఎన్నికలు

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 29 మంది పోటీలో ఉన్నారు.[26]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.