దేవ్‌గఢ్ జిల్లా (జార్ఖండ్)

ఝార్ఖండ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

దేవ్‌గఢ్ జిల్లా (జార్ఖండ్)

జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్‌ఘర్ (హింది: देवघर जिला ) జిల్లా ఒకటి. దేవ్‌ఘర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.ఈ జిల్లాలో వైధ్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది.ఈ జిల్లా శాంతల్ పరగణాలు డివిజన్‌లో భాగం.

త్వరిత వాస్తవాలు దేవ్‌ఘర్ జిల్లా देवघर जिला, దేశం ...
దేవ్‌ఘర్ జిల్లా
देवघर जिला
Thumb
జార్ఖండ్ పటంలో దేవ్‌ఘర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుసంతాల్ పరగణా
ముఖ్య పట్టణందేవ్‌ఘర్
Government
  లోకసభ నియోజకవర్గాలు1. దుమ్కా 2. గొడ్డా
  శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
  మొత్తం2,478.61 కి.మీ2 (957.00 చ. మై)
జనాభా
 (2011)
  మొత్తం14,91,879
  జనసాంద్రత600/కి.మీ2 (1,600/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత66.34 %
  లింగ నిష్పత్తి921
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

చరిత్ర

1983 జూన్ 1 లో శాంతల్ పరగణాలు జిల్లాలోని దేవ్‌ఘర్ ఉపవిభాగాన్ని వేరుచేయుట ద్వారా ఈ జిల్లా రూపొందింది.

భౌగోళికం

దియోగర్ జిల్లా సంతాల్ పరగణాల పశ్చిమ భాగంలో ఉంది. ఇది ఉత్తరాన భాగల్పూర్ జిల్లా, దక్షిణ, తూర్పున దుమ్కా , పశ్చిమాన గిరిధి సరిహద్దులుగా ఉంది. జిల్లా 24.03' , 23.38' N అక్షాంశం, 86.28', 87'.04' E రేఖాంశం నుండి విస్తరించి 2481 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉంది.

జిల్లాలో రాళ్ళతో గుట్టల, అరణ్యాలతో నిండిన కొండలు ఉన్నాయి. జిల్లాలో మద్యమద్య లోయలతో పర్వతావళి కూడా ఉంది. ఈ పర్వతావళిలో ఎగువభూమి పంటలు (హైలాండ్ క్రాప్స్) పండినబడుతున్నాయి. జిల్లా సరాసరి ఎత్తు సముద్రమట్టానికి 247 మీ. పహుల్జారీ (750 మీ), టెరర్ (680), (575 మీ) లో ఉన్నాయి. ఎగువభూలు ఉత్తరం నుండి పడమర దిశ వైపు, తూర్పు నుండి దక్షిణం వైపు విస్తరించి ఉన్నాయి. భౌగోలికంగా జిల్లా చోటానాగపూర్ " గ్రానైట్ గ్నీస్ ఆఫ్ ఆర్చీన్ ఏజ్ "లో భాగం. వీటి మద్య చిన్నచిన్న సారవంతమైన భూభాగాలు, ఇసుకరాళ్ళు , గొండ్వానా నిర్మాణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో అజయ్ , పాల్ట్రొ ప్రధానమైనవి. ఈ నదులకు పలు ఉపనదులు ఉన్నాయి.

నగరాలు , గ్రామాలు

దేవ్ఘర్, మధుపూర్ చిత్ర, జముయా, చరక్మరా, దేవీపూర్, శర్వాణ్, శరత్, కరాన్, మోహంపూర్, రోహిణి, బగబంగయా, ఘొర్లాష్, జసిధి, కొరొధి, రాయ్ధి,గిధయ, జిత్జొరి.

బ్లాకులు

దేవ్‌ఘర్ సదర్, మోహంపూర్, శర్వాణ్, శరత్, పలోజొరి, మధుపూర్, కరాన్, సొనారై థరి, దేవీపూర్. మార్గో ముండా భఘ్మరి.

వాతావరణం

  • వేసవి మార్చ్-మే మాసం వరకు.
  • జూన్ -సెప్టెంబర్ వరకు వర్షపాతం
  • అక్టోబర్-ఫిబ్రవరి మాసాలలో శీతాకాలం.
  • సరాసరి వర్షపాతం 1239 మి.మీ.
  • గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్షియస్.
  • శీతాకాల కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీలు.

ఆర్ధికం

2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దేవ్‌ఘర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[1]

డివిజన్లు

  • జిల్లాలో 10 బ్లాక్స్ ఉన్నాయి: Deoghar సదర్, Karon, మధుపూర్, Mohanpur, Palojori, శరత్, Devipur, Margomunda, సర్వాన్ , Sonaraithadi
  • ఈ జిల్లాలో 3 విధానసభకు నియోజకవర్గాలు ఉన్నాయి: మధుపూర్, శరత్ , Deoghar: .
  • శరత్ దుమ్కా లోక్ సభ నియోజకవర్గం భాగంగా ఉండగా మధుపూర్ , Deoghar, Godda లోక్ సభ నియోజకవర్గం భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,491,879,[2]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 337వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 602 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.02%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 66.34%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.
మూసివేయి

సంస్కృతి

పర్యాటక ఆకర్షణలు

బి. దేవ్‌ఘర్ పర్యాటకులకు అద్భుతమైన ప్రదేశం. శ్రావణ మాసంలో శివుని దర్శించడానికి దేశం అంతటి నుండి వేలాది భక్తులు వస్తుంటారు. జిల్లాకు భక్తులు అత్యధికంగా శ్రావణమాసంలో వస్తారు. జిల్లాలో త్రికూట్ పర్వతం, తపోవన్ కొండలు, నందన్ పహర్, పాగల్ బబా ఆశ్రమం, వినోదం కలిగించే ఇతర పలు ప్రదేశాలు ఉన్నాయి.

  • జైదీహ్ రైల్వే స్టేషను సమీపంలో ఉన్న 1837-1960లో స్థాపించిన బాబా హంసదేవ్ అనధూత్ కైలాష్ పహర్ ఆశ్రమం ధ్యానంచేయడానికి అత్యుత్తమ ప్రదేశంగా భావించబడుతుంది.

జైదీహ్ రైల్వే స్టేషను‌కు ఇది 1.25 కి.మీ దూరంలో ఉంది.

సానన్ మేలా

బాబాధాం ప్రాముఖ్యత శ్రావణమాసంలో అధికరిస్తుంది. ఈ సమయంలో వైద్యనాథ్ ఆలయానికి లక్షలాది భక్తులు వస్తుంటారు. యాత్రీకులు ఇక్కడకు వచ్చే ముందు దేవ్‌ఘర్‌కు 150కి.మీ దూరంలో ఉన్న సుల్తాన్‌గంజ్‌కు చేరుకుంటారు. సుల్తాన్‌గంజ్‌లో గంగా నది ఉత్తరదిశగా ప్రవహిస్తుంది. అందువలన యాత్రీకులు గంగా జలాన్ని కళశాలలో తీసుకుని భుజం మీద పెట్టుకుని తీసుకువెళుతుంటారు. సుల్తాన్‌గంజ్‌ నుండి భక్తులు 109 కి.మీ ప్రయాణించి శివనామం స్మరిస్తూ వైద్యనాథ్ ఆలయానికి చేరుకుంటారు. బబాధాం చేరుకున్న తరువాత భక్తులు శివగంగలో స్నానం చేస్తారు. తరువాత బాబామందిరం చేరుకుని శివుని జ్యోతిర్లింగానికి గంగాజలం అందిస్తారు. ఈ యాత్ర శ్రావణమాసం అంతా (30 రోజులు ) కొనసాగుతూ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మత ఉత్సవంగా గుర్తింపు పొందింది. బాబాధాంకు దేశవిదేశాల నుండి అనేకమంది భక్తులు సంవత్సరం అంతా వస్తుంటారు. 109 కి.మీ దూరం ఉన్న సుల్తాన్‌గంజ్‌- దేవ్‌ఘర్‌ మార్గం నిరంతర కాషాయవస్త్ర ధారులతో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ 30 రోజులలో దాదాపు 5.5 మంది భక్తులు వైద్యనాధుని దర్శించుకుంటారు. వైద్యనాథ్ ఆలయంలో మార్చి మాసంలో శివరాత్రి, జనవరి మాసంలో వసంతపంచమి, సెప్టెంబరు మాసంలో భద్రపూర్ణిమా సందర్భాలలో ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

  • దేవ్‌ఘర్‌లో ఉన్న " రిఖియా ఆశ్రమం " ధ్యానకేంద్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇక్కడ బాలానంద్ బ్రహ్మచారి (సన్యాసి) స్థాపించిన రాం నివాస్ ఆశ్రమం మోహననంద్ స్వామి " మోహన్ మందిరం, స్వామి హంసదూత్ అవధూత్ స్థాపించిన కైలాష్ పహర్ జాసిధ్ ఆశ్రమం ఉన్నాయి.

ఆలయాలు పవిత్రప్రదేశాలు

  • అజ్గైబినాథ్,
  • బిజు ఆలయం,
  • బసుకినాథ్,
  • దేవ సంఘ మఠం,
  • దోల్మంచ్,
  • హరిల జోరీ,
  • హాథి పహార్ లేదా మహాదేవతరి ,
  • జైన్ టెంపుల్,
  • కైలాష్ పహార్ ఆశ్రమం,
  • కథికుండ్ దనినాథ్ శివాలయం,
  • కుండేశ్వరి,
  • లీల ఆలయం,
  • సేవా నికుంజ్,
  • మానసరోవర్,
  • నందన్ పహార్,
  • నౌలఖ ఆలయం,
  • పగలా బాబా ఆశ్రమం,
  • రిఖియా ఆశ్రమం,
  • రామ కృష్ణ మిషన్ విద్యాపీఠ్,
  • సత్సంగ్ నగర్ & ఆశ్రమం,
  • శీతల ఆలయం,
  • శివగంగ,.
  • శివ మందిర్ చిత్ర (జముయాలోని దేవాషిస్ హోం వద్ద),
  • తపోవనం,
  • తారాపీఠ్ ,
  • చిత్ర కోయల్యారీ (జముయా) దేవాసిస్ గ్రామంలో,
  • త్రికూట పర్వతం

ఇతర ఆలయాలు

  • తపోవన్- ఈ ఆలయం రామాయణం కాలం నుండి ఉందని భావిస్తున్నారు. రావణుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసాడని. హనుమంతుడు ఆ తపస్సును భంగం చేసాడని భావిస్తున్నారు.
  • నౌలఖ ఆలయం
  • బస్కినాథ్ ఆలయం
  • కినారినాథ్ ఆలయం, సర్వాన్
  • పత్రోల్ కాళీ మందిర్
  • దకై దుబే బాబా మందిరం (సర్వాన్)
  • నాయక్ ధాం, గంజోబరి దగ్గర జొరామొ రైల్వే స్టేషను.
  • దిండకొలి శివ మందిర్

విద్య

" దేవ్‌ఘర్ కాలీజ్ " 1951 లో దేవ్‌ఘర్ పట్టణంలో స్థాపినచబడింది. దుమ్కా లో ఉన్న " సిడో కంహు యూనివర్శిటీలో " ఈ ప్రాంతీయ కాలేజ్ భాగం.

రామక్రిష్ణ మిషన్ విద్యాపీఠ్

" రామకృష్ణ మిషన్ విద్యాపీఠ్ " (దేవ్‌ఘర్ ) 1922లో స్థాపించబడింది. ఈ పాఠశాల ప్రాథమిక , మాధ్యమిక స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తుంది. సాధారణంగా ప్రాంతీయవాసులు బంగ్లా విద్యాపీఠ్ అంటారు. ఈ పాఠశాల కొలాకత్తా,బేలూర్ రామక్రిష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇందులో మాధ్యమిక , ఉన్నత పాఠశాల విద్యార్ధులకు వసతిగృహ సౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఆధునిక సౌకర్యాలున్న వైద్యసౌకర్యాలను కలిగి ఉంది. పరిసరాలలో ఉన్నపేద కుంటుంబాలకు చెందిన విద్యార్ధులకు ప్రైవేట్ విద్యను అందిస్తుంది. నేషనల్ ఓపెన్ స్కూల్ సలహాతో పాఠశాలను మద్యలో వదిలిన విద్యార్ధులకు వొకేధనల్ ట్రైనింగ్ శిక్షణ ఇస్తుంది. అకేషనల్ కార్యక్రామాలను నిర్వహించి నివారణ , పునరావాసం వసతిని కల్పిస్తుంది.

  • The day scholar schools in deoghar has many dependable names to boast upon.
  • సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ (శాఖ deoghar),
  • సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల (jashidih శాఖ), జి.డి. DAV స్కూల్,
  • మోడరన్ పబ్లిక్ స్కూల్ . మొదలైనవి ప్రాంతలోని కొన్ని బాగా గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయి.
  • సమీపకాలంలో దేవ్‌ఘర్‌లో " బి.ఐ.టి మెష్రా (రాంచి) శాఖ ప్రారంభించబడింది.
  • సమీపకాలంలో ఆధునిక వసతులతో తక్షిల్లా విద్యాపీఠ్ ఆరంభించబడింది.

ప్రముఖులు

  • గత భారతీయ విదేశాంగ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రఙడు అయిన ముకుంద్ దుబే, ఒకప్పటి టి.వి జర్నలిస్ట్ కిషోర్ కుమార్ మాలవ్య దేవ్‌ఘర్‌కు చెన్ందిన వారు.
  • జార్ఖండ్ రాష్ట్రంలోని పలుజిల్లాలలో ప్రధాన న్యాయమూర్తి రాం రుద్ర ప్రసాద్ దేవ్‌ఘర్‌కు చెన్ందిన వారు. జార్ఖండ్, బీహార్ న్యాయవాదులలో ఆయన చాలా గుర్తింపు పొంది ఉన్నాడు.
  • జడ్జ్ దేవ్ కచ్చితమైన తీర్పుకు గుర్తింపు పొందాడు. ఆయన పలు చారిత్రిక తీర్పులను ఇచ్చాడు. సాంఘిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు, మానవహక్కులను రక్షించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించడు.

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.