లక్ష్మీపురం (కారంపూడి)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం From Wikipedia, the free encyclopedia

లక్ష్మీపురం, పల్నాడు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం 1955 లో ఏర్పడింది. దశాబ్దాలక్రితం జిల్లాలోని తూర్పుప్రాంతం నుండి వలస వచ్చిన కుటుంబాలు, నాగార్జునసాగరు కుడికాలువ పై ఉన్న రామాపురం మేజరును ఆనుకొని గ్రామాన్ని ఏర్పరుచుకొన్నారు. వీరంతా మంచి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. సగం గ్రామం "మిరియాల" పంచాయతీ లోనూ, సగం గ్రామం "పెదకొడిమగుండ్ల" పంచాయతీ లోనూ ఉండేది. 1997 లో ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీగా గుర్తించింది. అప్పటినుండి నాలుగు సార్లు జరిగిన పంచాయతీ ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతవరకూ ఈ గ్రామానికి సర్పంచులుగా తుపాకుల సైదులు, మర్రెడ్డి కృష్ణారెడ్డి, వజ్రాల పెద అంబిరెడ్డి, లింగిరెడ్డి రోశమ్మ పనిచేశారు. 2013 జూలైలో ఈ గ్రామానికి జరిగిన పంచాయతీ ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిగా గొరిగే అమర నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.399201°N 79.76738°E /, రాష్ట్రం ...
లక్ష్మీపురం
  రెవెన్యూయేతర గ్రామం  
Thumb
లక్ష్మీపురం
అక్షాంశరేఖాంశాలు: 16.399201°N 79.76738°E / 16.399201; 79.76738
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి అమర నాగేశ్వరరావును
పిన్ కోడ్ 522614
ఎస్.టి.డి కోడ్
మూసివేయి

ప్రస్తుతం ఈ గ్రామ జనాభా=927. వీరిలో పురుషుల సంఖ్య=468, స్త్రీల సంఖ్య=459. ఓటర్లు-336. వీరిలో పురుషుల సంఖ్య=336, స్త్రీల సంఖ్య=331. [1]

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.