From Wikipedia, the free encyclopedia
"జాతీయములు " లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కథలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
ఆంగ్ల భాషలో "జాతీయము " అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.
జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.[1] అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
సామాన్యంగా జాతీయాలను పని గట్టుకొని ఎవరు పుట్టించరు. అలా పుట్టించినా అవి కలకాలం ప్రజల నోళ్ళలో వుండవు. జాతీయములు ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్ళలో నానుతుంటాయి. తరతరాలుగా అలా వాడుకలో వుంటూనే వుంటాయి.
కొన్ని జాతీయాలను సామెతగాను, సామెతలను జాతీయాగాను పొరబడు సందర్భాలున్నాయి. నిజానికి ఈ రెండు వేరు వేరు. సామెతలోని అర్థం సంపూర్ణము. ఉదాహరణ: సామెత. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట./ కాకిపిల్ల కాకికి ముద్దు. / తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము. ఇలా... ఇందులో అర్థ సంపూర్ణము. దాన్ని అన్వయించడములో కొంత తేడా కనబడుతుంది. జాతీయములో అర్థం అసంపూర్ణం. సగం వాఖ్యమే వుంటుంది. జాతీయము: ఉదాహరణ:..కడతేర్చాడు / కడుపు మంట. / కన్నాకు./ అగ్గినిప్పు./ పంటపండింది. పంటికిందరాయి./పక్కలోబల్లెం ఇలా వుంటాయి. పైగా వాటి నిజార్థాలు వేరుగా వుంటాయి. మరొక అర్థంలో వాటిని వాడతారు. ఉదాహరణకు.... పంట పండింది. అనగా అతని వరిపంట పండిందని అర్థం కాదు. అతనొక గొప్ప విజయము సాదించాడని అర్థము. పప్పులో కాలేశాడు. అనగా పప్పులో నిజంగా కాలేశాడని కాదు గదా. అనగా పొరబడ్డాడు అని అర్థము. ఇంతటి గూడార్థమున్నా జాతీయాలు సామాన్య మానవులు.... చదువులేని వారికి సైతం అర్థం అయి వారే ఎక్కువగా వాడు తుంటారు. అందుచేత జాతీయాలు ఆ భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చు.
(అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.