టి.వి.శంకరనారాయణన్
From Wikipedia, the free encyclopedia
టి.వి.శంకరనారాయణన్ (తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్, జననం 7 మార్చి 1945) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు.
తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | TVS |
జననం | మయిలదుతురై, తమిళనాడు, భారతదేశం | 7 మార్చి 1945
మూలం | భారతదేశం |
సంగీత శైలి | భారత శాస్త్రీయ సంగీతం |
వృత్తి | గాత్ర విద్వాంసుడు |
క్రియాశీల కాలం | 1968 నుండి |
విశేషాలు


ఇతడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, మయిలదుత్తురై గ్రామంలో 1945, మార్చి 7వ తేదీన జన్మించాడు. ఇతడు తన మామ మదురై మణి అయ్యర్ వద్న 9వ ఏటి నుండి సంగీతం అభ్యసించడం ప్రారంభించాడు.ఇతని తండ్రి వెంబు అయ్యర్కూడా మదురై మణి అయ్యర్ వద్ద రెండు దశాబ్దాలపాటు శిష్యరికం చేశాడు. ఇతడు 1968లో తన మొదటి కచేరీ చేసి క్రమంగా కర్ణాటక గాత్ర విద్వాంసునిగా తన సత్తాను చాటాడు. తన గురువు వలె ఇతని స్వరకల్పన గానం కూడా విభిన్నమైన రీతిలో సర్వలఘుతో అలరారుతూ వుంటుంది.[1]
ఇతని శిష్యులలో ఆర్.సూర్యప్రకాష్, ఇతని కుమార్తె అమృతా శంకరనారాయణన్, కుమారుడు మహదేవన్ శంకరనారయణన్ మొదలైన వారున్నారు.
అవార్డులు, గౌరవాలు
- 1981లో అమెరికాలో భైరవి సంస్థ వారిచేగాయక శిఖామణి
- 1986లో రిషీకేశ్ శ్రీవిద్యాశ్రమానికి చెందిన రామకృష్ణానంద సరస్వతి స్వామిచే స్వర లయ రత్నాకర
- 1987లో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్చే గానకళారత్నం
- 1975లో వాసర్ కళాశాల వారిచేసంగీత రత్నాకర
- 1997లో యోగ జీవన సత్సంగచేస్వర యోగ శిరోమణి
- 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- 2003లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం[2]
- 2003లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి పురస్కారం
- 2005లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారిచే సంగీత కళాశిరోమణి
- 2012లో తపస్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే విద్యాతపస్వి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.