స్టియరిక్ ఆమ్లం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
స్టియరిక్ ఆమ్లం (Stearic acid ; IUPAC name octadecanoic acid) 18 కార్బనులు కలిగిన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 16CO2H. దీనికి స్టియరిక్ ఆమ్లం అనేపేరు గ్రీకు భాష లోని στέαρ ( "stéatos" అనగా టాలో (Tallow) నుండి వచ్చింది. దీనిలవణాలు, ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Octadecanoic acid | |
ఇతర పేర్లు
C18:0 (Lipid numbers) | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [57-11-4] |
పబ్ కెమ్ | 5281 |
డ్రగ్ బ్యాంకు | DB03193 |
SMILES | CCCCCCCCCCCCCCCCCC(=O)O |
ధర్మములు | |
C18H36O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 284.48 g·mol−1 |
స్వరూపం | white solid |
సాంద్రత | 0.847 g/cm3 at 70 °C |
ద్రవీభవన స్థానం | 69.6 °C (157.3 °F; 342.8 K) |
బాష్పీభవన స్థానం | 383 °C (721 °F; 656 K) |
నీటిలో ద్రావణీయత |
0.0003 g/100 mL (20 °C) |
వక్రీభవన గుణకం (nD) | 1.4299 |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
స్టియరిక్ ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న, ఏటువంటి ద్విబంధాలు లేని, సరళ (straight) హైడ్రొకార్బను శృంఖలం కలిగివున్న మోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం. కొవ్వుఆమ్లం ఒక చివర ఒక కార్బొక్సిల్ప్ గ్రూప్‌ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వు ఆమ్లంలను మోనోకార్బలిక్ ఆమ్లం లందురు. లారిక్, పామిటిక్ సంతృప్త ఆమ్లంల తరువాత విస్తృతంగా జంతు కొవ్వులలో, క్షీరదాల పాలలో, శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వు ఆమ్లం స్టియరిక్ ఆమ్లం. జంతుకొవ్వులలో 35-60% వరకు, శాకనూనెలలో 5-45% వరకు స్టియరిక్ ఆమ్లం లభించును. స్టియరిక్ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును. ఉపరితలం మైనంవంటి మెరుపు కల్గివుండును, వేడిచేసిన పారదర్శకంగా ద్రవంగా మారును, శాకకొవ్వులైన కొకోబట్టరు, షియా (shea) బట్టరులో, కొకమ్ (kokam), సాల్వ (sal) కొవ్వులలో అధికమొత్తంలో లభించును.
'స్టియరిక్ ఆమ్లం భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక
భౌతిక/రసాయనిక ధర్మం | విలువలమితి |
అణుభారం | 248.48 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 69.60C |
మరుగు ఉష్ణోగ్రత (512mm/Hg) | 355.20C |
సాంద్రత (800Cవద్ద) | 0.8390 |
వక్రీభవన సూచిక (800C వద్ద) | 1.4299 |
స్నిగ్థత mPa.s (800C వద్ద) | 7.79 |
వెలుగు ఉష్ణోగ్రత | 1910C |
స్వీయదహన ఉష్ణోగ్రత | 3950C |
జంతుకొవ్వులు
కొవ్వురకం | శాతం |
మటన్ టాలో | 33-34 |
బీఫ్‌టాలో | 19-20 |
లార్డ్ | 13.5 |
చికెన్బ్రెస్ట్, స్కిన్లెస్ | 8.3 |
శాకకొవ్వులు/నూనెలు
నూనె | శాతం | నూనె | శాతం | నూనె | శాతం |
కొకొబట్టరు | 35-36 | సాల్‌కొవ్వు | 43-45 | మామిడి పిక్కలు | 35-37 |
కొకమ్ | 80-87 | ధుపా | 45-47 | ఇప్ప నూనె | 20-25 |
హెంప్ (hemp) | 1.0-3.0 | షియా | 40-41 | తంబ | 9-10 |
నువ్వులు | 4-5 | కొపక్ | 5-9 | వేరుశనగ | 1.0-3.0 |
మొక్కజొన్న | 2.0-2.5 | కొబ్బరి | 1.0-3.0 | పత్తిగింజలు | 2.0-2.5 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.