From Wikipedia, the free encyclopedia
దేవిక (1943 - మే 2, 2002) ఒక తెలుగు సినిమా నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.[1]
దేవిక | |
---|---|
జననం | ప్రమీలా దేవి 1943 ఏప్రిల్ 25 |
మరణం | 2002 మే 2 59) | (వయసు
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1954–1986 |
జీవిత భాగస్వామి | దేవదాస్
(m. 1968; div. 1990) |
పిల్లలు | కనక (జ.1973) |
బంధువులు | రఘుపతి వెంకయ్య నాయుడు (తాత) |
ఈమె అసలు పేరు ప్రమీలాదేవి. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతానికి చెందినది
ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్తా ఒకింటి కోడలే, కంచుకోట, ఆడ బ్రతుకు సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్.టి.రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే రఘుపతి వెంకయ్య బంధువు. 2002 మే 2వ తేదీ తెళ్లవారు జామున మద్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.
రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.