తెలుగబ్బాయి

2013లో ఓ.ఎస్. అవినాష్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం From Wikipedia, the free encyclopedia

తెలుగబ్బాయి

తెలుగబ్బాయి 2013, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓ.ఎస్. అవినాష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తనీష్, రమ్య నంబీశన్, తాషు కౌశిక్, నటించగా, మెజో జోసఫ్ సంగీతం అందించారు.[1] ఇది పూర్తిగా మలేషియాలో షూటింగ్ చేయబడింది, పూర్తిస్థాయిలో మలేషియాలో తీయబడిన తొలి తెలుగు చిత్రం ఇది.[2] ఈ చిత్రానికి మొదట సలామత్ అనే టైటిల్ పెట్టారు.

త్వరిత వాస్తవాలు తెలుగబ్బాయి, దర్శకత్వం ...
తెలుగబ్బాయి
Thumb
తెలుగబ్బాయి సినిమా పోస్టర్
దర్శకత్వంఓ.ఎస్. అవినాష్
రచనఓ.ఎస్. అవినాష్
నిర్మాతఎస్. రామకృష్ణ
తారాగణంతనీష్, రమ్య నంబీశన్, తాషు కౌశిక్
ఛాయాగ్రహణంప్రతాప్ వి. కుమార్
కూర్పుఓ. రవిశంకర్
సంగీతంమెజో జోసఫ్
ఎస్.పి. ఈశ్వర్
నిర్మాణ
సంస్థ
వెరా ఫిల్మ్ కార్పొరేషన్
విడుదల తేదీ
9 మార్చి 2013 (2013-03-09)
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

కథా సారాశం

చాలాకాలం క్రితం మలేషియాకు వలస వెళ్ళిన రెండు తెలుగు కుటుంబాల మధ్య జరిగే కథాంశంతో రూపొందించబడింది.[3]

నటవర్గం

సాంకేతికవర్గం

  • రచన, దర్శకత్వం: ఓ.ఎస్. అవినాష్
  • నిర్మాత: ఎస్. రామకృష్ణ
  • సంగీతం: మెజో జోసఫ్, ఎస్.పి. ఈశ్వర్[7]
  • ఛాయాగ్రహణం: ప్రతాప్ వి. కుమార్
  • కూర్పు: ఓ. రవిశంకర్
  • పాటలు: జె.ఎ. నివాస్
  • నిర్మాణ సంస్థ: వెరా ఫిల్మ్ కార్పోరేషన్

పాటలు

త్వరిత వాస్తవాలు తెలుగబ్బాయి, పాటలు by మెజో జోసఫ్ ...
తెలుగబ్బాయి
పాటలు by మెజో జోసఫ్
Released2012
Genreసినిమా పాటలు
Languageతెలుగు
Producerమెజో జోసఫ్
మూసివేయి

మలయాళ సంగీత దర్శకుడు మెజో జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి తనయుడు ఎస్పీ ఈశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సినిమాలోని అన్ని పాటలను జెఎస్. నివాస్ రాశాడు. "రోజా" సినిమాలో "చిన్ని చిన్ని ఆశ" పాటను పాడిన మిన్మిని ఈ చిత్రంలో "కిల కిల మని", "చిత్రంగా ఉందే" పాటలను పాడింది. పుడమిని మోసే పువ్వా అనే పాటను రమ్య నంబీశన్ పాడింది.[8]

క్రమసంఖ్య పాట పేరు గాయకులు నిడివి
1 కిలకిలమని మిన్మిని, బేబీ హరిప్రియ 02:20
2 యెల్లా యెల్లా వినోద్ వర్మ, పావని రాజేష్ 03:56
3 నా కెమెరా గీతా మాధురి, కౌశిక్, పావని రాజేష్ 04:38
4 చిత్రంగా ఉందే మిన్మిని, కౌశిక్ 03:42
5 గుండెల్లోనా మెజో జోసెఫ్ 05:14
6 హాయ్ రామ శంకర్ మహదేవన్, పావని రాజేష్ 04:48
7 పుడమిని మోసే రమ్య నంబీశన్ 01:13
8 చిత్రంగా ఉందే మనసా మిన్మిని, కౌశిక్ 03:53
9 చెలియ చెలియా మెజో జోసెఫ్ 05:09
10 చురకత్తిలాంటి అనూజ్, పావని రాజేష్ 04:27

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.