కార్వాన్

From Wikipedia, the free encyclopedia

కార్వాన్‌ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇక్కడ ఎక్కువగా వజ్రాల వ్యాపారం (కార్వా) జరిగేది. కార్వా (వ్యాపారం) కోసం వచ్చీపోయే కూడలి ప్రాంతం కాబట్టి దీనికి కార్వాన్‌ అని పేరు వచ్చింది. కుతుబ్ షాహీలు పాలనలో ముఖ్య వాణిజ్య కేంద్రంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది కార్వాన్ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

త్వరిత వాస్తవాలు కార్వాన్, దేశం ...
కార్వాన్
సమీపప్రాంతాలు
Thumb
కార్వాన్
Location in Telangana, India
Coordinates: 17°22′28″N 78°26′30″E
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
  Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
  అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 006
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకార్వాన్
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
మూసివేయి

చరిత్ర

ఒకప్పుడు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. గుజరాతీ వజ్ర వ్యాపారస్థులు వజ్రాలను ఇక్కడే పోసి విక్రయించేవారని ప్రతీతి. వ్యాపారస్థులకు 'సాహుకారి' అని పేరుండేది. ఈ ప్రాంతాన్ని సాహుకారి కార్వా అని కూడా పిలిచేవారు. కోహినూరు వజ్రమును కార్వాన్‌లోనే సానపట్టారని స్థానిక పెద్దలు చెప్తారు. కార్వా అంటే వ్యాపారం కోసం వచ్చీపోయే కూడలి అని అర్థం. అలా వజ్రాలు, ముత్యాల వర్తకుల కూడలిగా సాహుకారి కార్వా, కార్వాన్‌గా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతమిది. 1908నాటి హైదరాబాదు వరదలు తాకిడికి ఈ ప్రాంతం బాగా దెబ్బతినడంతో ఇక్కడి వ్యాపారులు క్రమేణా కోఠిలోని ప్రస్తుత గుజరాతీ గల్లీ ప్రాంతానికి తరలివెళ్లారని కథనం.

సంస్కృతి

ఇక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఈ ప్రాంతానికి నిజాం కాలంనుండే ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ వజ్రాలు, ముత్యాల మార్కెట్లు ఉండేవి. ఆ కాలంలో నిర్మించిన భవనాలు, దేవాలయాలు, మసీదులు (కుల్సమ్ బేగం మసీదు) ఈనాటి వరకు కూడా ఉన్నాయి. ఇది చేనేత బట్టలకు కూడా పేరొందిన ప్రాంతం. బోనాల పండుగ సందర్భంగా జంట నగరాల్లోకెల్ల పెద్దదైన దర్బార్ మైసమ్మ ఆలయంలో ఉత్సవాలు జరుపుతారు. ప్రతి సంవత్సరం కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలలో యాదవులు సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.[3]

వాణిజ్యం

మెహదీపట్నం రైలు బజార్, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ ఇక్కడికి సమీప దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న అనేక కన్వెన్షన్ కేంద్రాలలో పెద్ద కార్యక్రమాలన్నీ జరుగుతాయి.

  1. వింటేజ్ ప్యాలెస్
  2. క్రౌన్ ఫంక్షన్ హాల్
  3. మహాబూబ్ ప్రైడ్ ప్యాలెస్
  4. కెఎస్ ప్యాలెస్
  5. ఎస్.బి.ఏ. గార్డెన్
  6. గ్రాండ్ గార్డెన్ హాల్
  7. ఎస్.డి.ఏ. ప్యాలెస్

విద్యాలయాలు

ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటైన భరత్ అభ్యుదయ ఉన్నత పాఠశాల కూడా ఈ ప్రాంతంలో ఉంది.

  1. భారతి ఉన్నత పాఠశాల
  2. వివేకానంద ఉన్నత పాఠశాల
  3. సెయింట్ మేరీ ఉన్నత పాఠశాల
  4. డి 'డ్రాప్ హై స్కూల్
  5. ముస్సికో కళాశాల
  6. శ్రీ గాయత్రీ ఇ-టెక్నో స్కూల్
  7. న్యూజెన్ స్కూల్ అఫ్ ఎక్స్లెన్స్
  8. కాకతీయ విద్యానికేతన్

సినిమా హాళ్ళు

  1. ఎస్.వి.సి. ఈశ్వర్
  2. ఆసియా సినిమాస్ ఎం క్యూబ్
  3. సినీపోలీస్
  4. అలాంకర్ సినిమాస్ - లంగర్‌హౌస్

సమీప ప్రాంతాలు

బ్యాంకులు

  1. భారతీయ స్టేట్ బ్యాంకు
  2. ఆంధ్రా బ్యాంకు
  3. విజయ బ్యాంకు

రవాణా వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కార్వాన్‌ మీదుగా సి.బి.ఎస్., గోల్కొండ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి 5 కి.మీ. దూరంలో హైదరాబాదు రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.