Remove ads
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం From Wikipedia, the free encyclopedia
మహోబా ఉత్తర ప్రదేశ్లో బుందేల్ఖండ్ ప్రాంతం లోని పట్టణం. [2] 9 వ శతాబ్దంలో ప్రతీహార శైలిలో నిర్మించిన గ్రానైట్ సూర్య దేవాలయానికి ఇది ప్రసిద్ధి. గోఖర్ కొండపై ఉన్న రాతిలో చెక్కిన 24 జైన తీర్థంకరుల చిత్రాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. [3] ఇది మహోబా జిల్లా ముఖ్య పట్టణం. మహోబా ఖజురహో, లవకుశనగర్, కుల్పహార్, చర్ఖారీ, కాలింజర్, ఓర్చా, ఝాన్సీ వంటి చారిత్రిక పట్టణాలకు దగ్గరలో ఉంది. ఈ పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి.
మహోబా 25.28°N 79.87°E వద్ద [4] సముద్ర మట్తం నుండి 214 మీటర్ల ఎత్తున ఉంది
2011 నాటి భారత జనాభా లెక్కల ప్రకారం, మహోబా జనాభా 95,216. మహోబా సగటు అక్షరాస్యత 74.91%. ఇది రాష్ట్ర సగటు 67.68% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 82.03%, మహిళా అక్షరాస్యత 66.88%, జనాభాలో 12.68% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
మహోబాలో మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాల జనాభా 14.93%, షెడ్యూల్ తెగల జనాభా 0.42% ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 75.21% హిందువులు, 23.64% ముస్లింలు. [5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.