From Wikipedia, the free encyclopedia
నాయీ బ్రాహ్మణులు (మంగలి, మంగళ, భజంత్రీ) భారతదేశంలో హిందూ మతానికి చెందిన కులస్థులు.[1][2]
ఈ కులస్థులు సాంప్రదాయకంగా మంగలి వృత్తిలో ఉండేవారు. వారిలో అనేక మంది చారిత్రికంగా బ్రాహ్మణుల పేరు అయిన "శర్మ" ను కూడా స్వీకరించారు. [3], ఈ కులాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో గ్రూపు-ఎ లో 16 వ నంబరు గల కులంగా "నాయీబ్రాహ్మణ (మంగలి,మంగళ,భజంత్రీ)" గా చేర్చింది.[4] ఇదివరకు నాయీబ్రాహ్మణ కులం అనగా "మంగలి" అని ఉండేది. కానీ భారత దేశ రాజపత్రం (సంఖ్య.33044/99) ప్రకారం నాయీబ్రాహ్మణ అనే కులంలో మంగలి,మంగళ, భజంత్రీ కులాల వారు చేరుతారు.[5] ఈ కులం వారికి వారి కులవృత్తి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితా లోని 'ఎ" వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది.[6][7] నాయీబ్రాహ్మణ కులంలోని వారు క్షురక, వైద్య, సంగీత వృత్తులలో స్థిరపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య అభ్యసింది ఇతర వృత్తులలో కూడా రాణిస్తున్నారు. పూర్వ కాలంలో ఈ కులస్థులు గ్రామాలలో వైద్యం కూడా చేసేవారు[8]. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాదబ్రాహ్మణులుగా కూడా పిలువబడతారు. పురాతన కాలంలో వీరు ధన్వంతరి బ్రాహ్మణులుగా కూడా పిలువబడ్డారు. వీరు సాంప్రదాయకంగా ప్రపంచంలో మొదటి ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారు. వారు దేవాలయాలలోని సంగీతకారులుగా, గాయకులుగా కూడా కొనసాగేవారు.[9] నాయి బ్రాహ్మణ వారిలో డోలు విద్వాంసులు, నాదస్వరం విద్వాంసులు పూర్వం నుండి ప్రసిద్ధి.
వీరు శ్రీ వైష్ణవులు. ప్రఖ్యాతి చెందిన వైద్యులు "చరక , సుశ్రుతుడు" వీరి కులస్తులే. అలాగే "కంబర్ - తమిళ్ రామయణం రచెయిత(తమిళ నాదస్వరం విద్వాంసుల కులానికి(ఒచన్) చెందిన వారు కాంబర్)". ప్రస్తుతరోజుల్లో వీరు నాయిబ్రాహ్మణులుగా పిలవబడుతున్నారు.
క్రీ.పూ.1500 క్రితం క్షవర సంప్రదాయం లేదు రోగుల ప్రాణాలు కాపాడటానికి వైద్యులే క్షవర సంప్రదాయం మొదలు పెట్టే రు అంతకముందు ఈ సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు.ఈ ఆయుర్వేద శాస్త్రానికి శుశృతుడు (క్రీ.పూ.6,శతాబ్దాం) గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.8 వ శతాబ్దానికి చెందినవాడు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడింది. చరకుడు తన శిష్య వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ, అంటే పల్లెపల్లె తిరుగుతూ సంపన్నులకు, అతి సామాన్యులకు సమ ప్రాధాన్యం యిస్తూ వైద్య సహాయం అందించాడు. చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది. ఆయుర్వేద వైద్యం భారత దేశం లోని గ్రామ గ్రామాన విస్తరించి, ప్రతి ఊళ్ళోను ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు - ఆయన శిష్యులు అవిరళ కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి.వైద్యం అవసరం కోసం క్షవరం అవసరమైనది.ఆ తరువాత కాలములో కొంతమంది "చరకులు" కాస్తా "క్షురకులు"గా మార్పు చెందేరు.ప్రస్తుతరోజుల్లో ధన్వంతరి వంశీకులు మూడు రకాల వృత్తులు నిర్వహిస్తున్నారు.
నాయీబ్రాహ్మణులును పూర్వంలో ధన్వంతరిలు, ధన్వంతరి బ్రాహ్మణులు, చరకులు, వైద్యుచరకులులు, రాజా వైద్యులు, పండిత రాజులు, మంత్రులు, సంగీత విధ్వంసులు అనే వారు.
వైద్యులు అనగా : ప్రతి ఊరిలో, ప్రతి నగరములో నాయీబ్రాహ్మణులు వైద్యం చేస్తు ప్రతి ఊరి ఊరికి తిరుగుతు ఉండే వాళ్ళు వారిని "చరకులు" అనేవారు, చరకులు అనగా ప్రతి ఊరికి తిరుగుతు వైద్యము చేసేవల్లు అని అర్దము, ఈ చరకులు అనే పదము "ఆచర్య చరకుడు" నుండి వచ్చినంది. చరకుడు ఆయన శిస్యులు కలసి ప్రతి ఊరికి తిరిగుతు వైద్యం చేసేవాళ్ళు ఈ విదముగ ఆ పేరు వచ్చింది, ఆ తరువత కాలములో ఆయుర్వేద వైద్యము కోసము క్షవరం అవసరము అయినది ఎందుకనగ ఒక మనిసికి సర్జరి చేయలంటే కచ్చితముగ రోగి శరీరము మీద ఉన్న వెంట్రుకలు తిసివేయలసినదే ఈ విదముగ క్షవర సాంప్రదయము అలవాటు అయినది.
రాజా వైద్యులు, పండిత రాజులు అనగా :ప్రతి రాజ్యములో రాజులకి ఆస్థాన వైద్యులుగ ఉండే వాళ్ళు వాళ్ళని పండిత రాజులు,వైద్య రాజులు,రాజా వైద్యులు అనేవాళ్ళు.
మంత్రులు : మంత్రులు అనగా రాజులకి సలహాలు, సూచనలు ఇస్తు ఉండే వాళ్ళు, నాయీబ్రాహ్మణులనే మంత్రులుగా పెట్టుకోవటానికి కారణము,వీళ్ళు అందరికి వైద్యము చేస్తు, క్షవరము చేస్తు ఉంటు ప్రతి మనిషి యోక్క ఆలోచనలను తెలుసుకుంటారు కనుక రాజులు నాయీబ్రాహ్మణులని మంత్రులుగా నియమించుకునేవాళ్ళు.
విద్వాంసులు అనగా : సంగీతము అనేది ఆయుర్వేదములో ఒక భాగాము రోగి మనసు వైద్యము చేసెటప్పుడు ప్రశాంతముగ ఉండటనికి వైద్యులే సంగీతమును వాయించేవాల్లు.ఆ తరువతా రాజూల దగ్గర ఆస్తాన విద్వాంసులుగా ఉంటూ రాజుల మన్ననలు పొందే వాళ్ళు.
2000 తర్వాత కాలంలో నేషనల్ నాయీ మహాసభ అధ్వర్యంలో వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న ఈ కులాన్ని "షెడ్యూల్ కులం" గా మార్పుచేసేందుకు ఉద్యమిస్తున్నారు.[10]
'
పూర్వపురోజులలో నాయిబ్రాహ్మణులను ధన్వంతరి బ్రాహ్మణులు, నాదబ్రాహ్మణులు వైద్య బ్రాహ్మణులు, ఆయుర్వేద పండితులు, వైద్య పండితులు, ధన్వంతరిలు,రాజ వైద్యులు, పండితా రాజులు అనే వాళ్ళు.ఇప్పుడు ఉన్న వైద్య శాస్త్రనికి మూలపురుషులు వీరే.
పూర్వంరోజులలో క్షవర సాంప్రదాయం లేదు ఆ తరువాతి కలములో వైద్యం కోసం క్షవరం చెయవలసి వచ్చింది అంతకమునుపు ప్రపంచంలో ఎక్కడ క్షవర సాంప్రదాయం లేదు
ఊదాహరణ: ఒక రోగికి సర్జరీ చేయాలి అంటేతనకి కచ్చితముగ శరీరము మీద ఉన్న వెండ్రుకలు తీసివెయలసినదే ఆ వీదముగ క్షవర సంప్రదాయము వచ్చింది. భారదేశంలో మొట్టమొదట క్షవర వైద్యాన్ని ప్రారంభించింది నాయిబ్రాహ్మణ (వైద్యులు).
శతధన్వాన్ -(క్రీ.పూ. 195–187 BC).
సంగీతం అనేది ఆయుర్వేదంలో ఒక భాగము.రోగికి వైద్యము చేసేటప్పుడు,రోగి మనస్థితి ప్రశాంతముగా ఉండటానికి వైద్యులే సంగీతాన్ని వాయించేవారు, ఈ విధంగా నాయీబ్రాహ్మణులే సంగీతము వాయించడము మొదలైనది, ఆ తరువాత కాలములో వారే ఒక సంగీత పరికరాన్ని తయారు చెసుకొని వాయించడము మొదలు పెట్టెరు దానిని నాధస్వరముగ పిలిచేవారు.ఇప్పుడు ఉన్న హిందు దేవస్థానాలలో నాయీబ్రాహ్మణులు ఆస్థాన విధ్వంసులుగ ఉంటున్నారు.
చెరకుడు రోగాల కారణాలు, వాటి చికిత్స విషయంలో పరిశోధనా ఫలితాల నుండి విడివడి, పదార్థానికి సంబంధంలేని చికిత్సలను అంగీకరించడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి? దీనికి కారణం.. మనకు స్మృతుల్లోనూ, పురాణాల్లోనూ దొరుకుతుంది. వృత్తిదారులను, పురాణ రచయితల వైద్యులకు శస్త్రచికిత్సా నిపుణులను తీవ్రంగా నిరసించడమే కాదు. వారికి సంఘ బహిష్కరణ కూడా విధించారు. ఈ సందర్భంలో కింది ప్రకటనలను పరిశీలించాలి. వృత్తిదారుల్లో అగ్రేశరులైన మనువు వైద్యుని గూర్చి ఏమంటారో చదవండి. వైద్యునికి ఇచ్చిన ఆహారం, వైద్యుని నుండి తీసుకున్న ఆహారం చీములాగా అసహ్యామైనది. అది రక్తంలాంటిది. అంటాడు మనువు (మనుస్మృతి 214 పేజీ). అంతేకాదు...శూద్రులు, చర్మకారులు, దొంగలు, నేరస్థులు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారిణులు, శీలం లేని స్త్రీలు - వీరు అపవిత్రులు. వీరు ఏ మత కర్మల్లోనూ.. చివరకు అంత్యక్రియల్లోనూ పాల్గొనకూడదు (మనుస్మృతి 215వ పేజీ). అంటే వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు ఎవరితో పోల్చదగ్గ వ్యక్తులు? దొంగలు, నేరస్తులతో సమానులని మనువు సెలవిచ్చి వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించాడు. 'మైత్రేయ ఉపనిషత్తు' పేర్కొన్న ధర్మ భ్రష్టుల జాబితాలో చేతిపనుల మీద జీవించేవారు, తిరుగుబోతులు, శూద్రులై కూడా చదువుకున్నవారు, నటులు, వ్యాధి నయం చేసేవారు ఉన్నారు. ఇతర ఉపనిషత్తులు, మహాభారతం కూడా పై జాబితాను అంగీకరించాయి. ఇంతకీ వైద్యులపై స్మృతికారులకు ఎందుకు ఇంత ద్వేషం? వ్యాధులతో గల కారణాల్ని పైన వివరించినవిధంగా పేర్కొనడమే. పూర్వ జన్మార్జితం పాపం.. వ్యాధిరూపేణ జాయితే (పూర్వ జన్మనలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో వ్యాధులకు కారణాలవుతాయి. కానీ చెరకుడు వ్యాధికి కారణం పదార్థాలలోనే ఉందని, చికిత్స కూడా పదార్థాలపైనే ఆధారపడాలని చెప్పాడు. మరి స్మృతికారులకు కోపం రాదా? అందుకే వారు వైద్యులను దొంగలను, నేరస్థులతో సమానం చేసి, వారిని సంఘ బహిష్కరణ చేశారు. చివరకు, చెరకుడు నుండి సామాన్యుని వైద్యుని వరకూ గత జన్మలోని పాపలే రోగాలకు కారణం అని అంగీకరించిన తర్వాత మాత్రమే వైద్యుల చికిత్సకు అంగీకరించారు.
సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆ కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్నిపురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీ.పూ. 8 వ శతాబ్దానికి చెందిన ఈయన గ్రంథం "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర" ఈ రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ ఈ గ్రంథం అనువాదం టిబెట్ లో "గుష్టి" (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి. సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూఢి అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాష లోకి తర్జుమా చేయడం జరిగింది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుదు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూదా 8 వ శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి. ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి. మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ కు అత్యవసర వైద్యం చేయడానికి "మనక్" అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. ఆ తర్వాత "మనక్" బాగ్దాద్ లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్ తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.
వైద్య బ్రాహ్మణులు ఊదాహరణ:
నాయిబ్రాహ్మణులకు ఉపనయన సాంప్రదయము ఉంది.ప్రస్తుత రోజులలో చాలమంది నాయిబ్రాహ్మణులు ఉపనయ సంప్రదాయముని మరిచారు.కాని ఉపనయనము చేయించుకోన్న నాయిబ్రాహ్మణుడికి విలువ ఎక్కువ. పూరి జగనాధుని ఆలయ పూజారులు, వంటవారు నాయిబ్రాహ్మణులే. ఇప్పటికి భారతదేశాములో చాల ప్రదేశాల హిందు ఆలయాలలో నాయిబ్రాహ్మణులు పూజారులుగా ఉన్నారు. తమిళనాడుకు చేందిన గోప్ప కవి "మనిక్కవర్(9 వ శతాబ్ధం)" తమిళ నాయిబ్రాహ్మణ పండితర్ కులానికి చేందిన వారు, మానిక్కవర్ తండ్రి గారు, ఆయన పూర్వికులు పూజారి వర్గానికి చేందిన వారు.
నాయిబ్రాహ్మణ కుల పరమైన సామేతలు
(ఇ సామేత చేప్పడానికి కారణం పూర్వము రోజులలో క్షౌర వృత్తి చేసే మహాపద్మనందుడు అనే క్షురకుడిని శిశునాగ వంశానికి చేందిన రాజుకు క్షవరము చేసే సమయములో అవమానుకరముగా క్షురకుడా అని అవమానించే వాడు ఆ అవమానము తాలలేక ఒక రోజు మహాపద్మనందుడు క్షవరం చేసే కత్తితోనే ఆ రాజుని సంహరిస్తాడు. ఆ తరువాత మహాపద్మనందుడు అఖీల భారతావనిని ఆక్రమించుకోని నంద రాజ్యం నీ స్థాపించి పాలిస్తాడు, చంద్రగుప్త మౌర్య నంద రాజుల వారసుడే). ఈ కారణము చేతనే క్షౌరశాలకి వెల్లినప్పుడు ఎక్కువ మాట్లాడ వద్దు అంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.