ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.
2016 నంది నాటకోత్సవంలో కొత్త మార్పులు వచ్చాయి. గతంలో మాదిరిగా ప్రాథమిక పరిశీలన లేకుండా, దరఖాస్తుచేసిన నాటక సమాజాలన్నీంటికి ప్రదర్శన అవకాశం, ప్రదర్శన పారితోషికం ఇచ్చారు. అంతేకాకుండా, ఈ నంది నాటకోత్సవాన్ని ఒకేసారి మూడు వేరువేరు ప్రాంతాలు (గుంటూరు, కర్నూలు, విజయనగరం)లో నిర్వహించారు.[1] జనవరి 18న ప్రారంభమైన ఈ నాటకోత్సవాలు ఫిబ్రవరి 15న ముగిసాయి.[2] విజేతలకు 2017 ఏప్రిల్ 30న రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో కోడెల శివప్రసాద్, మురళీమోహన్ తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది.[3][4]
ప్రదర్శనలు
- నంది నాటక పరిషత్తు - 2016 గుంటూరు ప్రదర్శనలు
- నంది నాటక పరిషత్తు - 2016 కర్నూలు ప్రదర్శనలు
- నంది నాటక పరిషత్తు - 2016 విజయనగరం ప్రదర్శనలు
బహుమతులు
నంది నాటక పరిషత్తు - 2016 యొక్క బహుమతుల వివరాలు కింద ఇవ్వడమైనది. తొలిసారిగా 2016 ఎన్‌టిఆర్ రంగస్థల పురస్కారాన్ని గుమ్మడి గోపాలకృష్ణ అందుకున్నారు.[5][6]
పద్యనాటకం
- ఉత్తమ ప్రదర్శన: సతీ సావిత్రి (లలిత కళా పరిషత్తు, అనంతపురం)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: ప్రమీలార్జున పరిణయం (లలిత కళా సమితి, కర్నూలు)
- తృతీయ ఉత్తమ ప్రదర్శన: చాణక్య చంద్రగుప్త (ఖమ్మం కల్చరల్ అసోసియేషన్, ఖమ్మం)
- ఉత్తమ దర్శకుడు: పత్తి ఓబులయ్య (ప్రమీలార్జున పరిణయం), జి.నారాయణ స్వామి (సతీ సావిత్రి)
- ఉత్తమ నాటక రచయిత: పల్లేటి లక్ష్మీకులశేఖర్ (ప్రమీలార్జున పరిణయం)
- ద్వితీయ నాటక రచయిత: హెచ్‌విఎల్ ప్రసాద్
- తృతీయ నాటక రచయిత: టి. నరసింహరావు
- ఉత్తమ నటుడు: కె. బాల వెంకటేశ్వర్లు (అర్జునుడు, ప్రమీలార్జున పరిణయం), ఎస్. నరసింహులు (సత్యవంతుడు, సతీ సావిత్రి)
- ఉత్తమ నటి: కె. వనజకుమారి (సతీ సావిత్రి)
- ఉత్తమ సంగీతం: యు. రామలింగయ్య
- ఉత్తమ సహాయ నటుడు: బాగాది విజయసారథి
- ఉత్తమ హాస్యనటి: ఎస్.విజయమ్మ
- ఉత్తమ హాస్య నటుడు: వంకాయల మారుతీ ప్రసాద్
- ఉత్తమ బాల నటుడు: మాస్టర్ పి.అక్బర్
- ఉత్తమ బాల నటి: పి.హాసిని
- ఉత్తమ ప్రతి నాయకుడు: జి.నారాయణ స్వామి
- ఉత్తమ రంగాలంకరణ: పి.ఆనంద్
- ఉత్తమ రంగోద్దీపనం: సురభి సంతోష్
- ఉత్తమ ఆహార్యం: పి. శ్రీనివాసు
సాంఘీక నాటకం
- ఉత్తమ ప్రదర్శన: అక్షర కిరీటం (గంగోత్రి, పెదకాకాని)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: జారుడుమెట్లు (కళాంజలి, హైదరాబాద్)
- తృతీయ ఉత్తమ ప్రదర్శన: ఇంటింటి కథ (విజయాదిత్య ఆర్ట్స్, రాజమండ్రి)
- ఉత్తమ దర్శకుడు: నాయుడు గోపి (అక్షర కిరీటం)
- ఉత్తమ నాటక రచయిత: డా. పి.వి. రామ్ కుమార్ (అక్షర కిరీటం)
- ద్వితీయ ఉత్తమ నాటక రచయిత: అట్టాడ అప్పలనాయుడు (మడిసెక్క)
- ఉత్తమ నటుడు: కె. విజయమోహన్ (అమ్మను కాపాడుకుందాం)
- ఉత్తమ నటి: రజనీ శ్రీకళ (జారుడుమెట్లు)
- ఉత్తమ సంగీతం: కె. నాగేశ్వరరావు
- ఉత్తమ సహాయ నటి: డి. రమాదేవి
- ఉత్తమ హాస్య నటుడు: టి. విశ్వనాథం
- ఉత్తమ బాల నటుడు: కెఎస్ ప్రణీత్ కుమార్
- ఉత్తమ బాల నటి: సిహెచ్. కోమలిదేవి
- ఉత్తమ ప్రతి నాయకుడు: పిఎస్. సత్యనారాయణ
- ఉత్తమ రంగాలంకరణ: పి. సురభి జయవర్థన్
- ఉత్తమ రంగోద్దీపనం: జెట్టి హరిబాబు
- ఉత్తమ ఆహార్యం: మల్లాది గోపాలకృష్ణ
సాంఘీక నాటిక
- ఉత్తమ ప్రదర్శన: చాలు ఇకచాలు (శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: రెండు నిశబ్ధాల మధ్య (అభినయ ఆర్ట్స్, గుంటూరు)
- తృతీయ ఉత్తమ ప్రదర్శన: తేనేటీగలు పగపడ్తాయి (శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం, బొరివంక)
- ఉత్తమ దర్శకుడు: ఎన్. రవీంద్రరెడ్డి (రెండు నిశబ్ధాల మధ్య)
- ఉత్తమ నాటక రచయిత: గంధం నాగరాజు (అనంతం)
- ద్వితీయ ఉత్తమ నాటక రచయిత: రావుల పుల్లాచారి (రచ్చబండ)
- తృతీయ ఉత్తమ నాటక రచయిత: కె.కె.ఎల్. స్వామి (తేనేటీగలు పగపడ్తాయి )
- ఉత్తమ నటుడు: కరణం సురేష్ (అనంతం)
- ఉత్తమ నటి: అమృతవర్షిణి (యాది)
- ఉత్తమ సంగీతం: లీలామోహన్
- ఉత్తమ సహాయ నటుడు: పి.బాలాజీ నాయక్
- ఉత్తమ హాస్య నటి: ఎం. లక్ష్మి
- ఉత్తమ ప్రతినాయకుడు: అమరేంద్ర బొల్లంపల్లి
- ఉత్తమ రంగాలంకరణ: శివ
- ద్వితీయ ఉత్తమ రంగాలంకరణ: గిరి
- ఉత్తమ రంగోద్దీపనం: ఆర్. రామకృష్ణ
- ఉత్తమ ఆహార్యం: మల్లేశ్ బలష్టు
- ప్రత్యేక బహుమతులు: రంగయాత్ర, అనంతం
బాలల నాటిక
- ఉత్తమ ప్రదర్శన: ఎక్కడి వాళ్లు అక్కడే (శ్రీ ప్రకాష్ విద్యానికేతన్, విశాఖపట్టణం)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: అపురూపం (కళారాధన, శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల)
- తృతీయ ఉత్తమ ప్రదర్శన: భరోసా (కళాప్రియ లిటిల్ చాంప్స్, ఒంగోలు)
ఇవికూడా చూడండి
మూలాలు
ఇతర లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.