Remove ads
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో నలందా జిల్లా (హిందీ:) ఒకటి. బీహార్ షరీఫ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
నలందా జిల్లా
नालंदा जिला,ضلع نالندہ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
ముఖ్య పట్టణం | బీహార్ షరీఫ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | నలందా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,367 కి.మీ2 (914 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 28,72,523 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.41 (M=77.11; F=54.76) |
• లింగ నిష్పత్తి | 921 (2011) |
ప్రధాన రహదార్లు | NH 31, NH 82, NH 110 |
Website | అధికారిక జాలస్థలి |
1976లో పాట్నా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి నలందా జిల్లాను రూపొందించారు.[1]
నలందా జిల్లా వైశాల్యం 2355 చ.కి.మీ.[2] ఇది కెనడా లోని కార్న్‌వాల్ ద్వీపం వైశాల్యానికి సమానం.[3] జిల్లాలో ప్రధానంగా ఫల్గు, మొహన్, జిరాయన్, కుంభారి నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా పాట్నా డివిజన్లోభాగం.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,872,523,[4] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | కంసాస్ నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 134 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1220 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.18 %.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 921:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 66.41 %.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
కొత్తాగా స్థాపించబడిన ఆర్డినెంస్ ఫ్యాక్టరీ దేశంలోని 41 ఇండియన్ ఆర్డినెంస్ ఫ్యాక్టరీలలో ఒకటి. దీనిని డిఫెంస్ మంత్రిత్వశాఖ స్థాపించింది. నలందాలో ఆర్టిల్లరీ షెల్స్‌ను తయారు చేయడానికి ఈ సంస్థ స్థాపించబడ్జింది.[7][8] 2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నలందా జిల్లా ఒకటి అని గుర్తించింది.[9] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహారు రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[9]
1978లో నలందా జిల్లాలో 36కి.మీ విస్తీర్ణంలో " రాజ్‌గిర్ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " స్థాపించబడింది. .[10]
నలందా జిల్లా త్వరితగతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. అంతర్జాతీయ, జాతీయ పర్యాటకులను " నలందా విశ్వవిద్యాలయం " విపరీతంగా ఆకర్షిస్తుంది. పర్యాటకుల రాకవలన ప్రాతీయ వాసుల ఆర్థికంగా అభివృద్ధికి సహకరిస్తుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.