కాక్‌చింగ్

మణిపూర్ రాష్ట్రంలోని కాక్‌చింగ్ జిల్లా ముఖ్య పట్టణం, From Wikipedia, the free encyclopedia

కాక్‌చింగ్map

కాక్‌చింగ్, మణిపూర్ రాష్ట్రంలోని కాక్‌చింగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. రాష్ట్ర ఆగ్నేయ భాగంలో ఉన్న ఈ పట్టణం, రాష్ట్రంలో ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. 2018లో కాక్‌చింగ్ పట్టణాన్ని ఈశాన్య భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా ప్రకటించారు.[1][2][3][4][5]

త్వరిత వాస్తవాలు కాక్‌చింగ్, రాష్ట్రం ...
కాక్‌చింగ్
పట్టణం
Thumb
కాక్‌చింగ్ పట్టణ దృశ్యం
Thumb
కాక్‌చింగ్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
Thumb
కాక్‌చింగ్
కాక్‌చింగ్ (India)
Coordinates: 24.48°N 93.98°E / 24.48; 93.98
రాష్ట్రంమణిపూర్
జిల్లాకాక్‌చింగ్
Elevation
776 మీ (2,546 అ.)
జనాభా
 (2011)
  Total32,138
భాషలు
  అధికారికమీటీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎంఎన్
మూసివేయి

భౌగోళికం

కాక్‌చింగ్ పట్టణం 24.48°N 93.98°E / 24.48; 93.98 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[6] ఇది ఇంఫాల్ లోయకు దక్షిణ భాగంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 776 మీటర్ల (2,545 అడుగుల) ఎత్తులో ఉంది. ఈ పట్టణం రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుండి సుమారు 44 కి.మీ., బర్మా అంతర్జాతీయ సరిహద్దు నుండి సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కాక్‌చింగ్ పట్టణంలో 32,138 జనాభా ఉంది. ఇందులో 15,710 మంది పురుషులు, 16,428 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 4,181 (13.01%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు 985 తో పోలిస్తే 1,046 గా ఉంది. పట్టణ అక్షరాస్యత రేటు 83.08% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 90.21% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 76.40%గా ఉంది.[7] జనాభా, అభివృద్ధి, విద్య పరంగా కాక్‌చింగ్ జిల్లాలో ఇది అతిపెద్ద పట్టణం. 

ఆర్థిక వ్యవస్థ

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వడ్రంగి, కంసాలి, అమ్మకాలు, నిర్మాణ పనులు, పశువుల పెంపకం వంటి ఇతర వృత్తులు కూడా ఉన్నాయి. కాక్‌చింగ్ పట్టణాన్ని మణిపూర్ రాష్ట్ర ధాన్యాగారం అని అంటారు. ఇక్కడ అత్యధిక శాతం ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తారు. సరైన నీటిపారుదల, కాలువ సౌకర్యాలు ఉండడం వల్ల ఇక్కడి రైతులకు రెట్టింపు పంటను పండించే వీలు కలిగింది. వరి, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, బంగాళాదుంపలు ఇక్కడి ముఖ్యమైన పంటలు. హస్తకళా ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు.

Thumb
లై హరొబా

కాక్‌చింగ్ గార్డెన్

కాక్‌చింగ్ పట్టణానికి దక్షిణం వైపునున్న ఉయోక్ చింగ్ వద్ద ఈ కాక్‌చింగ్ గార్డెన్ ఉంది. దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రదేశంలో మహాదేవ్ ఆలయం, ఇబుధౌ పఖాంగ్ లైసెంగ్, హావో సంపుబి విగ్రహం, గులాబీ తోట, ఉద్యానవనం, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ గార్డెన్ ను చేరుకోవడానికి వాహనాల కోసం కొండ వరకు రహదారిని నిర్మించారు.

రాజకీయాలు

కాక్‌చింగ్ పట్టణం, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. 9వ అసెంబ్లీ ఎన్నికల ఈ నియోజకవర్గం నుండి మాయాంగ్లాంబం రామేశ్వర్ సింగ్ కాక్‌చింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[8]

రవాణా

కాక్‌చింగ్ పట్టణం నుండి తౌబాల్, మోరే పట్టణాలకు 1వ ఏసియన్ హైవే ద్వారా రోడ్డుమార్గం ఉంది. అంతర జిల్లా రోడ్డుమార్గం ద్వారా ఇది చందేల్ జిల్లా ప్రధాన కార్యాలయానికి కలుపబడి ఉంది. ఇండో-బర్మా సుగ్ను రోడ్ రాష్ట్రం జాతీయ రహదారి కూడా కాక్‌చింగ్ పట్టణాన్ని కలుపుతుంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.