ఇశితా దత్తా (జ.1990 ఆగస్టు 28) భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె దృశ్యం (2015) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆమె స్టార్ ప్లస్ టెలివిజన్ ఛానల్ లో ప్రసారితమవుతున్న హిందీ సోప్ ఒపేరా "ఏక్ ఘర్ బనావూంగా" షోలో నటిస్తుంది. ఆమె ఆమె భారతీయ సినిమా నటి తనూశ్రీ దత్తా యొక్క సోదరి.[3]
ఇశితా దత్తా | |
---|---|
జననం | జంషెద్‌పూర్, బీహార్, ఇండియా (ప్రస్తుతం జార్ఘండ్, భారతదేశం) | 1990 ఆగస్టు 26
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
ఎత్తు | 5 అడుగులు 6 అంగుళాలు (168 cమీ.)[1] |
జీవిత భాగస్వామి | వత్సల్ సేథ్ (2017)[2] |
బంధువులు | తనూశ్రీ దత్తా (సోదరి) |
ప్రారంభ జీవితం
ఆమె భారతదేశం జార్ఘండ్ రాస్ట్రానికి చెందిన జంషెడ్‌పూర్లో ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించింది.[4] ఆమె జంషెడ్‌పూర్ లోని దక్షిణ భారత మహిళా సమాజం ఇంగ్లీషు మీడియం పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. ముంబైలో మీడియా స్టడీస్ పూర్తి చేసింది. ఆమె సోదరి తనూశ్రీ దత్తా కూడా టెలివిజన్ మోడల్, సినిమా నటి. తనూశ్రీ దత్తా 2005లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ ను గెలుచుకొన్నది.
కళాశాల విద్య పూర్తిచేసిన తదుపరి సినిమా రంగంలో చేరాలని అనుకున్నది. తన సోదరి సూచన మేరకు అనుపమ్‌ఖేర్ నటనా పాఠశాలలో చేరి మూడు నెలలు శిక్షణ పొందింది. అప్పటి నుండి ఆత్మవిశ్వాసంతో రంగస్థల నటనకు సిద్ధమైనది.[5] ఆమె టెలివిజన్ కార్యక్రమాలలో నటించింది. ఆమె మొదటి టెలివిజన్ ఎడ్వర్‌టైజ్‌మెంటు ప్రాజెక్టు తమిళంలో ప్రారంభమైనది. ప్రకటనల రంగంలో ఆమె ప్రస్థానం ఆమె పుట్టిన రోజున జరగడం విశేషం. తరువాత ఆమె మరిన్ని ప్రకటనల షోలకు సంతకం చేసింది.[6]
నటనా ప్రస్థానం
ఆమె 2012 లో తెలుగు సినిమా చాణక్యుడు సినిమా ద్వారా నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. సోదరి తనూశ్రీ దత్తాతో కలసి హెచ్.ఆర్ శ్రీకాంత్ దర్శకత్వంలో నియాజ్ అహ్మద్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబడుతున్న "యేనీడు మనసాలి" సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా అసంపూర్తిగా ఆగిపోయి, విడుదల కాలేదు. ఆమె సోప్ ఒపేరా ఏక్ ఘర్ బనావూంగా షోలో ప్రధాన పాత్రలో నటిస్తున్నది.
ఆమె బాలీవుడ్ లో 2015 లో ఏక్షన్ డ్రామా దృశ్యం ద్వారా ప్రవేశించింది. ఆ సినిమాలో అజయ్ దేవగన్, టబు, శ్రియా శరణ్ లతో నటించింది. ఆ చిత్రంలో ఆమె అజయ్ దేవగన్ కుమార్తె పాత్రను పోషించింది. ఆమె కపిల్ శర్మతో కలసి ఫిరంగి సినిమాలో పనిచేస్తున్నది.
వ్యక్తిగత జీవితం
ఇశితా దత్తా టెలివిజన్, సినిమా నటుడు వత్సల్ సేథ్ ను ప్రేమించి కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. ఇద్దరూ కలసి అనేక టెలివిజన్ కార్యక్రమాలు, బాలీవుడ్ సినిమాలలో నటించారు. 2016 లో "రిష్టోన్ కా సౌదాగర్ బాజీగర్" అనే టెలివిజన్ సిరీస్ లో పనిచేసారు. ఇశితా, వట్సాల్‌లు 2017 నవంబరు 28న ముంబైలో ఇస్కాన్ దేవాలయంలో వివాహం చేసుకున్నారు.[7][8]
ఫిల్మోగ్రఫీ
టెలివిజన్
సంవత్సరం | షో | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
2013–14 | ఏక్ ఘర్ బనూంగా | పూనం నాథ్ | స్టార్ ప్లస్ |
2013 | నాచ్ బలియె 6 | అతిథి పాత్ర | స్టార్ ప్లస్ |
2016 | రిస్టోన్ కాన్ కా సౌదాగర్ - బాజీగర్ | అరుంధతి | లైఫ్ ఒకే |
అవార్డులు , నామినేషన్లు
ఇశితా దత్తా ఏక్ ఘర్ బనావూంగా షోలో చేసిన కృషికి గానూ ఈ క్రింది పురస్కారాలు, నామినేషన్లు పొందింది.
సంవత్సరం | పురస్కారం | కేటగిరి | షో | ఫలితం |
---|---|---|---|---|
2013 | స్టార్ పరివార్ పురస్కారం | ఫావరిట్ బేటీ | ఏక్ ఘర్ బనూంగా | ప్రతిపాదించబడింది |
2014 | ఫావరిట్ బేటీ |
మూలాలు
ఇతర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.