Remove ads
మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా ముఖ్య పట్టణం. From Wikipedia, the free encyclopedia
తౌబాల్, మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. 18 మున్సిపల్ వార్డులతో మున్సిపల్ కౌన్సిల్ గా ఏర్పడింది. 'అథౌబా' అనే పదం నుండి 'తౌబాల్' వచ్చింది. మణిపూర్ రాష్ట్రంలోని పెద్ద పట్టణాల్లో ఒకటైన ఈ పట్టణంలో అనేక సరస్సులు, నదులు, వరి పొలాలు, తోటలు ఉన్నాయి.
తౌబాల్ పట్టణం 24.63°N 94.02°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 765 మీటర్ల (2,509 అడుగుల) ఎత్తులో ఉంది. ఇది తౌబల్ నది ఒడ్డున ఉంది.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [3] తౌబాల్ పట్టణంలో 41,149 జనాభా ఉంది. ఈ జనాభాలో 50% మంది పురుషులు, 50% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 75% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 85% కాగా, స్త్రీల అక్షరాస్యత 65%గా ఉంది. మొత్తం జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
చుట్టూ కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం ట్రెక్కింగ్, హైకింగ్ లకు అనువుగా ఉంటుంది. ఇక్కడ అందమైన నదులు, సరస్సులు ఉన్నాయి. ఇక్కడి స్థానిక ప్రజలు తమ ఇళ్ల మైదానంలో మర్రి చెట్లను పెంచుతారు.[4]
తౌబాల్ పట్టణం, 31 - తౌబాల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.
తౌబాల్ పట్టణం నుండి టాటా మ్యాజిక్, ఆటో, వింగర్ వంటి వాహనాల ద్వారా మాత్రమే రవాణా సౌకర్యం ఉంది.
2006 సామాజిక-ఆర్థిక సర్వే ప్రకారం, ఈ పట్టణంలో 15,320 (పట్టణ జనాభాలో 36.94%) మంది శ్రామికులు ఉన్నారు. ఈ శ్రామిక జనాభాలో 10,207 (24.61%) మంది పురుషులు, 5,113 (12.33%) మంది స్త్రీలు ఉన్నారు. పట్టణంలో శ్రామికుల తలసరి వార్షిక ఆదాయం రూ. 24,810 గా ఉంది.
ఇక్కడ తౌబల్ జిల్లా ఇండోర్ స్టేడియం ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.