సినీ దర్శకుడు, రచయిత From Wikipedia, the free encyclopedia
కొండపల్లి దశరథ్ కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. సంతోషం, సంబరం, మిస్టర్ పర్‌ఫెక్ట్ అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.[1][2]
దశరథ్ 1971, నవంబరు 30న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3]
2005 లో శేష సౌమ్యతో అతని వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[4]
సినిమాల్లోకి రాక మునుపు దశరథ్, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తో కలిసి టీవీ సీరియళ్ళకు సంభాషణలు రాసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహిక మంచి ఆదరణ పొందింది. వీరశంకర్, తేజ, వై.వి.యస్.చౌదరి లాంటి దర్శకులతో సుమారు పదేళ్ళ పాటు పనిచేశాడు. వీరశంకర్ తో హలో ఐ లవ్ యూ, వైవీయస్ చౌదరితో యువరాజు, తేజతో చిత్రం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్ లాంటి సినిమాలకు పనిచేశాడు.
2002 లో నాగార్జున కథానాయకుడిగా వచ్చిన సంతోషం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
Seamless Wikipedia browsing. On steroids.