జనార్ధన మహర్షి
భారతీయ చలన చిత్ర దర్శకుడు From Wikipedia, the free encyclopedia
జనార్ధన మహర్షి - సంస్కృత చిత్ర నిర్దేశకుడు. భారతీయ సినిమా రచయిత, కవి, నిర్మాత, పాటల రచయిత,సంగీత దర్శకుడు, నటుడు.
ప్రధానముగా తెలుగు, కన్నడ చిత్రాల రచయిత. పంజాబీ, హిందీ లలో కూడా కథలు అందించారు.
"దేవస్థానం", "విశ్వదర్శనం"చిత్రాలతో జనార్ధన మహర్షి కి పరిమితమైన గుర్తింపు, అవార్డులు దక్కినవి.
'శ్లోక' సంస్కృత చిత్రం ద్వారా ప్రత్యేక దిశగా ప్రేరణ పొంది, ప్రస్తుతం "సంస్కృత", "శూన్య" చిత్రాలు నిర్మిస్తునారు. జనార్ధన మహర్షి 75కి పైగా చిత్రాల రచయిత.
"వెన్నముద్దలు" కవితా సంకలనం తెలుగు సాహిత్యం లో అత్యధిక ప్రచురిత మొదటి ఐదు కావ్యాలలో ఒకటిగా నిలిచింది.
"పంచామృతం", "గర్భగుడి", "జనాపదాలు","స్మశానానికి వైరాగ్యం", "చిదంబర రహస్యం" వంటి పలు నవలలు, కవిత్వం కథసంకలనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
రచనా శైలిలో "జెన్","జెమ్" జనార్ధన మహర్షి స్వయంభులు.
సినిమాలు[1]
నటునిగా
- పట్టుకొండి చూద్దాం -1997
- ఓ పనై పోతుంది బాబు - 1998
- హాండ్సప్ - 2000
- సకుటుంబ సపరివార సమేతంగా - 2000
- బావ నచ్చాడు - 2001
- మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది - 2001
రచయితగా
- వన్ బై టూ (1993)
- పేకాట పాపారావు (1994)
- నమస్తే అన్న (1994)
- మిస్ 420 (1995)
- ఆంటీ (1995)
- పెళ్ళాల రాజ్యం (1996)
- మా నాన్నకు పెళ్లి (1997)
- పట్టుకొండి చూద్దాం (1997)
- కన్యాదానం (1998)
- హంగామా (1998)
- మావిడాకులు (1998)
- ఓ పనై పోతుంది బాబు (1998)
- పిల్ల నచ్చింది (1999)
- గొప్పింటి అల్లుడు (2000)
- చాలా బాగుంది (2000)
- అమ్మో ఒకటో తారీఖు (2000)
- హేండ్సప్ (2000)
- మూడు ముక్కలాట (సినిమా) (2000)
- మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది (2001)
- బావ నచ్చాడు (కథ, సంభాషణలు) (2001)
- జాబిలి (2001)
- శ్రీరామచంద్రులు (2003)
- మా అల్లుడు వెరీగుడ్ (2003)
- ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి (2003)
- ఎవడి గోల వాడిది (2005)
- మాయాజాలం (2006 సినిమా)
- జై బోలో తెలంగాణ (2011)
- ఈగ (సినిమా) (2012)
- వెంకీ మామ (2019)
దర్శకుడిగా
- గోపి గోడమీది పిల్లి -2006
- దేవస్థానం (డ్రామా) - 2012
- పవిత్ర - 2013
- విశ్వదర్శనం (డాక్యుమెంటరీ) - 2022
- శ్లోక - సంస్కృత చిత్రం - 2024
పుస్తక రచనలు[2][3]
- వెన్నముద్దలు (కవిత్వం) - 2003
- గర్భ గుడిలోకి (నవల) - 2004
- నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ (కవిత్వం) - 2005
- కవిగానే కనుమూస్తా (కవిత్వం) -2008
- పంచామృతం (కధలు) - 2006
- చిదంబర రహస్యం (కధలు) - 2018
- మధుర సంభాషణలు (మాటలు) - 2019
- స్మశానానికి వైరాగ్యం (కధలు) - 2021
- జనా పదాలు (కవిత్వం) - 2022
పంజాబ్ సినిమా
- జే జట్ విగర్ గ్యా [4]
కన్నడ సినిమాలు
- ఆకాష్ (2005)
- దత్త (2006)
- అరుసు (2007)
- మొరవనిగ (2008)
- పరమేషా పాన్ వాలా (2008)
- బంధు బలగ (2008)
- బిందాస్ (2008)
- రాజ్ విష్ణు (2017)
- నటసార్వభౌమ (2019)
మూలాలు
బయటి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.