కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.

Thumb
కొమర్రాజు లక్ష్మణరావు కుటుంబం
Thumb
కవి సిద్ధార్థ కుటుంబం

ప్రాథమిక సూత్రం

Thumb
Family tree showing to the orange person. Cousins are colored green. The genetic kinship degree of relationship is marked in red boxes by percentage (%).

"కుటుంబం"లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. ఈ లక్షణాలు ఒకో సమాజంలో ఒకో విధంగా వర్తిస్తుంటాయి.కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం - శారీరకంగా గాని, సామాజికంగా గాని వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం.[1][2] కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చును.[3] అదే పెద్దల దృష్టినుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబలక్ష్యంగా కనిపిస్తుంది.[4] అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. ఆడవారు, మగవారు వేరు వేరు పనులు పంచుకొని జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు (భార్యాభర్తల) సహజీవనం సమాజం ఆర్థికవ్యవస్థకు చాలా అవుసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది.[5][6][7]

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

Thumb
శిశువు, అతని తల్లి, అతని అమ్మమ్మ, అతని తాతమ్మ

విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992లో మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంను జరుపుకోవడానికి నిశ్చయించింది.[8].కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము.[9]

కుటుంబం నుంచి కుటుంబాలు

ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లె వీలైతే ఒక తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటా యి.అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో. కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యో గక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుం బా లకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సం స్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదం టే అతిశయోక్తి కాదు. అనేక కుటుం బాలు వ్యక్తిగత కార ణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేకకు టుంబాల మధ్య కని పించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.

సిరిసంపదల ఉమ్మడి కుటుంబాలు

Thumb
Georgian family of writer Vazha-Pshavela (in the middle, sitting)

భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరి ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమష్టి సంపదనే, సమష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానిే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకు నే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదు.

విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు

విదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది. డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కడం లేదంటే మనకుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మయ్యాయో అర్థం చేసు కోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్లయిన మరు నాడే వేరుకాపురాలు పెట్టుకుని జంట లుగా ఒంటరై పోతున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం, ఆపదలో ఆదుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకు నే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం.

వసుధైక కుటుంబం

కుటుంబంతో కలసి మనుగడ సాగించడంలోని గొప్పతనం ఏమి టంటే మనని మనం ఎవరికీ పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండా జీవితం గడపడమే అని ఒక మేధావి సెలవిచ్చాడు. అంటే కుటుంబవ్యవస్థకు అంత ప్రాధాన్యత ఉంది. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మ ళ్లీ ఉమ్మడి కుటుం బాలకు జీవం పో యాల్చిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఈ రోజు అందరం మనస్ఫూర్తిగా ప్రతీన పునాలి. కులాలు, మతాలు, వర్గాలు ఎన్ని ఉన్న ప్పటికీ మన దేశం లోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవి స్తున్నారు. అందుకే మనదేశాన్ని ఉదారచరితానాంతు వసుధైైక కుటుంబం అన్నారు. అలాంటిది మన ఇంటిలోని వారు కలసిమెలసి జీవిం చలేరా? ఆ రోజు మళ్లీ రావాలి. అప్పుడే వసుధైైక కుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.

కుటుంబసభ్యులు

  • కొడుకు లేదా కుమారుడు: కుటుంబములోని మగ సంతానాన్ని పుత్రుడు, కొడుకు లేదా కుమారుడు అంటారు.పున్నామ నరకంనుండి తల్లితండ్రుల్ని రక్షించేవాడు కొడుకని పూర్వీకుల నమ్మకం.పూర్వకాలంలో సమాజంలో మగ సంతాననికి, ఆడ సంతానంకంటే విలువ ఎక్కువ. మగవాడైతే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తాడని పాతకాలంలో కొడుకులు కావాలనుకొనేవారు. కానీ ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా డబ్బు గడించడంతో ఇద్దరి మధ్య తేడాలు క్షీణిస్తున్నాయి.
  • కోడలు: కొడుకు భార్యను కోడలు అంటారు.అలాగే మేనమామ లేక మేనత్త కూతురుని మేనకోడలు అంటారు.
  • తమ్ముడు: ఇద్దరు లేక ఎక్కువమందిగల కుటుంబంలోని సంతానంలో (అన్నాతమ్ముల్లు, అక్కాతమ్ముల్లు) వయసులో చిన్నవాడైన పురుషుడిని తమ్ముడు అంటారు. సంస్కృతంలో అనుజుడు అని పిలుస్తారు.
  • తాతమ్మ: తాత లేక నాన్నమ్మ లేక అమ్మమ్మకు తల్లిని తాతమ్మ అంటారు. కొన్ని ప్రాంతాల్లో తాతకు తల్లిని మాత్రమే తాతమ్మ అని, నాన్నమ్మ లేక అమ్మమ్మకు తల్లిని జేజమ్మ అంటారు. తాతకు తల్లిని ముత్తమామ్మ అని, తాత తండ్రిని ముత్తాత అని అంటారు.
  • చెల్లెలు:ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబంలోని సంతానంలో (అన్నాచెల్లెలు, అక్కాచెల్లెలు) వయసులో చిన్నదైన స్త్రీని చెల్లెలు లేదా చెల్లి అంటారు. సోదరి చెంత ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
  • తోడికోడలు: ఒకే కుటుంబంలోని అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్నవారు తోడికోడళ్ళు అని అంటారు.వీరు వరుసకు అక్కాచెల్లెళ్ళు అవుతారు. వరుసకు పెద్ద వారిని అక్క, అని, చిన్నవారిని చెల్లి లేదా చెల్లాయి అని పిలుచు కుంటారు.( బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడి కోడలు అని చెబుతారు. తోడికోడళ్ళు సినిమాలో మానవ సంబంధాలు చూపించారు.
  • తోబుట్టువులు: ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అనగా తోడ పుట్టిన వారని, అందరూ మగ పిల్లలయితే సహోదరులని (సహ+ఉదరులు), అన్న లేక తమ్ముడుని సహోదరుడు అని, అక్క లేక చెల్లి ని సహోదరి, లేదా తోబుట్టువు అని కూడా పిలుస్తారు.
  • నానమ్మ: నాన్న తల్లిని నాన్నమ్మ, నాయనమ్మ అని లేదా అవ్వ అనీ అంటారు. ఉమ్మడి కుటుంబంలో నాన్నమ్మ పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని తాతతో కలిసి నడపడం ఆమె బాధ్యతగా ఉంటుంది.
  • బాబాయి: నాన్న తమ్ముడిని లేదా అమ్మ చెల్లెలి భర్తను బాబాయి లేక చిన్నాన్న అంటారు.గ్రామీణ ప్రాంతాలలో కక్కాయి అని అంటుంటారు.ఇతనిని తండ్రితో సమానంగా గౌరవించుతారు.
  • వియ్యంకుడు: వియ్యం పొందిన వాడు వియ్యంకుడు. (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో, వియ్యంకుడిని 'వీరకాడు' అనిపిలుస్తారు.
  • వియ్యపురాలు: వియ్యంకుడు భార్య వియ్యపురాలు అని అంటారు.కొన్ని ప్రాంతాలలో 'వీరకత్తె' అని పిలుస్తారు.

గమనిక:వధూవరుల తల్లిదండ్రులు ఒకరికి ఒకరు వియ్యంకుడు, వియ్యపురాలు అవుతారు. వియ్యంకులు ఇద్దరూ బావ (బాగా దగ్గరి వారైతే) అని, బావ గారు అని పిలుచుకుంటారు. వియ్యపురాళ్ళు ఇద్దరూ వదిన అని (బాగా దగ్గరి వారైతే), వదిన గారూ అని పిలుచుకుంటారు.

  • సవతి: ఒక మగవాడికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్లయితే ఆ భార్యలు ఒకరికొకరు సవతి లేదా సపత్ని అనబడుతారు. ఆ వ్యక్తికి ఒక భార్య ద్వారా కలిగిన పిల్లలకు అదే వ్యక్తి మరొక భార్య సవతి తల్లి అవుతుంది. సవతి తల్లి కొడుకును సవతి కొడుకు అంటారు. సవతుల మధ్య ఉన్న జగడాన్నిసవతి పోరు అంటారు.బహుభార్యాత్వం ఉన్న పరిస్థితులలో కుటుంబ జీవనంలో సవతుల మధ్య ఉన్న సంబంధాలు చాలా గాఢమైన ప్రభావాలు కలిగి ఉంటాయి. తన కడుపున పుట్టకుండా తన భర్తకు మరొక స్త్రీ వలన కలిగిన పిల్లల పట్ల "సవతి తల్లి" చూపే విచక్షణ తెలుగులో అనేక కథలకు, సినిమాలకు ప్రధాన ఇతివృత్తంగా ఉండేది. మారుతున్న పరిస్థితులలో ఈ కథలకు ప్రాధాన్యత తగ్గింది.

కుటుంబపింఛను

విశ్రాంత ఉద్యోగి సజీవంగా ఉంటూ పింఛను పొందుతుంటే సర్వీసు పింఛనుగాను, మృతి చెందాక కుటుంబ సభ్యులకు ఇచ్చే పింఛనును కుటుంబ పింఛనుగాను వ్యవహరిస్తారు. 75-80 వయస్సు వారికి అదనంగా 15 శాతం, 80-85 వయస్సు వారికి 20 శాతం... ఇలా పెంచుకుంటూ, వందేళ్లు పైపడ్డవారికి 100 శాతం అదనంగా పింఛను ఇవ్వాలి.

జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం

కుటుంబ దౌర్జన్యం చట్టం 498-ఎ ను దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేదాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబరు 12 ను జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవంగా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణ ప్రతిష్ఠానం సంయుక్తంగా నిర్ణయించాయి.[10]

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.