Remove ads
From Wikipedia, the free encyclopedia
కొవ్వులు, కొవ్వు పదార్ధాలు అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలామంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి మాటలు వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి (sub set) మాత్రమే. కనుక తెలుగులో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.
కొవ్వులు (లిపిడ్‌లు) మరో ముఖ్యమైన జీవ రసాయనాలు. ద్రవరూపంలోని కొవ్వులను నూనెలు అంటారు. ఆహార నిల్వలుగా మాత్రమే కీలకమైన క్రియాశీల చర్యలను ఇవి నిర్వహిస్తాయి. కొవ్వులు సాధారణంగా నాలుగు రకాలు. అవి..
సరళ కొవ్వుల్లో గ్లిసరాల్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అవి.. సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్. కొవ్వు ఆమ్లంలోని కార్బన్‌లన్నింటి మధ్య ఏకబంధాలు ఏర్పడితే అవి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.
ఉదా: పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు. కార్బన్‌ల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఏర్పడితే వాటిని అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమాలు అంటారు. ఉదా: లినోలిక్, ఓలిక్ కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ ఒక ముఖ్యమైన సంక్లిష్ట కొవ్వు. దాని నుంచి శరీరంలో అనేక స్టిరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. ఆహారంలో సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే రక్తంలో చే డు కొలెస్టరాల్ పేరుకొని గుండె పనితీరు దెబ్బ తింటుంది. అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
నిఘంటువులో fat అనే మాటకి కొవ్వు, గోరోజనం, మేద, మదం, కావరం, పోతరం, హామిక అన్న అర్ధాలు ఉన్నాయి. వీటిలో fat అనే మాటకి 'కొవ్వు' అనే అర్థం స్థిరపడిపోయింది కనుక ఆ మాటని వదలి పై జాబితాలో ఉన్న మరే మాటని అయినా lipid అనే మాటకి సమానార్ధకంగా తీసుకోవచ్చు. కొవ్వు అన్న మాటతో ప్రాస కుదురుతుంది కనుక lipid = కావరం అని ప్రయోగించి చూడవచ్చు. అప్పుడు 'fats and lipids' అనే పదబంధాన్ని 'కొవ్వులు, కావరాలు' అని తెలిగించి చూడవచ్చు. లోగడ lipids ని 'గోరోజనాలు' అని తెలిగించినవారు ఉన్నారు.
స్థూలంగా నిర్వచించాలంటే కావరాలు (lipids) కొవ్వు పదార్ధాలలో కరిగే, సహజసిద్ధంగా దొరికే బణువులు (molecules). ఉదాహరణకి కొవ్వులు (fats), నూనెలు (oils), మైనాలు (waxes), కొలెస్టరాల్ (cholesterol), కొవ్వులో కరిగే విటమినులు (అనగా విటమిన్ A, D, E, K లు), మోనోగ్లిసరైడ్‌లు, డైగ్లిసరైడ్‌లు, ట్రైగ్లిసరైడ్లు, మొదలగునవి. మరొక కోణం ద్వారా వివరించాలంటే 'కొవ్వు పదార్ధాలు ట్రైగ్లిసరైడ్లు అనే పేరుగల కావరాలు.' కావరాలు శరీరంలో ముఖ్యంగా మూడు పనులు చేస్తాయి: శక్తిని నిల్వ చెయ్యటం (storage of energy), కణ కవచం (cell membrane) యొక్క నిర్మాణంలో తోడుపడటం, వార్తలని మోసుకెళ్ళే ప్రక్రియలో సహాయపడటం. కావరాలు నీటిలో కరుగవు; కానీ బెంజీన్, ఈథర్, క్లోరోఫామ్ మొదలైన వాటిలో కరుగుతాయి. ఇవి ఆహర పదార్ధాలలోని ముఖ్యమైనవి. కొవ్వు పదార్ధాలు శక్తి నిల్వ పదార్ధాలుగ పనిచేస్తాయి.
కావరాలని స్థూలంగా రెండు వర్గాలుగా విడగొట్టవచ్చు: నీరంటే విముఖత చూపేవి (hydrophobic) ఒక వర్గం, నీరంటే సుముఖత, విముఖత రెండూ ఒకేసారి చూపేవి (ambiphilic) రెండో వర్గం. ఇక్కడ hydro అంటే నీరు. phobia అంటే భయం, కిట్టకపోవటం, ఇష్టం లేకపోవటం. మనకి పరిచయం ఉన్న నూనెలు, నేతులు, చాల వరకు నీళ్ళల్లో కలవవు - అంటే వాటికి నీళ్ళంటే 'ఇష్టం' లేదన్న మాట. నీటితో సఖ్యత చూపటం లేదన్న మాట. అలాగే ambi అంటే రెండు విరుద్ధ భావాలపై ఎటూ మొగ్గు చూపకపోవటం. ఈ ధోరణిలో ఆలోచించుకుంటూ వెళితే కావరాలలో ఎనిమిది జాతులని గుర్తించి, ఒకొక్క జాతిని ప్రత్యేకంగా అధ్యయనం చెయ్య వచ్చు.
శరీర పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ కావరాలు చాల కీలమైన పాత్ర వహిస్తాయి. కొన్ని కావరాలు మన మనుగడకే అత్యవసరం. మరికొన్ని కావరాలు మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేసి రోగకారకాలు అవుతాయి. ఉదాహరణకి కోలెస్టరాల్ (cholesterol), అడ్డుకొవ్వు ఆమ్లాలు (trans-fatty acids) మోతాదు మించితే గుండెజ్బ్బు కలుగజేస్తాయని శాస్త్రవేత్తల తీర్మానం.
మానవుల మనుగడకి కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అత్యవసరం (essential fatty acids). ఉదాహరణకి లినోలియిక్ ఆమ్లం (ఇది ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లం), ఆల్ఫా-లినోలియిక్ ఆమ్లం (ఇది ఒమేగా-3 జాతి కొవ్వు ఆమ్లం) అనే రెండు పదార్ధాలూ ఉన్న ఆహారం మనం తిని తీరాలి; ఎందుకంటే మన శరీరాలు వీటిని తయారు చేసుకోలేవు. చాల శాకాలనుండి లభించే నూనెలలో (ఉ. సేఫ్లవర్ నూనె, సూర్యకాంతం గింజల నూనె, మొక్కజొన్న నూనె) ఈ లినోలియిక్ ఆమ్లాలు ఉంటాయి. అదే విధంగా చాల రకాల ఆకు కూరలలోనూ, పప్పులలోనూ (ఉ. సోయా చిక్కుడు, కనోలా, ప్లేక్స్) గింజలు (seeds) లోనూ, పిక్కలు (nuts) లోనూ ఆల్ఫా-లినోలియిక్ ఆమ్లం ఉంటుంది. దసాయన బణునిర్మాణ కోణంలో చూస్తే ఈ రెండు రకాల ఆమ్లాల లోనూ (అనగా, లినోలియిక్ ఆమ్లం, ఆల్ఫా-లినోలియిక్ ఆమ్లం ) ఒకొక్క బణువులో 18 కర్బనపు అణువులు ఉన్నాయి; తేడా అల్లా ఎన్నెన్ని జంట బంధాలు (double bonds) ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంలోనే. కొన్ని చేప నూనె () లలో ఇంకా పొడవాటి కర్బనపు గొలుసులు ఉన్న ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లాలు - eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) - ఉంటాయి.
లంకె లంకెపేరు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.