తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతా (Jayaprada Nahata)గా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.[1]
జయప్రద | |||
పాటల విడుదల సందర్భములో జయప్రద | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2004 | |||
ముందు | నూర్‌బానో | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | |||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాది పార్టీ | ||
వృత్తి | సినిమా నటి, రాజకీయవేత్త | ||
మతం | హిందూ మతం |
సినీ ప్రవేశం
జయప్రదకు బాల్యములో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారిద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.
పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడినది.
రాజకీయ ప్రవేశం
నందమూరి తారక రామారావు ఆహ్వానముతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశము చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షములో చేరి తెలుగు దేశము పార్టీ యొక్క మహిళా విభాగమునకు అధ్యక్షురాలైనది. 1996 ఏప్రిల్ లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశము పార్టీకి రాజీనామా చేసి జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైనది.
జయప్రద నటించిన తెలుగు చిత్రాలు
|
ఇవి కూడ చూడండి
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.