డామన్ జిల్లా, భారతదేశ కేంద్రపాలితప్రాంతమైన, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ రాష్ట్రంలోని 3 జిల్లాలలో ఇది ఒకటి.జిల్లా ముఖ్య పట్టణం డామన్.ఇది భారతదేశ పడమటి సముద్రతీరంలో ఉంది. డామన్ జిల్లా, ఉత్తర సరిహద్దులలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వల్సాడ్ జిల్లా, తూర్పు, దక్షిణం, పడమటి సరిహద్దులలో అరేబియన్ సముద్రం ఉంది. జిల్లా వైశాల్యం 72 చ.కి.మీ.[1] 2011 భారత జనాభా లెక్కలు గణాంకాలను అనుసరించి నగర జనసంఖ్య 191,173. 2001 తరువాత జనసంఖ్య 69.256% వృద్ధిచెందింది. డామన్ నగరం " డామన్‌గంగా " ముఖద్వారం వద్ద ఉంది. ప్రముఖ పరిశ్రమల యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. డామన్ సమీపంలో పట్టణానికి 7 కి.మీ దూరంలో వాపి రైల్వేస్టేషన్ ఉంది. వాపి సముద్రతీరం కూడా పర్యాటకప్రసిద్ధి చెందినదే. పోర్చుగీసు కాలనీ సంప్రదాయానికి చెందిన నిర్మాణశైలి, చర్చిలు, నైనీ- డామన్, మోతీ-డామన్ ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇవి సరిగ్గా డామన్-గంగకు అటూ ఇటూ ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నాయి. జిల్లాలో స్త్రీపురుష నిష్పత్తి దాదాపు సమానంగా ఉండడం జిల్లా ప్రత్యేకతాలో ఒకటి. జిల్లాలోని ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. డామన్ ఉత్తరంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన సూరత్ ఉంది. డామన్‌కు దక్షిణంగా మహారాష్ట్ర రాష్ట్రంలో అరేబియన్ సముద్రతీరంలో 160 కి.మీ దూరంలో భారతదేశముఖద్వారం అని ప్రసిద్ధి చెందిన ముంబై నగరం ఉంది.
ముంబై సమీపంలో ఉన్న సౌరాస్ట్రా, సొపారాలలో లభించిన కి.పూ (273-136) మద్య కాలంలో అశోకుడు స్థాపించిన శిలాశాసనం లభించింది. కుష్ణ చక్రవర్తి సామంతరాజైన సత్ర్య క్షత్రపా క్రి.శ మొదటి శతాబ్దంలో ప్రస్తుత డామన్ జిల్లా ప్రాంతాన్ని పాలించాడని విశ్వసిస్తునారు. పరిసరాలలో ఉన్న సూరత్ జిల్లాలో క్షహరతా పాలకులు ముద్రించిన భూమక, నాహపన్ నాణ్యాలు లభించాయి. నహపన్ అల్లుడైన ఉషవదత్తా ధనుహా, ధామనా, పరదా, తపి నదులమీద తెప్పలను నడిపాడని భావిస్తున్నారు. ఈ నదులు, ప్రదేశాల గురించి లభిస్తున్న ఆరంభకాల సామాచారం ఇదే అని భావించవచ్చు. డామన్, ధాను, పర్ది 2000 సంవత్సరాల కాలం చేరలేని ప్రదేశాలుగా ఉంటూ ఉండేవి. గౌతమపుత్ర శతకర్ణి క్షహరతాలను సా.శ. 125లో ఈ ప్రాంతం నుండి తరిమికొట్టాడు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో శాతవాహనుల పాలన కొంతకాలం మాత్రమే కొనసాగింది.
క్షత్రపా రాజులు
క్షత్రపా వంశజుడు చస్తన్ మనుమడైన మొదటి రుద్రమన్ సా.శ. 150లో శాతవాహన పాలకుడైన శాతకర్ణి నుండి గుజరాత్ రాష్ట్రం లోని మహి నది ముఖద్వారంతో చేర్చి పడమటి భారతదేశం లోని అధికభాగం జయించాడు. తరువాత డామన్ ప్రాంతం క్షత్రప రాజైన విజయసేన్ (కీ.శ 234-239) ఆధీనంలోకి వచ్చింది. క్షత్రప రాజులు ఈ ప్రాంతాన్ని కీ.శ. 249 వరకు పాలించారు. శతవాహనుల నుండి దక్కన్ పడమటి భాగాన్ని జయుంచిన అభిర్ రాజు (నాసిక్ పాలకుడు) కీ.శ 180-200 వరకు క్షత్రపా రాజులతో యుద్ధం కొనసాగించాడు. త్రికూట ప్రాంతాన్ని సా.శ. 5వ శతాబ్దం వరకు విభీన్న వంశజులు పాలించారు. సా.శ. 800 వరకు లాటా దేశాన్ని రాష్ట్రకూటులకు చెందిన మాల్ఖెడ్, రెండవ గోవింద (575-795, మొదటి ధ్రువరాజా (794-800), మూడవ గోవింద (800-808) పాలనలో కొనసాగింది. రెండవ ధ్రువ తరువాత అతడి కుమారుడు అకాలవర్షా సా.శ. 867 న సింహాసనం అధిష్టించాడు. అతడి
మూడవ గోవింద
మూడవ గోవింద లాటా సామ్రాజ్యాన్ని తనసోదరుడైన ఇంద్రకు సా.శ. 808 స్వాధీనం చేస్తూ లాటేశ్వరమండలస్య (లాటామండల రక్షకుడు) అనే బిరుద ప్రధానం చేసాడు. ఇంద్ర ఇంద్ర తరువాత అతడి కుమారుడు కర్క రాజైయ్యాడు. ఇంద్ర గోవిందాతో కలిసి లాటామండలాన్నీ 828 వరకు పాలించాడు. కర్కా కుమారుడు రెండవ ధ్రువ సా.శ. 835 న సింహాసం అధిష్టించాడు. సా.శ. 973న కల్యాణి చలుపాలలో ఒకరైన రెండవ తైలప్ప ఈ ప్రాంతానికి పాలకులయ్యారు. రెండవ తైలప్పా లాటా రాజ్యాన్ని ఆతడి బంధువు సైన్యాధ్యక్షుడూ అయిన బారప్పు (దేవరప్ప చాళుక్య) కు అందించాడు.
రాజపుత్రులు
13 వ శతాబ్ధపు మద్యకాలానికి రాజపుత్ర రాజకుమారుడు రాంసింగ్ (రామాధాహ్) కోలీ రాజప్రతినిధి నాథోరత్‌ను ఓడించి ఈ పర్వతసానువులలో డామన్ సమీపంలో అషేరీ వద్ద అస్సరసెటా సా.శ. 1262లో సామ్రాజ్య స్థాపన చేసాడు. రాంసింగ్ తరువాత అతడి కుమారుడు సోమనాథ్ 1295లో రాజైయ్యాడు. సోమనాథ్ పాలనలో కొత్తగా నిర్మించబడిన రాంనగర్‌ను స్థాపించాడు. సోమనాథ్ (సా.శ. 1335-1360), దరం షాహ్ (1360-1391) రాంనగర్ సుసంపన్నం అయింది. జగత్షాహ్ తరువాత వచ్చిన గోపూషాహ్ (1432-1480) వరకు పాలించాడు. పోర్చుగీస్ వారు గుజరాత్ పాలకుడైన షాహ్ నుండి డామన్ ప్రాంతాన్ని కోరుకున్నది. సా.శ. 1523లో వారు నౌకాశ్రయం నిర్మించారు. ఈ ప్రాంతం దాదాపు 400 సంవత్సరాలు కాలం (1961) వరకు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంది. రాజకుమారులు, సామ్రాజ్యాలు, మిశ్రమ శక్తుల పాలనలు ఈ ప్రాంతం మీద ప్రభావం చూపిన కారణంగా డామన్ నగరంలో పలు ఙాపక చిహ్నాలు చోటుచేసుకున్నాయి.
పోర్చుగీసు పాలన
1531లో డామన్‌ను పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నారు. 1536లో గుజరాత్ సుల్తాన్ డామన్ మీద పూర్తిగా అధికారన్ని వదులుకున్న తరువాత పోర్చుగీసు వారీ ప్రంతం మీద పూర్తి అధికారం సాధించారు. యురేపియన్ పోర్చుగల్ నిర్వహణలో 19వ శతాబ్ధపు మొదటి రోజులలో డామన్ జిల్లా (డిస్టో డీ డామియో) గా చేసి ఇండియా పోర్చుగీసు నిర్వహణా విభాగంగా (ఇస్టోడా డా ఇండియా) మార్చారు. తరువాత డామన్ జిల్లా పోర్చుగీసు భూభాగాలైన (డామన్,దాద్రామరియు నగర్ హవేలీ) లలో ఒకటిగా మారింది. డామన్ పాలనా బాధ్యతను డిస్ట్రిక్ గవర్నర్ (సబార్డినేటర్ ఆఫ్ గవర్నర్ జనరల్) వహించాడు. జిల్లాను డామన్, దాద్రానగర్ హవేలీ అని రెండు తాలూకాలుగా విభజించారు. తాలూకాలను పరిషెస్‌గా విభజించబడ్డాయి.
ఆధునిక కాలం
1954 దాద్రా, నగర్ హవేలీ, డామన్ జిల్లాలోని కొంత భాగాన్ని " ప్రో-ఇండియన్ యూనియన్ ఫోర్సెస్ " ఆక్రమించింది. 1961లో దద్రానగర్ హవేలీ భారతదేశంతో అధికారింకంగా కలుపబడింది. మిగిలిన జిల్లా పోర్చుగీసు ఆధీనంలో ఉంది. 1961 డిసెంబరు 19న భారతీయ సైన్యాలు భారతదేశంతో మిళితం చేసారు. 1961-1987 వరకు డామన్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతమైన గోవా, డయ్యు, డామన్ భాగంగా ఉంటూ వచ్చింది. 1987లో ఇది కొత్తగా రూపొందించబడిన డామన్, డిల్యూనియన్ టెర్రిటరీ ఆఫ్ డయ్యూ అండ్ డామన్" లో భాగం అయింది.
2001 లో గణాంకాలు
డామన్ జిల్లాలో ఒకే ఒక తెహ్సిల్ ఉంది. జిల్లా మొత్తం భూభాగం డామన్ అండ్ డియూ పార్లమెంటరీ నియాజకవర్గానికి చెంది ఉంది.
గంగానది మీద మోతీ డామన్, నానీ డామన్ మద్య ఉన్న వంతెన 2003 ఆగస్టు 28 వర్షాకాలంలో కూలిపోయింది. ఈ విపత్తులో 27 మంది పాఠశాల విద్యార్థులు ఒక ఉపాధ్యాయిని నదిలో మునిగి మరణించారు.[4] తరువాత 9 కోట్ల వ్యయంతో నిర్మించబడిన వంతెన 2004 ఆగస్టులో కొంతభాగం కూలిపోయింది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించ లేదు. దామన్ గంగా నదిలో సంభవించిన అధికమైన వరదల కారణంగా వంతెన కూలిపోయిందని నివేదికలు తెలియజేసాయి.[5] ప్రస్తుతం ఈ వంతెన మీద ప్రయాణించడానికి ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. [6] ప్రస్తుతం " రాజీవ్ గాంధీ సేతు " పేరిట భారీవాహనాల రాకపోకలకు అనువుగా నిర్మించబడింది. అలాగే పాత వంతెనలు శాశ్వతంగా మూసి వేయబడ్డాయి.
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.