తనీష్

From Wikipedia, the free encyclopedia

తనీష్ ఒక తెలుగు సినీ నటుడు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు. నచ్చావులే హీరోగా అతని మొదటి సినిమా. బాల నటుడిగా దేవుళ్ళు, మన్మథుడు లాంటి సినిమాల్లో నటించాడు.

త్వరిత వాస్తవాలు తనీష్, వృత్తి ...
తనీష్
వృత్తిసినీ నటుడు
తల్లిదండ్రులు
  • అల్లాడి యేసువర్ధన్ బాబు[1] (తండ్రి)
  • సరస్వతి (తల్లి)
మూసివేయి

వ్యక్తిగత జీవితం

తనీష్ తండ్రి అల్లాడి యేసువర్ధన్ బాబు సైన్యంలో సుబేదారుగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. తల్లి సరస్వతి. వీరికి తనీష్, వంశీకృష్ణ, కాశీ విశ్వనాథ్ అనే ముగ్గురు కొడుకులున్నారు. తనీష్ చిన్నప్పటి నుంచి డ్యాన్సు మీద ఆసక్తి చూపేవాడు. తండ్రి పనిచేసే సంస్థలో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. బాల నటుడిగా రోజుకి మూడు షిఫ్టులు పనిచేసేవాడు. తనీష్ కెరీర్ కోసం తండ్రి స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు.[2]

మే 19, 2016 న యేసువర్ధన్ బాబు తన ఫ్లాట్ నుండి కింద పడి మరణించాడు. కొంతమంది ఆయన ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని భావించగా, ఆయన కుటుంబం మాత్రం తమకు ఆర్థిక సమస్యలేమీ లేవనీ, తాగిన మత్తులో పొరపాటున కాలి జారి కిందపడి మరణించి ఉండవచ్చునని తెలియజేశారు.[1][3]

సినిమాలు

మరింత సమాచారం సంఖ్య, సంవత్సరం ...
సంఖ్య సంవత్సరం సినిమా పాత్ర సహనటులు
1 2000 దేవుళ్ళు అయ్యప్ప స్వామి
2 2002 మన్మథుడు హారిక తమ్ముడు నాగార్జున, సోనాలి బెంద్రే
3 2008 నచ్చావులే లవ్ మాధవీలత
4 2009 రైడ్ నాని, శ్వేత బసు ప్రసాద్, అక్ష
5 2010 మౌనరాగం చందు మధురిమ
6 ఏం పిల్లో ఏం పిల్లడో రామ్ ప్రణీత సుభాష్
7 2011 కోడిపుంజు అభిమన్యు శోభన
8 మంచివాడు రాజా భామ
11 2012 మేం వయసుకు వచ్చాం లక్కీ నీతి టేలర్
12 చాణక్యుడు చాణక్య ఇశితా దత్తా
13 2013 తెలుగబ్బాయి అరుణ్ రమ్య నంబీశన్
14 2014 పాండవులు పాండవులు తుమ్మెద లక్కీ
15 బ్యాండ్ బాజా[4]
16 2016 ఓ మై గాడ్[5]
17 2017 ప్రేమిక
18 2018 దేశదిమ్మరి
19 2018 రంగు
20 2021 మరో ప్రస్థానం'
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.