తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2017
From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించడం జరుగుతుంది.

2017 ఏడాదికిగానూ పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 52 మంది ప్రముఖులను ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2] అవార్డుల ఎంపిక కమిటీ ప్రతిపాదన మేరకు ఈ ప్రముఖులకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రూ.1,00,116 నగదు, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో సత్కరించాడు.[3][4]
పురస్కార గ్రహీతలు
క్రమసంఖ్య | పేరు | రంగం | ఇతర వివరాలు |
---|---|---|---|
1 | వెలపాటి రామరెడ్డి | సాహిత్యరంగం | |
2 | అశారాజు | సాహిత్యరంగం | |
3 | జూపాక సుభద్ర | సాహిత్యరంగం | |
4 | అస్లాం ఫర్షోరి (ఉర్దూ) | సాహిత్యరంగం | |
5 | రాఘవరాజ్ భట్-మంగళా భట్ | శాస్త్రీయ నృత్యం | |
6 | బి. సుదీర్ రావు | శాస్త్రీయ నృత్యం | |
7 | పేరిణి కుమార్ | పేరిణి నృత్యం | |
8 | దురిశెట్టి రామయ్య | జానపద కళలు | |
9 | కేతావత్ సోమ్లాల్ | జానపద కళలు | |
10 | గడ్డం సమ్మయ్య | జానపద కళలు | |
11 | ఎం. రాజోల్కర్ | సంగీతం | |
12 | వార్సీ బ్రదర్స్ | సంగీతం | |
13 | వందేమాతరం ఫౌండేషన్ | సామాజిక సేవ | |
14 | యాకుబ్ బీ | సామాజిక సేవ | |
15 | పీవీ శ్రీనివాస్ | జర్నలిజం | |
16 | ఏ రమణకుమార్ | జర్నలిజం | |
17 | బిత్తిరి సత్తి- సావిత్రి (రవి - శివజ్యోతి) | ఎలక్ట్రానిక్ మీడియా | |
18 | వి.సతీష్ | జర్నలిజం | |
19 | మహ్మద్ మునీర్ | జర్నలిజం | |
20 | అనిల్ కుమార్ | ఫొటో జర్నలిజం | |
21 | హెచ్. రమేశ్ బాబు | సినిమా జర్నలిజం | |
22 | డాక్టర్ బిరప్ప (నిమ్స్) | వైద్య రంగం | |
23 | డాక్టర్ వెంకటాచారి (సిద్ధా మెడికల్ ఆఫీసర్) | వైద్య రంగం | |
24 | డాక్టర్ ఏ వేణుగోపాల్ రెడ్డి | విద్యారంగం | |
25 | ఎం బిక్షపమ్మ | అంగన్వాడీ టీచర్ | |
26 | కోదారి శ్రీను | ఉద్యమ గానం | |
27 | వాణి వొల్లాల | ఉద్యమ గానం | |
28 | అవునూరి కోమల | ఉద్యమ గానం | |
29 | అభినయ శ్రీనివాస్ | ఉద్యమ గానం | |
30 | తోట వైకుంఠం | పెయింటింగ్ | |
31 | శ్రీనివాస్ రెడ్డి | శిల్పకళలు | |
32 | డా. ఎస్ చంద్రశేఖర్ (ఐఐసీటీ డైరెక్టర్) | శాస్త్రవేత్త | |
33 | మడిపల్లి దక్షిణామూర్తి | కామెంటరీ/ యాంకరింగ్ | |
34 | పురాణం నాగయ్య స్వామి | అర్చకుడు | |
35 | కొక్కెర కిష్టయ్య (మేడారం) | అర్చకుడు | |
36 | ఎం సంగ్రామ్ మహరాజ్ | ఆథ్యాత్మికవేత్త | |
37 | ఉమాపతి పద్మనాభ శర్మ | ఆథ్యాత్మికవేత్త | |
38 | మహ్మద్ ఖాజా షరీఫ్ షేక్ ఉల్ హదీస్ (మౌల్వీ) | ఆథ్యాత్మికవేత్త | |
39 | ప్రొఫెసర్ పెనుమాళ్ల ప్రవీణ్ ప్రబు సుధీర్ (బిషప్/ఫాదర్) | ఆథ్యాత్మికవేత్త | |
40 | దెంచనాల శ్రీనివాస్ | నాటకరంగం | |
41 | వల్లంపట్ల నాగేశ్వరరావు | నాటకరంగం | |
42 | తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ (హకీంపేట్) | క్రీడలు | |
43 | యెండల సౌందర్య (హాకీ) | క్రీడలు | |
44 | నరేంద్ర కాప్రె | వేదపండిత్ | |
45 | జె.రాజేశ్వరరావు | న్యాయవాది | |
46 | సిద్ధిపేట పురపాలకసంఘం | మున్సిపాలిటీ | |
47 | శ్రీనివాస్‌నగర్ (మానకొండూరు) | గ్రామ పంచాయతీ | |
48 | నేతి మురళీధర్ (ఎండీ, టెస్కాబ్ ) | ఉద్యోగి | |
49 | ఎన్ అంజిరెడ్డి, ఏఈఎస్ | ఉద్యోగి | |
50 | కండ్రె బాలాజీ (కెరమెరి గ్రామం, కొమురం భీమ్ జిల్లా) | రైతు | |
51 | గడ్డం నర్సయ్య | స్పెషల్ కేటగిరీ (ఈల పాట) |
సేవాపతకాలు
పోలీసు విభాగంలో విశిష్ట సేవలందించిన వారికి ముఖ్యమంత్రి సేవాపతకం, తెలంగాణ సేవాపతకాలను అందించారు.[5]
- ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం-2016
- ఎం రామకృష్ణ డీఎస్పీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్
- పీ వెంకటస్వామి, హెడ్ కానిస్టేబుల్ (4028), టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్.
- ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం -2017
- ఎన్ వెంకట శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్, ఏసీబీ, హైదరాబాద్.
- మహ్మద్ మొయిజుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ (565), మహబూబ్‌నగర్.
- తెలంగాణ మహోన్నత సేవా పతకం-2016
- యూ గౌరీశంకర్, రిటైర్డ్ ఏఆర్ ఎస్‌ఐ, హైదరాబాద్ సిటీ
- సర్ఫ్‌రాజ్ అలీ, ఏఏసీ/ఏఆర్‌ఎస్‌ఐ, గ్రేహౌండ్స్, హైదరాబాద్
- తెలంగాణ మహోన్నత సేవా పకతం-2017
- హెచ్. సత్యనారాయణ, కమాండెంట్ 10వ బెటాలియన్, టీఎస్‌ఎస్పీ, బీచ్‌పల్లి,
- ఎం కృష్ణ, ఏఎస్‌ఐ (స్పెషల్ ఇంటెలిజెన్స్ సెల్, హెడ్ క్వార్టర్, హైదరాబాద్.
- కేవీ రాం నర్సింహారెడ్డి, సీఐడీ డీఎస్పీ, హైదరాబాద్.
మార్చ్‌పాస్ట్ బెటాలియన్ అవార్డులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.