బేతంచర్ల

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా జనగణన పట్టణం From Wikipedia, the free encyclopedia

బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం లోని జనగణన పట్టణం. అదే పేరుగల మండలానికి ఇది కేంద్రం. history బేతంచర్ల గా పిలవబడుతున్న ఈ గ్రామానికి అతి ప్రాచీన పేరు బేతాళపురం ఈ ప్రాంతంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఒక పెద్ద చెరువు ఉండేది.కారణం ఇది రాతి ప్రాంతం ఇక్కడ నీరు నిలువ ఉండేది కాదు అది ఆరవ శతాబ్దం.ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్యులు ఇక్కడ ఒక పెద్ద చెరువును త్రవ్వించడం జరిగింది. ఇక్కడ ప్రజలు దాహం తీర్చడానికి, పాడిపంటలు పండించడానికి, అశ్వములకు నీటిని అందించడానికి, తద్వారా ఈ ప్రాంతాన్ని బేతం చెరువుగా పిలిచేవారు. కొంతకాలానికి ఇక్కడ నీటి ప్రాంతం కాలగర్భంలో కలిసిపోయింది. తరువాత కాలక్రమంలో బేతంచర్ల గా రూపాంతరం జరిగింది. ఈ బేతంచర్ల ప్రాంతం చుట్టూ వందల శతాబ్దాల కలిగిన దేవాలయాలు కట్టడాలు ఉన్నాయి. బేతంచెర్ల ఊరి పేరు చెబితే అందరికీ గుర్తు వచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చలువ రాతి(Lime Stone).ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి ప్రపంచ నలుమూలల బండలు వెళ్ళేవి.

త్వరిత వాస్తవాలు బేతంచర్ల, దేశం ...
పట్టణం
Thumb
Coordinates: 15.4667°N 78.1667°E / 15.4667; 78.1667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండలంబేతంచెర్ల మండలం
Area
  మొత్తం
25.75 కి.మీ2 (9.94 చ. మై)
Population
 (2011)[1]
  మొత్తం
38,994
  Density1,500/కి.మీ2 (3,900/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1008
Area code+91 ( 85175  )
పిన్(PIN)518599 
Website
మూసివేయి

భౌగోళికం

జిల్లా కేంద్రమైన నంద్యాల కు పశ్చిమంగా 47 కి.మీ దూరంలో వుంది.ఈ ప్రాంతం రాష్ట్ర రాజదానైన అమరావతికి 373 కి.మీ దూరంలో వుంది.హైదరాబద్ కు 273 కి.మీ దూరంలో వుంది. ఈ ప్రాంతం తిరుపతి కు 312 కి.మీ దూరంలో వుంది.

జనగణన గణాంకాలు

2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 38,994.

పరిపాలన

బేతంచర్ల నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.ఈ పట్టణం శ్రీ బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి గారిచె అబివృధ్ధి చెందినది.

త్రాగునీటి సౌకర్యాలు

ఈ పట్టణoలో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు.[2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

  • శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రంగాపురం: శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నిక గన్నది.
  • పుట్ట పెద్దమ్మ ఆలయం: బేతంచర్ల పట్టణ శివారులోని బనగానిపల్లె రహదారి సమీపంలో వెలసిన ఈ ప్రార్ధనా స్థలం

మూలాలు

వెలుపలి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.