ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, నాయుడుపేట మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
నాయుడుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లా పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం.
పట్టణం | |
Coordinates: 13.9°N 79.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండలం | నాయుడుపేట మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 19.40 కి.మీ2 (7.49 చ. మై) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్(PIN) | 524126 |
Website |
ఇది నెల్లూరు నగరమునకు సుమారు 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుండి 108 కిలోమీటర్లు, తిరుపతి నుండి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాయుడుపేట పట్టణం తిరుపతి జిల్లాలో ముఖ్యమైన కూడలి.ఈ పట్టణం గుండా చెన్నై,తిరుపతి,నెల్లూరు వంటి నగరములకు రోజూ అధిక సంఖ్యలో ప్రయాణీకులు వెల్తుంటారు.
ఈ ఊరు స్వర్ణముఖినది ఒడ్డున ఉంది. ఈ నది శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరి అటుపైన వాకాడు మీదుగా బంగాళాఖాతములో కలుస్తుంది.
ఈ పట్టణ జనాభా సుమారు 50 వేలు.
నాయుడుపేట పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-16) మీద చెన్నై-నెల్లూరు ల మధ్య ఉంది. చెన్నై-విజయవాడ రైలు మార్గములో ఈ పట్టణం ఉంది.
ఈ మండలంలో ప్రధాన వాణిజ్య పంట చెరకు. దీనితోపాటుగా వరిని కుడా సాగు చేస్తారు.
Seamless Wikipedia browsing. On steroids.