From Wikipedia, the free encyclopedia
గండ్లూరి దత్తాత్రేయశర్మ కర్నూలు జిల్లా డోన్‌లో నివసిస్తున్న సుప్రసిద్ధ అవధాని.[1]
గండ్లూరి దత్తాత్రేయశర్మ | |
---|---|
జననం | గండ్లూరి దత్తాత్రేయశర్మ 1950, సెప్టెంబరు 6 అనంతపురం జిల్లా రామగిరిమండలం కుంటిమద్ది గ్రామం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | అవధాని,కవి |
మతం | హిందూ |
తండ్రి | లక్ష్మీనరసప్ప |
తల్లి | లక్ష్మీనరసమ్మ |
గండ్లూరి దత్తాత్రేయశర్మ లక్ష్మీనరసమ్మ, లక్ష్మీనరసప్ప దంపతులకు 1950 మార్చి 2కు సరియైన విరోధి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు అనంతపురం జిల్లా కుంటిమద్ది గ్రామంలో జన్మించాడు[2]. చిన్నతనంలోనే ఇతడు తన తండ్రి వద్ద అమరము, ఆంధ్రనామసంగ్రహం, గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము మొదలైనవి నేర్చుకున్నారు. ఇతని ప్రాథమిక విద్య కుంటిమద్ది గ్రామంలోనే జరిగింది. మధురకవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి ఇతనికి పాఠశాలలో తెలుగు పంతులు. అతని ప్రోత్సాహమే గండ్లూరి దత్తాత్రేయశర్మకు సాహిత్యరంగంపట్ల మక్కువ కలిగించింది. యస్.యస్.ఎల్.సి ఉత్తీర్ణుడైన తర్వాత ఇతడు తిరుపతి ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివాడు. అక్కడ శతావధాని గౌరిపెద్ది రామసుబ్బశర్మ వద్ద అవధానంలో మెళకువలు నేర్చుకున్నాడు. 1970 నుండి అవధానాలు చేయడం ప్రారంభించాడు. 1973లో విద్వాన్ పూర్తిచేసి 1974లో కర్నూలులో పండిత శిక్షణ పొంది ద్రోణాచలం (డోన్) లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఉన్నతపాఠశాలలో ఆంధ్రోపాధ్యాయుడిగా చేరి పదవీవిరమణ వరకు అక్కడే పనిచేశాడు. ప్రైవేటుగా ఎం.ఏ, పి.హెచ్.డిలు సంపాదించాడు. గుంటూరు, బేతంచర్ల, కర్నూలు ప్రాంతాలలో శతావధానాలు, ఢిల్లీ, సేలం, హోసూరు, భువనేశ్వర్, బెంగళూరు మొదలైన రాష్ట్రేతర ప్రాంతాలతో పాటుగా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన పలుచోట్ల అష్టావధానాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇతడు జోస్యుల సదానందశాస్త్రితో కలసి జంటగా అవధానాలు కొన్ని చేశాడు.
ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలలో మచ్చుకు కొన్ని ఇక్కడ చూద్దాం.
పూరణ
పూరణ
పూరణ
పూరణ
ఇతనికి అవధాన సరస్వతి, అవధానరత్న, అవధాన విద్యావాచస్పతి, అవధాన కళాప్రపూర్ణ అనే బిరుదులున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.