Remove ads
సినీ గీత రచయిత, గాయకుడు, రంగస్థల నటుడు, దర్శకుడు From Wikipedia, the free encyclopedia
అభినయ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకుడు,[1] రంగస్థల నటుడు, దర్శకుడు.[2] గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం, తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వంటి పాటలను రచించాడు.[3] 2022, జనవరి 5న "స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 మోత్కూర్ పట్టణ బ్రాండ్ అంబాసిడర్" గా నియమించబడ్డాడు.[4]
అభినయ శ్రీనివాస్ | |
---|---|
జననం | జనవరి 23, 1977 మోత్కూర్, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం |
ప్రసిద్ధి | ఉద్యమ, సినీ గీత రచయిత, గాయకులు , రంగస్థల నటుడు, దర్శకుడు |
భార్య / భర్త | శ్రీలత |
పిల్లలు | వంశీచరణ్, ప్రణవనాథ్ |
తండ్రి | బ్రహ్మచారి |
తల్లి | నర్సమ్మ |
అభినయ శ్రీనివాస్ అసలు పేరు దొంతోజు శ్రీనివాసచారి. అభినయ కలం పేరు. ఇతడు 1977, జనవరి 23న బ్రహ్మచారి[5], నర్సమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లా, మోత్కూరులో జన్మించాడు.[6]
1992లో పదవ తరగతిలో మోత్కూరు పాత తాలూకా పరిధిలో మొదటిస్థానంలో నిలిచి, నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం పూర్తి చేశాడు.
ఈయనకు శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (వంశీచరణ్, ప్రణవనాథ్).
1989లో మిత్రులతో కలిసి మోత్కూర్ లో అభినయ కళాసమితిని స్థాపించాడు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాటకపోటీల్లో పాల్గొని వందల నాటక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నాడు.
2005లో వచ్చిన నిరీక్షణ సినిమాలోని ధేఖో ధేఖో భాయ్ అనే పాట ద్వారా సినీరంగ ప్రవేశం చేసి గోరింటాకు, నవ వసంతం, దొంగల బండి, సవాల్, భీమిలి కబడ్డీ జట్టు, మంచివాడు, వెంకటాద్రి, అధినేత, సమర్ధుడు, సేవకుడు, జై తెలంగాణ, వీడు మాములోడు కాదు, నచ్చావ్ అల్లుడు, ఎస్.ఎం.ఎస్., వీర, పోరు తెలంగాణ, జలక్, మా వూరి మహర్షి, మిస్టర్ లవంగం, పున్నమి నాగు, విజయదశమి, ఫస్ట్ లవ్, వాడే కావాలి కాకతీయుడు, వైభవం, తుపాకి రాముడు, జైసిన, గువ్వ గోరింక, రుద్రంగి, చిల్ బ్రో, ట్రెండు మారిన ఫ్రెండ్ మారడు వంటి 70కు పైగా సినిమాలలో అనేక పాటలు రాశాడు.[7] గోరింటాకు సినిమాలోని అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం పాట మంచి గుర్తింపునిచ్చింది.[8]
శరణాంజలి, తెలంగాణ సంగతులు, ఆఖరి మోఖ, ఔర్ ఏక్ ధక్కా వంటి తెలంగాణ పాటల సీడిలు రూపొందించాడు. తెలంగాణ ఉద్యమం కోసం రాసిన ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా పాట మంచి గుర్తింపునిచ్చింది.
జాగృతి, నవతరం, సంధిగ్ధ సంధ్య, కాలగర్భం, చరమగీతం. కాలగర్భం నాటికలో 'పాలకుర్తి పోతురాజు', సందిగ్ధ సంధ్య నాటికలో 'భూపతి' పాత్రలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ విలన్ గా గుర్తింపు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.