గౌతముడు

From Wikipedia, the free encyclopedia

గౌతముడు సప్తర్షులలో ఒకడు.[1]

వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు. మంత్రాల సృష్టికర్తగా (మంత్ర ధృష్ట) సుప్రసిద్ధుడు. ఋగ్వేదంలో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. ఈయన అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కొడుకు. దేవీ భాగవత పురాణం ప్రకారమ్, గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకు వామదేవుడు, నోధసుడు అని ఇరువురు పుత్రులు కలరు. వీరు కూడా మంత్ర ధృష్టలే.

వ్యక్తిగత జీవితం

Thumb
అమరావతిలో గౌతమ బుద్ధుని విగ్రహము

ఈయన భార్య పేరు అహల్య ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం, బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు. మిథిలా నగరానికి రాజుయైన జనకుడి కొలువులో ప్రధాన ఆచార్యుడైన శతానంద మహర్షి ఈయన పుత్రుడు. గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వములో ప్రస్తావించబడింది. నారదపురాణంలో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకథాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు. భరధ్వాజుడు, ఈయన అంగీరస మూలానికి చెందిన వారే.

పురాణం

Thumb
అహల్యను చంపనందుకు క్షమించమని అడుగుతున్న అతని కుమారుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

రామాయణం ప్రకారం ఒకసారి గౌతముడు సూర్యోదయాన్నే గంగానదిలో స్నానమాచరించడానికి వెళ్ళగా దేవతల రాజైన దేవేంద్రుడు గౌతముడి భార్యయైన అహల్యను మోహించి మారు వేషంలో వెళ్ళి ఆమెను అనుభవించాడు. జరిగింది దివ్యదృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ ఇద్దరికీ శాపమిచ్చాడు. ఈ శాపం ప్రకారం అహల్య రాయిగా మారిపోయింది. ఇంద్రుడి శరీరం వేయి యోనిలతో నిండిపోయింది. తరువాత వారిద్దరిమీదా జాలిపడిన గౌతముడు కొంచెం ఊరట కలిగించేందుకు ఆ శాపాలనే వరాలుగా మార్చాడు. ఇంద్రుడి శరీరంపై ఉన్న యోనులు కళ్ళు లాగా కనబడేటట్లుగా, రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాదస్పర్శతో పూర్వ రూపం సంతరించుకుని తనను కలుసుకునేటట్లుగా అనుగ్రహించాడు.

ధర్మ సూత్రాలకు ఆద్యుడు

గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మ సూత్రాలుగా ప్రఖ్యాతిచెందాయి..[2][3] ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మ శాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అనికూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంథంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, చాతుర్వర్ణాలు, రాజధర్మాలు, శిక్షాస్మృతులు, స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హింధూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.గౌతముడు అహల్యల పెద్ద కుమారుడు శతానందుడు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.