దేనా బ్యాంకు

From Wikipedia, the free encyclopedia

దేనా బ్యాంకు

దేనా బ్యాంకు, భారతదేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులలో దేనా బ్యాంకు (Dena Bank) ఒకటి. ఈ బ్యాంకును 1938, మే 26దేవ్‌కరణ్ నాన్జీ కుటుంబంచే స్థాపించబడింది.ప్రారంభంలో దీనిని "దేవ్‌కరణ్ నాన్జీ బ్యాంకింగ్ కంపెనీ లిమిటెడ్" అనేపేరుతో స్థాపించారు.ఇది 1939 డిసెంబర్లో పబ్లిక్ కంపెనీగా మారిన తర్వాత దీని పేరు దేవ్‌కరణ్ నాన్జీ పదాలలోని ప్రారంభ అక్షరాల నుంచి " దేనా " పేరుతో "దేనా బ్యాంకు లిమిటెడ్"గా మార్పు చెందింది.1969లో, ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసిన 14 బ్యాంకులలో ఇది కూడా ఉంది. జాతీయం చేయబడిన తర్వాత దీని పేరులో లిమిటెడ్ తొలగిపోయి దేనా బ్యాంకుగా మారింది. దేశంలో మంచి మార్కెట్ షేర్లు కల్గియున్న బ్యాంకులలో ఇది ఒకటి.దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.ఇది 1,874 శాఖలను కలిగి ఉంది.

Thumb
2013 మే 24న న ముంబైలో జరిగిన దేనా బ్యాంకు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో అప్పటి ఆర్థిక మంత్రి, నామో నరేన్ మీనా ప్రసంగించిన చిత్రం.

భారత ప్రభుత్వం 2018, సెప్టెంబర్ 17 న దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ లను బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలపాలని ప్రతిపాదించింది.[1] [2]కేంద్ర క్యాబినెట్, బ్యాంకుల యాజమాన్య బోర్డులు విలీనానికి 2019, జనవరి 2 న ఆమోదం తెలిపాయి.దాని ప్రకారం 2019 ఏప్రియల్ 1 నుండి విలీనం అమలులోకి వచ్చింది.[3]

చరిత్ర

దేనా బ్యాంక్ దేవ్‌కరన్ నాన్జీ కుటుంబం చేత 26 మే 1938 మే 26 న దేవ్‌కరన్ నాన్జీ బ్యాంకింగ్ కంపెనీ పేరుతో స్థాపించబడింది.[4] ఇది డిసెంబరు 1939 లో పబ్లిక్ కంపెనీగా మారినప్పుడు దాని కొత్త పేరు దేనా బ్యాంకుగా మారింది.[5]భారత ప్రభుత్వం జూలై 1969 లో దేనా బ్యాంకుతో పాటు పదమూడు ఇతర ప్రధాన బ్యాంకులను జాతీయం చేసింది. అప్పటి నుండి దేనా బ్యాంక్ తద్వారా బ్యాంకింగ్ కంపెనీల (అక్విజిషన్ & ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్టేకింగ్స్) చట్టం, 1970 కింద ఏర్పడిన ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం 1949 లోని నిబంధనల ప్రకారం, బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం, 1949 లోని సెక్షన్ 6 లో పేర్కొన్న విధంగా ఇతర వ్యాపారాలను చేపట్టవచ్చు.

విలీనీకరణం

2018 సెప్టెంబరు 17 న, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్ అనే మూడు ప్రభుత్వ బ్యాంకులను ఒకే బ్యాంకుగా విలీనం చేయాలని ప్రతిపాదించింది.విలీనానికి కొన్ని ప్రధాన కారణాలు బలహీనమైన బ్యాంకులు వారి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వారి కస్టమర్ బేస్, మార్కెట్ పరిధిని పెంచడం, ప్రభుత్వ నిధులను బట్టి మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడటం.విలీనం చేయాలనే ప్రతిపాదన సమయంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ స్థూల ఎన్‌పిఎ నిష్పత్తులు వరుసగా 12.4%, 6.9%, 22% గా ఉన్నాయి. [13] దేనా బ్యాంక్ ఈ మూడింటిలో బలహీనంగా ఉంది.2019 సెప్టెంబరులో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న దేనా కార్పొరేట్ సెంటర్ (దేనా బ్యాంక్ ప్రధాన కార్యాలయం) ను వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.[5]

దేనా బ్యాంకు లోగో

దేనా బ్యాంక్ లోగో లక్ష్మీదేవిని వర్ణింస్తుంది.హిందూ పురాణాల ప్రకారం, సంపద దేవత లక్ష్మి దేవి. బ్యాంక్ తన ఖాతాదారులందరి శ్రేయస్సుకు చిహ్నంగా ఉండాలని బ్యాంక్ వ్యవస్థాపకులు కష్టమర్లకు ఈ లోగో ఆ వాగ్దానాన్ని సూచిస్తుందనే భావనతో నిర్ణయించారు. లోగోలోని సమకాలీన 'డి' చైతన్యం, అంకితభావం కస్టమర్ సంతృప్తి చెందేవిధంగా ప్రతిబింబిస్తుంది.[6]

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.