Remove ads
From Wikipedia, the free encyclopedia
ఛత్రా, జార్ఖండ్ రాష్ట్రం, ఛత్రాా జిల్లా లోని పట్తణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం.
18 వ -19 వ శతాబ్దంలో ఛత్రా, రామ్‌గఢ్ జిల్లాకు ముఖ్యపట్టణంగా ఉండేది. ప్రఖ్యాత సంస్కర్త, రాజా రామ్మోహన్ రాయ్, 1804–05లో రామ్‌గఢ్ జిల్లాలో షెరిస్టదారుగా ఉండేవాడు. రామ్‌గఢ్, ఛత్రా రెండు చోట్లా పనిచేసేవాడు. తదనంతరం, రామ్‌గఢ్ జిల్లా నార్త్-వెస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీలో భాగమైంది. హజారిబాగ్ జిల్లా ఏర్పడింది. 1914 లో ఛత్రా, హజారిబాగ్ జిల్లాలో ఒక ఉపవిభాగంగా మారింది. 1991 లో ఇది పూర్తి స్థాయి జిల్లాగా మారింది. [1] [2]
ఛత్రాా 24°12′16″N 84°52′37″E వద్ద ఉంది.
ఛత్రా చుట్టుపక్కల అనేక జలపాతాలు ఉన్నాయి: గువా జలపాతం (6 కి.మీ.), కేరిడా జలపాతం (8 కి.మీ.), మలుదా జలపాతం (8 కి.మీ.), బిచ్కిలియా (11 కి.మీ.). బల్బల్ దువారి (25 కి.మీ.) వద్ద వేడి నీటి బుగ్గ ఉంది. [3]
Population of Chatra | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1901 | 10,599 | — | |
1911 | 9,222 | -13.0% | |
1921 | 8,225 | -10.8% | |
1931 | 8,758 | 6.5% | |
1941 | 9,638 | 10.0% | |
1951 | 9,911 | 2.8% | |
1961 | 12,507 | 26.2% | |
1971 | 16,737 | 33.8% | |
1981 | 22,738 | 35.9% | |
1991 | 31,147 | 37.0% | |
2001 | 42,020 | 34.9% | |
2011 | 49,985 | 19.0% | |
Source:[4] |
2011 భారత జనగణన ప్రకారం, ఛత్రా (లొకేషన్ కోడ్ 801765) జనాభా 49,985, ఇందులో 26,555 (53%) పురుషులు, 23,430 (47%) మహిళలు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల జనాభా 7,800. ఛత్రాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 33,746 (6 సంవత్సరాలలో జనాభాలో 80.00%). [5]
2001 జనాభా లెక్కల ప్రకారం, ఛత్రా జనాభా 41,990, ఇందులో 22,331 మంది పురుషులు, 19,659 మంది మహిళలు ఉన్నారు. 27,409 మంది అక్షరాస్యులు. [6] [7]
ఛత్రా NH 22, NH 522 ల కూడలి వద్ద ఉంది.
ఛత్రా కళాశాల 1961 లో స్థాపించారు. వినోబా భావే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజీలో ఆర్ట్స్, సైన్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో కోర్సులు లభిస్తాయి. [8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.