నాగాలాండ్ రాష్ట్రంలోని జిల్లా. From Wikipedia, the free encyclopedia
త్సెమిన్యు జిల్లా , భారతదేశం, నాగాలాండ్ రాష్ట్రంలోని జిల్లా. ఇది 2021 డిసెంబరు18న సృష్టించబడింది. జిల్లా ప్రధాన కార్యాలయం త్సెమిన్యు పట్టణంలో ఉంది. జిల్లా లోని జనాభా 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 63,269 మంది జనాభా ఉన్నారు.జిల్లా వైశాల్యం 256 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. ఈ జిల్లా రెంగ్మా నాగాలకు స్వస్థలంలాంటిది.
Tseminyü District | |
---|---|
District of Nagaland | |
Nickname: Historical District | |
Country | India |
State | Nagaland |
Headquarters | Tseminyü |
Government | |
• Lok Sabha Constituency | Nagaland |
• MP[1] | Tokheho Yepthomi, NDPP |
• Deputy Commissioner | Zasekuolie Chüsi (IAS) |
• Assembly constituencies | 1 constituencies |
విస్తీర్ణం | |
• Total | 256 కి.మీ2 (99 చ. మై) |
జనాభా (2011)[3] | |
• Total | 63,269 |
• జనసాంద్రత | 250/కి.మీ2 (640/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
Major highways | NH 2 |
2021 డిసెంబరు 18న నాగాలాండ్ రాష్ట్ర జిల్లాగా త్సెమిన్యు జిల్లా సృష్టించబడింది. త్సెమిన్యు జిల్లా పూర్వ కోహిమా జిల్లా పూర్వపు త్సెమినీ ఉప-విభాగ సరిహద్దులను కలిగి ఉంది.[4]
త్సెమిన్యు జిల్లా 256 చ.కి.మీ వైశాల్యం కలిగి ఉంది.వర్షాకాలంతో వాతావరణం ఉప ఉష్ణమండలంగా ఉంటుంది.
జిల్లా పరిధిని పరిపాలనా సౌలభ్యం కోసం త్సెమినియు త్సోగిన్ అనే రెండు తాలూకాలుగా విభజించారు. త్సెమిన్యు జిల్లాలో టి. సెమినియు. టి.సోగిన్ అనే రెండు గ్రామీణ అభివృద్ధి బ్లాకులుతో ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం అప్పటి కోహిమా జిల్లాలోని త్సెమినీ సర్కిల్ జనాభా 63,629. నివాసులలో ఎక్కువ మంది రెంగ్మా నాగులు ఉన్నారు. అక్షరాస్యత రేటు 81.71%.పిల్లల లింగనిష్పత్తి 980, ఇది సగటు లింగనిష్పత్తి 1,011 కంటే ఎక్కువ. [5]
2011 భారత అధికారిక జనాభా లెక్కల ప్రకారం, ట్సెమిన్యు పట్టణంలో ఇతర మతపరమైన వారు తక్కువుగా ఉండగా, క్రైస్తవ మతానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇది అక్కడ ప్రధాన మతం.
2011 జనాభా లెక్కల ప్రకారం మునుపటి ఉప-విభాగంలో 39 గ్రామాలను కలిగి ఉంది, ఈ క్రింది విధంగా రెండు పరిపాలనా విభాగాలుగా విస్తరించింది: త్సెమిని విభాగంలో ఒక పట్టణం (సెమినియు 6,315 జనాభా). గ్రామాలు ముప్పై రెండు ఉన్నాయి
త్సెమిని విభాగంలో గ్రామాలు
సోగిన్ విభాగంలో ఏడు గ్రామాలను కలిగి ఉంది
సమీపంలోని విమానాశ్రయం దిమాపూర్ విమానాశ్రయం.ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ట్సెమినీ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చమౌకెడిమా షోఖువి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది.
జాతీయ రహదారి 2 జిల్లా గుండా వెళుతుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.