హిందూ పురాణకథనాలు
From Wikipedia, the free encyclopedia
హిందూ పురాణాల కథనాలలో హిందూ గ్రంథాలైన వేద సాహిత్యం, [1] మహాభారతం, రామాయణం, [2] పురాణాలు, [3] పెరియా పురాణం వంటి ప్రాంతీయ సాహిత్యాలలో కనిపించే కథనాలు. హిందూ పురాణాలలో విస్తృతంగా అనువదించబడిన ప్రసిద్ధ పంచతంత్ర, హితోపదేశం వంటి ప్రాంతీయ కథనాలు అలాగే ఆగ్నేయాసియా గ్రంథాలు కూడా భాగంగా ఉన్నాయి.[4][5]

హిందూ పురాణాలలో తరచుగా స్థిరమైన ఏకరూప రచనానిర్మాణం ఉండదు. అదే పురాణం సాధారణంగా వైవిధ్యమైన అంశాల మార్పిడి కనిపిస్తుంది. సామాజిక-మత సంప్రదాయాలలో పురాణాలు భిన్నంగా ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ పురాణాలను కాలక్రమేణా, ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివిధ తాత్విక పాఠశాలలు సవరించినట్లు గుర్తించబడింది. ఈ పురాణాలు లోతైన, తరచుగా సంకేత, అర్ధాన్ని కలిగి ఉండటానికి తీసుకోబడ్డాయి, వాటికి సంక్లిష్ట శ్రేణి వివరణలు ఇవ్వబడ్డాయి.[6]
సాహిత్యం
హిందూ పురాణ సాహిత్యం హిందూ గ్రంథాల తరంలో కనిపిస్తుంది:
ఈ ఇతిహాసాలు చాలా ఈ గ్రంథాలలో ఉద్భవించాయి, పాత్ర పేర్లు మారుతాయి లేదా కథ ఎక్కువ వివరాలతో అలంకరించబడి ఉంటుంది. అయినప్పటికీ కేంద్ర సందేశం, నైతిక విలువలు అలాగే ఉంటాయి. " వెండీ డోనిగరు " అభిప్రాయం ఆధారంగా
ప్రతి హిందూ ఇతిహాసం భిన్నంగా ఉంటుంది; అన్ని హిందూ ఇతిహాసాలు ఒకేలా ఉన్నాయి. (...) ప్రతి హిందూ ఇతిహాసం విశ్వం అనంతంగా ఉందని, ప్రతిదీ ఏకకాలంలో సంభవిస్తుందని, అన్ని అవకాశాలను మరొకటి మినహాయించకుండా ఉనికిలో ఉందనే నమ్మకాన్ని ప్రదర్శిస్తాయి. (...) హిందూ ఇతిహాసం ఒకేఒక ప్రాథమిక ప్రతి కూడా లేదు; ప్రతి ఒక్కటి సంవత్సరాలలో అనేక ప్రధాన, చిన్న వైవిధ్యమైన వివరణలతో, తిరిగి చెప్పబడింది. (...) గొప్ప ఇతిహాసాలు చాలా అస్పష్టంగా అంతుచిక్కనివిగా ఉంటాయి; వాటి సత్యాలను అధ్యయనకారులు చక్కని వర్గాలలోకి చేర్చలేరు. అంతేకాక పురాణాలు [హిందూ మతంలో] నిరంతరం మారుతున్న సాహిత్యరూపాలుగా ఉన్నాయి. (...)
—ఓ'ఫ్లేహర్టీ[8]
హిందూ ఇతిహాసాలు మొత్తం ఇతిహాసంలో కనిపించే సృజనాత్మక సూత్రాలను, మానవ విలువలను పంచుకుంటుంది. అయినప్పటికీ డోనిగరు అభిప్రాయం ఆధారంగా నిర్దిష్ట వివరాలు మారుతూ ఉంటాయి. ఈ వైవిధ్యం అపారమైనది.[9] హిందూ ఇతిహాసాలు ఉనికి స్వభావం, మానవ పరిస్థితి, దాని ఆకాంక్షల గురించి ఒకదానికొకటి విరుద్ధమైన పాత్రల ద్వారా, చెడుకి వ్యతిరేకంగా మంచిని, నిజాయితీ లేనివారికి వ్యతిరేకంగా నిజాయితీపరులు, ధర్మ వ్యతిరేక ధూర్తుడికి వ్యతిరేకంగా ధర్మ బంధువు, క్రూరమైన అత్యాశకు వ్యతిరేకంగా సున్నితమైన దయగలవాడు. ఈ ఇతిహాసాలలో పదార్థం, ప్రేమ, శాంతితో సహా ప్రతిదీ అశాశ్వతమైనది. ఇంద్రజాలికుల అద్భుతాలు వృద్ధి చెందుతాయి. దేవతలు ఓడిపోయి వారి ఉనికికి భయపడి యుద్ధాలు లేదా చర్చలను ప్రేరేపిస్తారు. మరణం జీవితాన్ని బెదిరిస్తుంది, తిరిగి బెదిరిస్తుంది. అయినప్పటికీ జీవితం సృజనాత్మకంగా తిరిగి ఉద్భవించటానికి ఒక మార్గాన్ని కనుగొనడం తద్వారా మరణాన్ని జయించింది. ఈరోస్ గందరగోళం నిరంతరం ప్రబలంగా ఉంటుంది.[9][10]
హిందూ ఇతిహాసాలు విస్తృతమైన విషయాలలో కలిసిపోతాయి. వాటిలో కాస్మోసు ఎలా, ఎందుకు ఉద్భవించింది (హిందూ కాస్మోలజీ, కాస్మోగోనీ), ఎలా, ఎందుకు మానవులు లేదా అన్ని జీవన రూపాలు ఉద్భవించాయి (మానవ శాస్త్రం), ప్రతి ఒక్కరి బలాలు బలహీనతలతో పాటు దేవతలు ఎలా పుట్టుకొచ్చారు (థియోగోనీ), యుద్ధం మంచి దేవతలు, చెడు రాక్షసులు (థియోమాచి), మానవ విలువలు, మానవులు ఎలా కలిసి జీవించగలరు, ఏవైనా విభేదాలు (నీతి, ఆక్సియాలజీ), జీవిత దశలలో ఆరోగ్యకరమైన లక్ష్యాలు, ప్రతి వ్యక్తి జీవించగల వివిధ మార్గాలు (గృహస్థుడు, సన్యాసి, పురుషార్థ ), జీవుల ఉనికికి అర్ధం, వ్యక్తిగత విముక్తి (సోటెరియాలజీ) అర్థం అలాగే కొత్త చక్రం (ఎస్కటాలజీ) పునఃప్రారంభంతో బాధలు, గందరగోళం, సమయం ముగిసే కారణాల గురించి ఇతిహాసాలు ప్రస్తావించింది.[11][12][13]
దశావతారాలు
వైష్ణవిజం సాంప్రదాయం భవంతుడి అవతారాల ముఖ్యమైన సేకరణలో విష్ణు అవతారాలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో పది సాధారణమైనవి:
- మత్స్య: ఇది చాలా ప్రాచీన సంస్కృతులలో కనిపించే మాదిరిగానే ఒక గొప్ప ప్రళయాన్ని వివరిస్తుంది. ఇక్కడ రక్షకుడు మత్స్య (చేప). మత్స్య పురాణాల తొలి వృత్తాంతాలు వేద సాహిత్యంలో కనిపిస్తాయి. ఇవి చేపరక్షకుడిని ప్రజాపతి దేవతతో సమానంగా చూపుతాయి. చేప-రక్షకుడు తరువాత వేదానంతర కాలంలో బ్రహ్మలో విలీనం అవుతాడు, తరువాత విష్ణు అవతారంగా గుర్తించబడతాడు. [14][15][16] మత్స్యతో సంబంధం ఉన్న ఇతిహాసాలు హిందూ గ్రంథాలలో విస్తరిస్తాయి. అభివృద్ధి చెందుతూ మారుతూ ఉంటాయి. ఈ ఇతిహాసాలు ప్రతీకవాదంలో పొందుపరచబడ్డాయి. ఇక్కడ మను రక్షణతో ఒక చిన్న చేప పెద్ద చేపగా పెరుగుతుంది, చేప చివరికి భూసంబంధమైన ఉనికిని కాపాడుతుంది.[17][18] [19]
- కుర్మ: కుర్మ అవతారం తొలి వృత్తాంతం శతాపాత బ్రాహ్మణ (యజుర్వేదం) లో కనుగొనబడింది. ఇక్కడ ఆయన ప్రజాపతి-బ్రహ్మ ఒక రూపం, సముద్ర మథనంలో (విశ్వ మహాసముద్రం చిలకడం) సహాయం చేస్తాడు.[20] ఇతిహాసాలు, పురాణాలలో, పురాణం విస్తరించి అనేక వైవిధ్యరూపాలలో అభివృద్ధి చెందింది. కూర్మ విష్ణువు అవతారంగా మారింది. ఆయన కాస్మోసు (పాలసముద్రం), కాస్మికు చర్నింగు స్టిక్ (పాలసముద్రాన్ని మధించడానికి ఉపకరించిన కవ్వం) (మందారా పర్వతం) కు పునాదికి మద్దతుగా కూర్మ (తాబేలు) రూపంలో కనిపిస్తాడు.[21][22][23]
- వరాహ: వరాహ (పంది) పురాణం తొలి వెర్షన్లు తైత్తిరియా అరణ్యక, శతపథ బ్రాహ్మణాలలో ఉన్నాయి. ఇవి వేద గ్రంథాలు.[24] విశ్వం ఆదిమ జలాలు అని వారు వివరిస్తున్నారు. భూమి ఒక చేతి పరిమాణంలో ఉండి ఆ జలాలలో చిక్కుకుంది. ఒక పంది (వరాహ) రూపంలో ప్రజాపతి (బ్రహ్మ) దేవుడు నీటిలో మునిగి భూమిని బయటకు తెస్తాడు.
[24][25] వేదానంతర సాహిత్యంలో, ముఖ్యంగా పురాణాలలో, వరాహపురాణం విష్ణువు అవతారంగా మారింది. ప్రజలను హింసించి భూమిని అపహరించే హిరణ్యాక్ష అనే దుష్ట రాక్షసుడి నుండి విష్ణువు వరాహరూపం ధరించి భూమిని సంస్కరిస్తాడు.[26][25] విష్ణువు వరాహ-రూపంలో అన్యాయంతో పోరాడి రాక్షసుడిని చంపి భూమిని రక్షించాడు. [24]
- నరసింహ: నరసింహ పురాణం విష్ణువు మనిషి-సింహం అవతారం (నరసింహావతారం) ధరించి ఆయన ఒక దుష్ట రాజును (హిరణ్యకశ్యపు) నాశనం చేస్తాడు. భూమి మీద మతపరమైన హింసను, విపత్తును అంతం చేస్తాడు. తన మత విశ్వాసాలను అనుసరించినందుకు హింసలు, శిక్షల వలన కలిగే బాధల నుండి తన భక్తుడిని (ప్రహ్లాదుడు) రక్షించి తద్వారా విష్ణువు ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు.[27][28]
- వామనావతారం
- పరశురామావతారం
- రామావతారం
- క్రిష్ణావతారం
- బుద్ధావతారం
- కల్కావతారం
ఇవి కూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.