గుంతకల్లు పురపాలక సంఘం

From Wikipedia, the free encyclopedia

గుంతకల్ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, గుంతకల్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

త్వరిత వాస్తవాలు స్థాపన, రకం ...
గుంతకల్ పురపాలక సంఘం
గుంతకల్
స్థాపన1948
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
గుంతకల్
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్
మూసివేయి

చరిత్ర

గుంతకల్ పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 433 కి.మీ దూరంలో ఉంది.1948 సంవత్సరంలో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ మునిసిపాలిటీలో 37 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 126,270 జనాభా ఉండగా అందులో పురుషులు 62,851, మహిళలు 63,419 మంది ఉన్నారు.అక్షరాస్యత 74.87% ఉండగా అందులో పురుష జనాభాలో 83.29%, స్త్రీ జనాభాలో 66.59% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 13075 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 28,781 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కె. అపర్ణ పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా రామగౌని శ్రీనాథ్ పనిచేస్తున్నాడు.[2]

ఇతర వివరాలు

ఈ పురపాలక సంఘం 40.87 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.23 రెవెన్యూ వార్డులు,37 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో మురికివాడలు 48 ఉండగా అందులో జనాభా 52650 ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,5 పబ్లిక్ పార్కులు,1 కూరగాయల మార్కెట్లు,27 ప్రభుత్వ పాఠశాలు,31 ప్రాథమిక పాఠశాలలు,2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,4 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.