ఘండికోట బ్రహ్మాజీరావు (1922 డిసెంబరు 23 - 2012 అక్టోబరు 12) ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో యం.యే. పట్టభద్రులు. సాంకేతికరంగంలో "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ "సభ్యులు. నివాసస్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వివిధ పత్రికలు ప్రచురించబడినాయి.
ఘండికోట బ్రహ్మాజీరావు | |
---|---|
జననం | ఘండికోట బ్రహ్మాజీరావు డిసెంబరు 23, 1922 పొందూరు |
మరణం | అక్టోబరు 12, 2012 పశ్చిమ బెంగాల్‌లోని బర్నపూర్ |
మరణ కారణం | అస్వస్థత |
నివాస ప్రాంతం | పొందూరు |
ఇతర పేర్లు | ఘండికోట బ్రహ్మాజీరావు |
వృత్తి | మొదటి తరగతి గెజెటెడ్ ఆఫీసరుగా రైల్వే |
ప్రసిద్ధి | ప్రముఖ కవి, సాహితీవేత్త, రచయిత, |
మతం | హిందూ |
పిల్లలు | ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు |
జీవిత సంగ్రహం
సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి. ఆయన ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు భ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబరు 23 1922 లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. 16 యేళ్ళ వయస్సు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో రైల్వే విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. 1980 లో పదవీ విరమణ చేసిన తరువాత హాల్డియా ఫోర్డ్ లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు. ఆయన 10కి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంధాలకు అనువాదాలూ చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు.
వ్యక్తిగత జీవితం
ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సాహితీ వేత్తగా
ఘండికోట పేరు చెప్పగానే శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్ చప్పున స్ఫురిస్తాయి. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథా, నవలా రచయిత ఘండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులిడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండి అంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీముళ్ళు, డాక్టర్ భాయి వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలికథ 1941లో ప్రజాబంధులో వచ్చిన ‘రాఘవయ్య’తో సాహితీ యాత్ర ఆరంభించారు. ‘ఒక దీపం వెలిగింది’ నవల సినీద్వయం బాపు-రమణల నేతృత్వంలో ‘గోరంత దీపం’ సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్‌ను వేయిన్నొక్క రాత్రులు పేరుతో, తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం (6 భాగాలు) వెలువరించారు.
అస్తమయం
ఘండికోట బ్రహ్మాజీరావు 2012 అక్టోబరు 12, శుక్రవారం నాడు కన్నుమూశారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్నపూర్‌లో ఉద్యోగార్థమై ఉన్న కుమారుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన బ్రహ్మాజీరావు అస్వస్థతతో అక్కడే కన్నుమూశారు.
ఉద్యోగం
- మొదటి తరగతి గెజెటెడ్ ఆఫీసరుగా రైల్వే, 1980 వరకు
- వర్క్స్ మేనేజరుగా ఖర్గ్ పూర్ లో టెక్నికల్ స్కూల్ ప్రిన్సిపాల్
- హల్దియా పోర్ట్ లో స్పెషల్ ఆఫీసరుగా ఒక సంవత్సరం
నవలలు
- పరుగిలిడే చక్రాలు
- ప్రవహించే జీవవాహిని. ఆంధ్రప్రభ వారపత్రిక పోటీలో రెెండవ బహుమతి పొందింది. 1967.
- నవ్వింది నాగావళి
- శ్రామిక శకటం
- ఒక దీపం వెలిగింది (నవల): దీనిని గోరంత దీపం సినిమాగా తీసేరు.
- విజయవాడ జంక్షన్
- నల్లమబ్బుకో వెండి అంచు
- ప్రేమమూర్తి
- రాగలత
- గులాబీముళ్ళు
- డాక్టర్ భాయి
- అమృతవల్లి - 1995 చతుర నవలలపోటీలో కన్సొలేషన్ బహుమతి పొందిన నవల.
ఇతర రచనలు
- ప్రాచీన భారతీయ సాహిత్యంలో కథ
- శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం (6 భాగాలు)
- వేయిన్నొక్క రాత్రులు (అనువాదం)
మూలాలు
- ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, 12-11-82. పుట. 12.
- dated 13-10-2012.[permanent dead link]
వర్గాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.