Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చిత్రకూట్ జిల్లా (హిందీ:चित्रकूट जिला) ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిజన్లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3,45,291 చ.కి.మీ.[1]2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 990,626.
చిత్రకూట్ జిల్లా
चित्रकूट | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | చిత్రకూట్ |
ముఖ్య పట్టణం | చిత్రకూట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,45,291 కి.మీ2 (1,33,318 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 9,90,626 |
• జనసాంద్రత | 2.9/కి.మీ2 (7.4/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.52 |
• లింగ నిష్పత్తి | 879 |
Website | అధికారిక జాలస్థలి |
2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా చిత్రకూట్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.మొదటి స్థానంలో మహోబా జిల్లా ఉంది..[2]
1997 మే 6 న బంద జిల్లా నుండి కర్వి, మౌ తాలూకాలు వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో జిల్లాకు " ఛత్రపతి షాహూజీ నగర్ " జిల్లా అని ఉండేది. తరువాత 1998 సెప్టెంబరు 4 న జిల్లా పేరును చిత్రకూట్ అని మార్చారు.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3] భరతదేశ సుదూర ప్రాంతాలలో ఒకటైన ఈ జిల్లాలో అభివృద్ధిపనులు జరగడంలో జాప్యం జరుగుతూనే ఉంది. .
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 990,626, [2] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | మొంటానా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 448 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 315 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 29.29%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 879: 1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 66.52%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.