జనకుడు, మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముడి కొడుకు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.

Thumb
సీత స్వయంవరాన్ని నిర్వహిస్తున్న జనకుడు

జనకుడి భార్య

రామాయణం ప్రకారం జనకుడు భార్య పేరు సునయన . బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం రత్నమాల బలి చక్రవర్తి కూతురు. వామనుడిని చూసి తనకలాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది. తర్వాతి జన్మలో పూతనగా జన్మిస్తుంది.

జనకుని వంశం

వాల్మీకిరామాయణంలో జనక మహారాజుల వంశక్రమం:[1]

నిమి

  • మిథి - మిథిలా రాజ్య స్థాపకుడు
  • ఉదావసుడు
  • నందివర్ధనుడు
  • సుకేతుడు
  • దేవరాతుడు
  • బృహద్రదుడు
  • మహావీరుడు
  • సుధృతి
  • దృష్టకేతువు
  • హర్యశ్వుడు
  • మరువు
  • ప్రతింధకుడు
  • కీర్తిరథుడు
  • దేవమీఢుడు
  • విబుధుడు
  • మహీధ్రకుడు
  • కీర్తిరాతుడు
  • మహారోముడు
  • స్వర్ణరోముడు
  • హ్రస్వరోముడు
  • ఇతడికి ఇరువురు కుమారులు: సీరధ్వజుడు - రామాయణంలోని సీత తండ్రి, ఇతడికే జనకుడని పేరు; రెండవవాడు కుశధ్వజుడు

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.