జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాలలో ఛత్రా జిల్లా (హిందీ: चतरा जिला) ఒకటి. ఛత్రా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా వైశాల్యం 3706 చ.కి.మీ. జనసంఖ్య 790,680 .
ఛత్రా జిల్లా
चतरा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | ఉత్తర ఛోటా నాగ్‌పూర్ |
ముఖ్య పట్టణం | ఛత్రా |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఛత్రా |
• శాసనసభ నియోజకవర్గాలు | 2 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,706 కి.మీ2 (1,431 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 10,42,304 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (730/చ. మై.) |
• Urban | 05.31 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 62.14 % |
• లింగ నిష్పత్తి | 951 |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
ఛత్రా జిల్లా ఒకప్పుడు హజారీబాగ్ జిల్లాలో ఉపవిభాగంగా ఉండేది. 1991 నుండి ఈ జిల్లా ఉనికిలోకి వచ్చింది.[1]
పురాతన కాలం
ఛత్రా ప్రాంతం దీని పరిసర ప్రాంతాలు పురాతన కాలం నుండి పలు సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. క్రీ.పూ 332 అశోకుడు పాలించిన కాలంలో మౌర్య సామ్రాజ్యంలో సామంత రాజ్యమైన ఆటవిక రాజాస్థానం ఛత్రాను కొంత కాలం పాలించింది. సముద్రగుప్తుడు సైన్యంతో ఈ ప్రాంతం గుండా ప్రయాణించి చోటానాగపూర్ చేరుకుని మహానది లోయలోఉన్న దక్షిణ కోసల మీద దండయాత్ర సాగించాడు.[2]
మధ్యయుగం
ముహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత ముగల్ సామ్రాజ్యంలోని బీహార్ సుబాహ్‌లో భాగం అయింది.ముగల్ చక్రవర్తి ఔరంగజేబు 1660 మే మాసంలో కోఠీ సమీపంలో ఉన్న పొఖ్రి ఖోటను అనుకున్నంత తిరుగుబాటు లేకుండా ఆక్రమించుకున్నాడు. తరువాత ఆయన కొండ శిఖరాగ్రంలో ఉన్న బలమైన కుండా కోట వైపు సైన్యంతో ముందుకు కదిలాడు. ఈ కోట చివరకు ఔరంగజేబు ఆక్రమించుకున్నాడు. అయినప్పటికీ 1660 జూన్ 2 న కోట పూర్తిగా ధ్వంసం చేయబడింది. తరువాత కుండా కోట రాజా రాంఘర్ ఆధినంలోకి వచ్చింది. 1774లో అలీవర్దీ ఖాన్ తిరుగుబాటు తికరి (గయ) జమీందారులను ఎదిరించిన తరువాత ఛత్రా కోట వైపు దాడి కొనసాగించి దానిని ధ్వంసం చేసాడు.[2]
బ్రిటిష్ పాలన
" ది బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ" 1769లో మొదటిసారిగా ఈ ప్రాంతంలో ఒప్పందం కుదుర్చుకుంది. రాజా రామ్మోహన్ రాయ్ 1805-1805 వరకు సెరెస్తాదార్‌గా పనిచేసాడు. ఆయన కార్యాలయంలో ఉన్నప్పుడు ఛత్రా, రాంగర్‌లో నివసించాడు.[2]
బ్రిటిష్ లోని చోటానాగపూర్, ఈ ప్రాంతపు సామంతుల మధ్య 1857 తిరుగుబాటు సమయంలో " బాటిల్ ఆఫ్ ఛత్రా " పేరుతో యుద్ధం జరిగింది. మోసపూరితమైన ఈ యుద్ధం 1857 అక్టోబరు 4 న " ఫంసీ తలాబ్ " వద్ద జరిగింది. ఒక గంట కాలం యుద్ధం జరిగిన తరువాత గిరిజనులు పూర్తిగా ఓడించబడ్డారు. ఈ యుద్ధంలో 56 యురేపియన్ సైనికులు, సైనిక అధికారులు మరణించారు. అలాగే 150 తిరుగుబాటుదార్లు మరణించారు, 77 మంది గుంటలో పూడ్చిపెట్టబడ్డారు. సుబేదార్ జై మంగల్ పాండే, నాదిర్ అలి ఖాన్ లకు 1857 అక్టోబరు 4న ఇదే ప్రాంతంలో ఉరితీయ బడ్డారు. యురేపియన్, సిక్కు సైనికులు వారి ఆయుధాలు, యుద్ధసామాగ్రితో ఒక బావిలో పూడ్చి పెట్టబడ్డారు. ఈ ప్రాంతంలో ఈ వివరాలను వివరిస్తూ స్థూపం ఒకటి నిర్మించబడింది.
"56 men of Her Majesty's 53rd Regiment of foot and a party of Sikhs were killed at Chatra on October 2nd 1857 in action against mutineers of the Ramgarh Battalion. Lieutenant J. C. C. Daunt of the 70th Bengal Native Infantry and sergeant D. Dynon of the 53rd regiment were awarded Victoria Cross for conspicuous gallantry in the battle, in which the mutineers were completely defeated and lost all their four guns and ammunitions.
ఫంసి తలాబ్ తీరంలో ఉన్న శిలాఫలకం మీద ఇద్దరు సుబేదార్ల మరణం [మంగల్ పాండే, నాదిర్ అలి ఖాన్ ] గురించిన వివరాలు లభిస్తున్నాయి.
[2] namely, Mangal Pandey and Nadir Ali Khan.
స్వాతంత్ర్య సమరం
1982లో చత్రా జ్జిల్లాలో స్వాతత్ర ఉద్యమంలో పాలుపంచుకోవడం ప్రారంభం అయింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఈ ప్రాంతం మీద కూడా ప్రభావం చూపింది. 1942 నవంబరు 9 న దీపావళి పండుగ రాత్రిన 6 సహఖైదీలతో హజారీబాగ్ సెంట్రల్ జైల్ నుండి పారిపోయాడు. తరువాత జయప్రకాష్ నారాయణ్ ఈ జిల్లాలోని తాత్రా గ్రామానికి వచ్చాడు. ఇక్కడి నుండి ఆయన వారణాసికి వెళ్ళాడు. చోటానాగ్పూర్ కెస్రి, బాబు రాం నారాయణ్ సింగ్, బాబు షాలిగ్రాం సింగ్.[2]
స్వతంత్రం తరువాత
ఛత్రా జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం అయింది.[3]
ఆర్ధికరగం
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఛత్రా జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జర్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
పర్యాటకం
జార్ఖండ్ ముఖద్వారం అని గుర్తించబడుతున్న చత్రా జిల్లా ప్రకృతి సౌందర్యానికి పుట్టిల్లు. చత్రా జిల్లా సహజ ప్రకృతి సౌందర్యంతో విస్తారమైన సుందర విహారప్రదేశాలతో, ఫౌంటెన్లతో, జలపాతాలతో అలరారుతూ జార్ఖండ్ రాష్ట్రముఖద్వారంగా ఉంది.
- జిల్లాలోని పర్యాటక ఆకర్షణలు.
- భద్రకాళీ ఆలయం :
చత్రాకు తూర్పుగా 35 కి.మీ దూరం చౌపరాకు 16 కి.మీ దూరంలో ట్రంక్ రోడ్డు పక్కన మహానదీతీరంలో ఈ భద్రకాళీ ఆలయం ఉంది. పచ్చని అరణ్యాలు కొండలమద్య ఉన్న ఈ ఆలయ సమీపంలో ఒక సహజసిద్ధమైన సరసు ఒకటి ఈ పట్టణ సౌందర్యానికి మరింత శోభను తెస్తూఉంది.
- కుండా రాజభవనం: కుండా రాజ భవనశిథిలాలు ప్రస్తుత కుండా గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది. ఈ రాజభవనం 17 వ శతాబ్ధానికి చివర 18 వ శతాబ్ధానికి ఆరంభంలో నిర్మించబడిందని భావిస్తున్నారు.
- తంసిన్ : తంసిన్ అంటే చీకటితెర అని అర్ధం. ఈ ప్రాంతంలో పలు జాతులకు చెందిన ఎత్తైన అరణ్యాలు ఉండి సూర్యరస్మిని సైతం భూమికి చేరకుండా అడ్డుకుంటూ చీకటిగా ఉన్నందు వలన ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ప్రకృతి ఆరాధకులకు ఇది స్వర్గం వంటిది. ఇక్కడ ఉన్న జలపాతం అత్యధికంగా పర్యాటకుల ఆదరణకు పాత్రమౌతుంది. ఈ ప్రాంతంలో అదనంగా పలు జలపాతాలు ఉన్నాయి.
[5] నక్సలైటు సమస్య కారణంక ఈ ప్రాంతం పర్యాటకం ఘోరంగా దెబ్బతిన్నది.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 10,42,304,[6] |
ఇది దాదాపు. | సిప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[7] |
అమెరికాలోని. | రోడ్ ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[8] |
640 భారతదేశ జిల్లాలలో. | 434వ స్థానంలో ఉంది.[6] |
1చ.కి.మీ జనసాంద్రత. | 275 [6] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 28.98%.[6] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 951:1000 [6] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 62.14%.[6] |
జాతియ సరాసరి (72%) కంటే. |
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.