కారంపూడి మండలం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

కారంపూడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

త్వరిత వాస్తవాలు కారంపూడి మండలం, దేశం ...
ఆంధ్రప్రదేశ్ మండలం
Thumb
Coordinates: 16.428°N 79.721°E / 16.428; 79.721
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంకారంపూడి
విస్తీర్ణం
  మొత్తం
238 కి.మీ2 (92 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం
52,367
  సాంద్రత220/కి.మీ2 (570/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి974
మూసివేయి

మండల కేంద్రం

కారంపూడి, పల్నాడు జిల్లా, కారంపూడి మండలం లోని గ్రామం.ఇది అదే పేరుతో ఉన్నమండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3492 ఇళ్లతో, 14385 జనాభాతో 1726 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7651, ఆడవారి సంఖ్య 6734. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1844 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1657. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589870[3].పిన్ కోడ్: 522614, ఎస్.టి.డి.కోడ్ = 08649.

మండల గణాంకాలు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 50,317 -అందులో పురుషులు 25,705 స్త్రీలు 24,612 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. ఒప్పిచర్ల
  2. కారంపూడి
  3. చింతపల్లి
  4. చినకొదమగుండ్ల
  5. చినగార్లపాడు
  6. నరమాలపాడు
  7. పెదకొదమగుండ్ల
  8. పేటసన్నిగండ్ల
  9. మిరియాల
  10. శంకరాపురం సిద్ధయి

రెవెన్యూయేతర గ్రామాలు

మండలంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు

  • Thumb
    కొమెర అంకారావు, కారెంపూడి
    కొమెర అంకారావు: ఇతను కారెంపూడి గ్రామంలో 1983లో రాములు, ఏడుకొండలు దంపతులకు జన్మించాడు. ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత రెండు దశాబ్దాలుగా పైగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవులలో ప్లాస్టిక్ నిర్మూలన చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందాడు.[4]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.