From Wikipedia, the free encyclopedia
హిందూ పురాణాలలో, కామధేనువు (English: Kamadhenu), (సంస్కృతం: कामधेनु) అతి పవిత్రమైన ధేనువు అనగా ఆవు. గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నింటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా మంధర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీర సాగరాన్ని మథిస్తారు. అయితే ఆ క్షీర సాగర మథనంలో కామధేనువు కూడా మథనం నుంచి ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశుసంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణగాథల్లో వశిష్ఠుడి ఇంటిలో, కొన్ని పురాణగాథల్లో గౌతమ ముని వద్ద ఉన్నట్టు కనిపిస్తుంది. కామధేనువు వశిష్టుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. కామధేనువు పుత్రిక శబల అనే గోవు, కామధేనువు పుత్రుడు నంది. ఏ పురాణంలో అయినా కామధేనువు మాత్రం, ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమ గలది.
Seamless Wikipedia browsing. On steroids.