Remove ads
నాగాలాండ్ లోవి జిల్లాలు From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రం, 2022 నాటికి 16 పరిపాలనా జిల్లాలను కలిగి ఉంది. అవి చుమౌకెడిమా, దిమాపూర్, కిఫిరే, కోహిమా, లాంగ్లెంగ్, మోకోక్చుంగ్, మోన్, నియులాండ్, నోక్లాక్, పెరెన్, ఫేక్, షామటోర్, టుయెన్సాంగ్, త్సెమినియు, జున్ వోక్హెటో.[1]
నాగాలాండ్ జిల్లాలు | |
---|---|
స్థానం | నాగాలాండ్ |
సంఖ్య | 16 జిల్లాలు |
ప్రభుత్వం | నాగాలాండ్ ప్రభుత్వం |
1957 డిసెంబరు 1న, అస్సాంలోని నాగా హిల్స్ జిల్లా, ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ (ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్) టుయెన్సాంగ్ ఫ్రాంటియర్ డివిజన్ కేంద్ర పాలిత నాగా హిల్స్ టుయెన్సాంగ్ ప్రాంతాన్ని ఏర్పరిచాయి. ఆ సమయంలో మునుపటి ఉపవిభాగాలు కోహిమా జిల్లా, మోకోక్చుంగ్ జిల్లా, ట్యూన్సాంగ్ జిల్లాగా మారాయి.1961 ఫిబ్రవరిలో నాగా హిల్స్ ట్యూన్సాంగ్ ప్రాంతం పేరు "నాగాలాండ్"గా మార్చబడింది. భారతదేశం లోని 16వ రాష్ట్రంగా నాగాలాండ్ 1963 డిసెంబరులో అవతరించింది .
1973 డిసెంబరు 19న మొకోక్చుంగ్ జిల్లా నుండి కొన్ని భూభాగాలు విభజించుట ద్వారా వోఖా జిల్లా, జున్హెబోటో జిల్లా, ట్యూన్సాంగ్ జిల్లా విభజించుట ద్వారా మోన్ జిల్లా, కొహిమా జిల్లా విభజించుట ద్వారా ఫేక్ జిల్లా సృష్టించబడ్డాయి. [2]
1997 డిసెంబరు 2న, కోహిమా జిల్లా విభజించుట ద్వారా దిమాపూర్ జిల్లా ఏర్పడింది.ఇది 1998 ఏప్రిల్‌లో ప్రారంభించబడింది [3] [4]
2003లో అక్టోబరు 24 న కిఫిరే జిల్లా, లాంగ్లెంగ్ జిల్లా, పెరెన్ జిల్లా అనే మరో మూడు జిల్లాలు కొత్తగా జోడించబడ్డాయి. [5] కిఫిరే, లాంగ్లెంగ్ జిల్లాలు తుయెన్సాంగ్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడ్డాయి. పెరెన్ జిల్లా కొహిమా జిల్లా నుండి విభజింపబడింది. [6]
నోక్లాక్ జిల్లా 2021 జనవరి 20న సృష్టించబడింది. గతంలో ఇది ట్యూన్సాంగ్ జిల్లాకు ఉప-జిల్లాగా ఉంది. [7]
2021 డిసెంబరు 18న మూడు కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి: దిమాపూర్ జిల్లాను విభజించగా చమౌకెడిమా జిల్లా, నియులాండ్ జిల్లా. అలాగే కొహిమా జిల్లా విభజించగా త్సెమినియు జిల్లా ఏర్పడ్డాయి. [8]
2022 జనవరి 19 న, ట్యూన్సాంగ్ విభజించంగా షామటోర్ జిల్లా నాగాలాండ్‌లోని 16వ జిల్లాగా సృష్టించబడింది. [9]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[10] నాగాలాండ్ లోని పదహారు జిల్లాలు, వాటి ప్రధాన కార్యాలయాలు, జనాభా, విస్తీర్ణం వివరాలు దిగువ విరంచబడ్డాయి.
వ.సంఖ్య | జిల్లా | ప్రధాన కార్యాలయం | విస్తీర్ణం (చ.కి.మీ) |
ఎలియనేషన్ (మీటర్లు) | జనాభా మొత్తం (2011) |
గ్రామీణ ప్రాంతాల జనాభా | పట్టణ ప్రాంతాల జనాభా | ఏర్పడిన సంవత్సరం | రాష్ట్రంలో జిల్లా స్థానం సూచించే పటం |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | చమౌకెడిమా జిల్లా | చమౌకెడిమా | 610 | 171 | 125,400 | 81,884 | 43,516 | 2021 | |
2 | దీమాపూర్ జిల్లా | దీమాపూర్ | 70 | 145 | 170,000 | 0 | 170,000 | 1997 | |
3 | కిఫెరె జిల్లా | కిఫెరె | 1,130 | 896 | 74,004 | 57,517 | 16,487 | 2004 | |
4 | కోహిమా జిల్లా | కోహిమా | 1,207 | 1,444 | 267,988 | 146,900 | 121,088 | 1957 | |
5 | లాంగ్లెంగ్ జిల్లా | లాంగ్లెంగ్ | 562 | 1,066 | 50,484 | 42,871 | 7,613 | 2004 | |
6 | మొకొక్‌ఛుంగ్ జిల్లా | మొకొక్‌ఛుంగ్ | 1,719 | 1,325 | 194,622 | 138,897 | 55,725 | 1957 | |
7 | మోన్ జిల్లా | మోన్ | 1,786 | 655 | 250,260 | 215,816 | 34,444 | 1973 | |
8 | నియులాండ్ జిల్లా | నియులాండ్ | n/a | 154 | 11,876 | 11,876 | 0 | 2021 | |
9 | నోక్లాక్ జిల్లా | నోక్లాక్ | 1,152 | 59,300 | 59,300 | 0 | 2017 | ||
10 | పెరన్ జిల్లా | పెరన్ | 2,300 | 1,445 | 95,219 | 81,429 | 13,790 | 2004 | |
11 | ఫెక్ జిల్లా | ఫెక్ | 2,026 | 1,524 | 163,418 | 138,843 | 24,575 | 1973 | |
12 | షామటోర్ జిల్లా | షామటోర్ | n/a | n/a | 12,726 | n/a | n/a | 2022 | |
13 | త్సెమిన్యు జిల్లా | త్సెమిన్యు | 256 | 1,261 | 63,629 | 60,766 | 2863 | 2021 | |
14 | తుఏన్‌సాంగ్ జిల్లా | తుఏన్‌సాంగ్ | 2,536 | 1,371 | 137,296 | 100,522 | 36,774 | 1957 | |
15 | వోఖా జిల్లా | వోఖా | 1,628 | 1,313 | 166,343 | 131,339 | 35,004 | 1973 | |
16 | జునెబోటొ జిల్లా | జునెబోటొ | 1,255 | 1,852 | 140,757 | 113,160 | 27,597 | 1973 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.