గోవిందా (నటుడు)

భారతదేశ నటుడు, రాజకీయ నేత From Wikipedia, the free encyclopedia

గోవిందా (నటుడు)

గోవిందా ప్రముఖ భారతీయ నటుడు, హాస్యనటుడు, మాజీ రాజకీయ నాయకుడు.  గోవిందా  అసలు పేరు  గోవింద్ అర్జున్ అహుజా. మంచి  డ్యాన్సర్ గా కూడా ఈయన ప్రసిద్ధులు. 12 ఫిలింఫేర్ అవార్డు  నామినేషన్లు, ఒక ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు, ఫిలింఫేర్ ఉత్తమ  హాస్యనటుడు, జీ సినీ అవార్డులు అందుకున్నారు. 2004  నుంచి 2009 వరకు ఎం.పిగా కూడా పనిచేశారు. 1986లో విడుదలైన ఇల్జామ్ ఆయన నటించిన  మొదటి  సినిమా. అతను 165 హిందీ సినిమాల్లో  నటించారు  గోవిందా[6] 1999 జూన్ లో బిబిసి న్యూస్ నిర్వహించిన ఆన్ లైన్  పోల్ లో గోవిందా 10వ గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్క్రీన్ గా ఎన్నుకోబడ్డారు.[7]

త్వరిత వాస్తవాలు గోవింద, భారత పార్లమెంటు సభ్యుడు ...
గోవింద
Thumb
2018లో ఫ్రైడే సినిమా ట్రైలర్ ప్రారంభం సందర్భంగా గోవింద
భారత పార్లమెంటు సభ్యుడు
In office
2004–2009
అధ్యక్షుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్
అంతకు ముందు వారురాం నాయక్
తరువాత వారుసంజయ్ నిరుపం
నియోజకవర్గంఉత్తర ముంబై
వ్యక్తిగత వివరాలు
జననం
గోవింద అరుణ్ అహుజా

(1963-12-21) 21 డిసెంబరు 1963 (age 61)[1][2][3]
ముంబై , భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
సునీతా అహుజా
(m. 1987)
సంతానం2; టీనా అహుజా తో సహా [4]
తల్లిదండ్రులుఅరుణ్ కుమార్ అహుజా (తండ్రి)
నిర్మలా దేవి (తల్లి)
బంధువులుకృష్ణ అభిషేక్ (మేనల్లుడు), ఆర్తి శర్మ (మేనకోడలు)
నివాసంజుహు, ముంబై, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • రాజకీయ నాయకుడు
  • డాన్సర్
  • కమేడియన్
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
మారుపేరుచీ చీ, హీరో నెం. 1 [5]
మూసివేయి

1980లలో గోవిందా ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్, రొమాన్స్ వంటి అన్ని రకాల సినిమాల్లోనూ చేశారు. 80వ దశకం మొదట్లో యాక్షన్ హీరోగా చేసినా 90లలో మాత్రం హాస్య కథానాయకునిగా మారారు. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమితాబ్, ఒకానొక సమయంలో తన సినిమాలన్ని వరుసగా పరాజయం పాలవ్వడంతో ఒక స్టార్ట్ బ్యాక్ కోసం గోవిందాతో కలసి సినిమా నటించారు.1992లో దివ్య భారతితో కలసి నటించిన షోలా ఔర్ షబ్నమ్ సినిమాతో మొదటిసారిగా హాస్య కథానాయకుని అవతారం ఎత్తారు గోవిందా. ఆంఖే(1993), రాజా బాబు(1994), కూలీ నెం.1(1995), హీరో నెం.1(1997), హసీనా మాన్ జాయేగీ(1999) వంటి సినిమాల్లో నటించారాయన. మాన్ జాయేగా సినిమాలోని నటనకుగాను ఫిలింఫేర్ ఉత్తమ హాస్యనటుడు పురస్కారం, సాజన్ చలే ససురాల్ సినిమాకు ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు అందుకున్నారు. గోవిందా. జాన్ సే ప్యారా(1992), ఆంఖే (1993), బడేమియా చోటేమియా(1998), అనారీ నెం.1(1999) వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు గోవిందా.[8] ఒక్క హధ్ కర్ దీ ఆప్నే(2000)  సినిమాలోనే ఆరు పాత్రల్లో నటించారు అతను రాజు, అతని తల్లి, తండ్రి, చెల్లి, బామ్మ, తాతల పాత్రలు నటించారు గోవిందా.

2000వ దశకం మొదట్లో ఎన్నో పరాజయాలను చవి చూసిన గోవిందా, భగమ్ భాగ్(2006), పార్ట్ నర్(2007), లైఫ్ పార్ట్ నర్(2009), రావన్(2010) వంటి హిట్లను అందుకున్నారు. 2015లో మిథున్ చక్రవర్తి స్థానంలో జీ టివిలోని డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా  డాన్స్ సూపర్ మామ్  సీజన్ 2 కి న్యాయనిర్ణేత అయ్యారు గోవిందా.[9][10][11] ఈ షోకు మరే షోకూ రానన్ని టి.ఆర్.పి రేటింగులు వచ్చాయి.[12] మహారాష్ట్ర లోని ఉత్తర ముంబై నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున 2014లో ఎంపిగా ఎన్నికయ్యారు గోవిందా.[13]

తొలినాళ్ళ జీవితం

1963 21 డిసెంబరున పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు గోవిందా. నటుడు అరుణ్ కుమార్ అహుజా, నటి, గాయకురాలు నిర్మలా దేవిల కుమారుడు గోవిందా.అరుణ్ కుమార్ పంజాబ్ కు చెందినవారు. నిర్మలాదేవి సింధీ కుటుంబానికి చెందినవారు.[14] ఔరత్(1940) సినిమాలో నటించిన అరుణ్ ఆ సినిమా ద్వారా అప్పట్లో చాలా ప్రముఖులు.[14] ఒక సినిమాను నిర్మించిన అరుణ్, ఆ సినిమా ఫ్లాప్  కావడంతో  అనారోగ్యం  పాలయ్యారు. ముంబైలోని  కార్టర్ రోడ్ లో ఒక పెద్ద  బంగ్లాలో నివసించే అరుణ్  కుటుంబం,  అతను అనారోగ్యం పాలవ్వడంతో ఉత్తర ముంబై సబ్ అర్బ్ లోని విరార్ కు మారిపోయారు. [14] ఆరుగురు సంతానంలో ఆఖరివాడు గోవిందా.[15] గోవిందా ముద్దు పేరు "చీ చీ" అంటే చిటికెన్ వేలు అని పంజాబీ భాషలో అర్ధం. వారి ఇంట్లో పంజాబీ భాషే మాట్లాడుకుంటారు.[15][16]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.