ఒడిసలు నూనె
From Wikipedia, the free encyclopedia
ఒడిసలు లేదా ఆంగ్లంలో Niger seed అని పిలువబడే ఈమొక్కను నూనె గింజలకై సాగు చేస్తున్నారు. ఈమొక్క ఆస్టరేసి కుటుంబానికి చెందినది.ప్రజాతి గజొటియ (guizotia). వృక్షశాస్త్రనామము: గజోటియ అబ్సైస్సినిక (guizotia abyssinica) .ఈమొక్క పుట్టుక స్థానం ఇథోఫియగా భావిస్తున్నారు. తెలుగులో వెర్రి నువ్వులు లేదా ఒడిసలు/ఒలిసలు .ఆంధ్ర ప్రదేశ్‍లో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఈపంటను బాగా సాగుచేస్తారు. ఒలిసలు మొక్క యొక్క మొదటి పుట్టుక స్థానం ఆఫ్రికాలోని ఇథియోపియాప్రాంతం[1]
Guizotia abyssinica | |
---|---|
![]() | |
Guizotia flower | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Family: | |
Genus: | Guizotia |
Species: | G. abyssinica |
Binomial name | |
Guizotia abyssinica (L.f.) Cass. | |
Synonyms | |
Guizotia oleifera DC. |

సాధరణంగా ఇతరభాషలలోని పేరు[2]
- హిందీ, గుజరాతి:రామ్తిల్ (Ramtil)
- మరాఠీ:ఖురసని (Khurasani, కరలే (karale)
- కన్నడం:హుచ్చెల్లు (Huchellu)
- తమిళము:పయెల్లు (payellu)
- బెంగాలి:సుర్గియ (surgiya, సొర్గుజ (sorguja)
- అస్సాం:సొర్గుజ (sorguja)
అంతియే కాకుండగా ఇతరదేశాలలో nyger, Ingaseed, Blackseed,, Noog/Nug కూడా పిలుస్తారు.
పంటసాగు[2]
భారతదేశంలో పంటసాగుచేయు రాష్ట్రాలు:ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,, ఒడిషా/ఒడిస్సా .
విదేశాలలో ఈపంట సాగుచేయు దేశాలు: ఇథియోపియా, జర్మన్, వెస్ట్ ఇండియన్, బ్రెజిల్, మెక్సికో, చీనా, నేపాలు, మయన్మార్,
నల్లభూములు, తేమనిలుపుకొను భూములు, అటవీ ప్రాంతాల్లో భూములు, ఈపంటకు అనుకూలం. కనీసవర్షపాతం1000-120మి.మీ, వుండాలి. కొండవాలులలోని రాతి నేలలలో కూడా పండించ వచ్చును. ఖరీఫ్‍సీజనులో జూన్-అగస్టు నెలలలో, రబీఅయినచో సెప్టెంబరు-నవంబరు నెలల్లో విత్తాలి. పంట ఖరీఫులో నవంబరు-డిసెంబరులలో, రబీఅయినచో ఫిబ్రవరి-ఏప్రిలులలో కోతకొచ్చును. గింజ దిగుబడి సాధారణంగా హెక్టారుకు 300-400 కిలోలు వచ్చును. సాగువిధానాన్నిబట్టి 600 కిలోలవరకు దిగుబడి పొందవచ్చును. ఒడిసలు/ఒలిసలు గింజలు చూచుటకు పొద్దుతిరుగు గింజలను పోలి నల్లగావుండి, చిన్నవిగా వుండును.గింజ 4 నుండి 7మి.మీ. పొడవుండును. గింజపై మందమైన పొరవుండును.గింజలో30-32% వరకు నూనెవుండును. పంటకాలం రకాన్నిబట్టి 80రోజులనుండి 145 రోజులుండును. కర్నాటకలో 'No-16 (పంట కాలం120దినాలు, No-24 (పంటకాలం120-125 రోజులు) ; శ్రీకాకుళం, ఒడిషా ప్రాంతలలో మధ్యప్రదేశ్‍లో No-5 (పంటకాలం90రోజులు, N-87 (పంట కాలం80 రోజులు) ;మహరాష్ట్రలో Niger-b (115-120 దయ్స్) ;ఒడిస్సాలో GA.2, GA.10 (135-145రోజులు) సాగుచేయుదురు.
ఒడిసలు/ఒలిసలు గింజలోని సమ్మేళనాలు [3]
వున్న పదార్ధము | విలువలమితి/% |
నూనె | 30-40% |
మాంసకృత్తులు | 10-25% (సగటు:20) |
కరిగే చక్కెరలు | 12-18 (సగటు:12) |
ముడిపీచు | 10-20 |
తేమ | 10-11% |
నూనె[2]
నూనెలో ఏక బంధ, బహుబంధ అసంతృప్త కొవ్వుఆమ్లాలైన ఒలిక్, లినొలిక్ కొవ్వుఆమ్లాలు అధికశాతంలోవున్నాయి. ఈనూనె సెమి డ్రైయింగ్ నూనె. పాలిపోయిన పసుపు లేదా ఆరేంజి వర్ణంలో వుండును. మంచిరుచి, వాసన కలిగివుండును. తాజాగింజలనుండి తీసిన తాజానూనెలో ఫ్రీఫ్యాటి ఆమ్లాల శాతంకూడా అల్పంగా వుండి, ఫిల్టరు తరువాత నేరుగా వంటనూనెగా వినియోగించవచ్చును. నూనెలో బహు ద్విబంధాలున్న లినొలిక్ కొవ్వు ఆమ్లాలు 80% మించివున్నందున, నూనెను ఎక్కువకాలం నిల్వవుంచిన పాడై పోవును. ఒలిసలు నూనె గుణాలలో, కొవ్వు ఆమ్లాలశాతంలో పొద్దు తిరుగుడు నూనెకు దగ్గరిగా వుండును. ఆలివ్ నూనెకు ప్రత్యాయముగా కూడా వాడవచ్చును. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఒడిసలు/ఒలిసలు నూనెలో 50% ఈథోపియాలోను, భారతదేశంలో 3-5% వరకు ఉత్పత్తి అవుతున్నది[4]
ఒలిసలు/ఒడిసలు నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం [5]
కొవ్వు ఆమ్లం | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) | 1.7-3.4) |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 17.0 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 7.0 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 11.0 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 63% |
శుద్ధిచేసిన ఒలిసలు నూనె ( Refined) యొక్క భౌతికలక్షణాల విలువలు [6]
భౌతిక గుణం | విలువల మితి |
సాంద్రత200Cవద్ద | .925-927 |
వక్రీభవన సూచిక400Cవద్ద | 1.466-1.470 |
సపొనిఫికేసను విలువ | 188-192 |
ఐయోడిను విలువ | 128-134 |
అన్ సపొనిఫియబుల్ పదార్థము | .80-1.0% గరిష్ఠము |
తేమ | 0.5-.75% |
పెరాక్సైడ్ ^విలువ | 10 |
నూనె ఉపయోగాలు
- వంటనూనెగా ఉపయోగిస్తారు
- సబ్బులతయారిలో వాడెదరు
- సెమిడ్రయింగ్ నూనెకావడం వలన రంగుల (paints) తయారి పరిశ్రమలలో వినియోగిస్తారు.[4]
- కీళ్ళనొప్పుల నివారణ దేహమర్ధన తైలంగా వాడెదరు.[7]
- ఆలివ్ నూనెకు ప్రత్యాయముగా వాడెదరు.
- ఆవనూనె, నువ్వుల నూనెలలో కల్తి చేయుదురు కొన్ని సందర్భాలలో.[2]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.