From Wikipedia, the free encyclopedia
నువ్వుల నూనె (Sesame oil or gingelly oil or til oil) నూనె గింజలైన నువ్వుల నుండి తయారవుతుంది. నువ్వుల శాస్త్రీయ నామం : సెసమమ్ ఇండికం (sesamum indicum. L) ఇది పెడాలియేసి[1] (Pedaliacae) కుటుంబంలో సెసమమ్ (Sesamum) ప్రజాతికి చెందినది. నువ్వులను సంస్కృతంలో 'తిల ' (Til) అంటారు. తిలనుండి వచ్చినది కావడంవలన 'తైలం' అయినది. నిజానికి నూనె అంటేనే నువ్వుల నూనె. మూలద్రావిడంలోని 'నెయ్' (oil) అన్న పదానికి నువ్వు జత చేస్తే నువ్+నెయ్ > నూనెయ్ > నూనెగా మారింది. కన్నడలో నూనెను 'ఎణ్ణె (ఎళ్ 'లేత, నువ్వు' + నెయ్ = ఎణ్ణెయ్) ' అంటారు.
నువ్వుల పంటను వ్యవసాయపంటగా 5వేల సంవత్సరాలక్రితమే పండించినట్లు తెలుస్తున్నది.3600 క్రితమే మందుల (medicine) తయారిలో ఈజిప్టువాడినట్లు తెయుచున్నది.పురాతన బాబిలోన్ మహిళలు నువ్వులనూనెను, తేనెతోకలిపి సౌందర్యలేపనాలు చేసెవారు[2].దీని పుట్టుక మూలాలు వెస్ట్ ఇండిస్ .క్రీ.పూ.3000 సంవత్సరాలనాడే దీనిని వాడిన దాఖాలాలు ఉన్నాయి.5 వేల సంవత్సరాలక్రితం నువ్వులనూనెతో కాగడాలను వెలిగించుటకు ఉపయోగించడమే కాకుండగా దాని మసితో సిరాను తయారు చేసెవారు[3] సింధు లోయ నాగరికత (sindhu valley civilization) కాలంనాటికి అప్పటి ప్రజలు నువ్వుల నూనెను వాడేవారు. మానవుడు మొదటగా నువ్వులనుండె నూనెను తీసివాడటం ప్రారంభించినట్లు తెలుస్తున్నది. వేదాలలోకూడ నువ్వుల ప్రస్తావన ఉంది. నువ్వులనుండి గానుగ ద్వారా నూనెను తీయువారు తిలకల వాళ్లుగా పిలవబడి కాలక్రమేన తెలికల వాళ్ళుగా మారారు. తెలికల కులానికి చెందినవారు గానుగలద్వారా నూనెనుతీయటం తమ వృత్తిగా అక్కడక్కడ గ్రామాలలో ఉన్నారు. క్రీ. పూ.600 నాటికి సింథులోయ నుండి మెసొపొటేమియాకు వ్యాప్తి చెందినది. సింథులోయ ప్రాంతం నుండే నువ్వులు మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినవి.
నువ్వు మొక్క ఉష్ణమండలప్రాంతంలో బాగా పెరిగే మొక్క.ఏకవార్షికం.పంటకాలం 90-120 రోజులు.పంటకాపుకొచ్చుసమయంలో మంచు ఉండరాదు.100Cఉష్ణోగ్రతలో కూడా తత్తుకొని పెరుగ గల్లినప్పటికి 25-270C మధ్య వాతావరణ ఉష్ణోగ్రతవుండటం మంచిదిగుబడికి అవసరం.చెట్టు 2000 మి.మీ ఎత్తువరకు పెరుగుతుంది.ఒకచెట్టునుండి 50 నుంచి100 గింజల దిగుబడి వస్తుంది.[4] నువ్వులలో మూడు రకాలున్నాయి, అవి నల్లని, తెల్లని, కపిలవర్ణం (ఎరుపు) నువ్వులు.మొక్కరకాన్ని బట్టి పూలరంగులో వ్యత్యాసం వుండును.నువ్వులమొక్కపొదవలె గుబురుగా నిటరుగా పెరుగుతుంది.పూలు పింకు లేదా తెల్లగా వుంటాయి.కాయలు కుళ్ళాయి/గొట్టం ఆకారంలో వుండి, లోపలవిత్తనాలు వరుసగా పేర్చబడివుండును.
నువ్వుల నూనె లోని కొవ్వుఆమ్లాలు[5]
కొవ్వు ఆమ్లం | కార్బనులసంఖ్య | కనిష్ఠం | గరిష్ఠం |
పామిటిక్ ఆమ్లం | C16:0 | 7.0 % | 12.0 % |
పామిటొలిక్ ఆమ్లం | C16:1 | trace | 0.5 % |
స్టియరిక్ ఆమ్లం | C18:0 | 3.5 % | 6.0 % |
ఒలిక్ ఆమ్లం | C18:1 | 35.0 % | 50.0 % |
లినొలిక్ ఆమ్లం | C18:2 | 35.0 % | 50.0 % |
Linolenic | C18:3 | trace | 1.0 % |
Eicosenoic | C20:1 | trace | 1.0 % |
నూవులనూనె[6] యొక్క భౌతిక ధర్మాల విలువలు స్థిరంగా వుండవు.మొక్కరకం, నేలస్వాభావం, వాడిన ఎరువులరకం, మొతాదును బట్తి భౌతికగుణలలో తేడా వుండును.నూనెయొక్క సాంద్రత 250Cవద్ద 0.916 నుండిం.921, సపోనిఫికెసను సంఖ్య 188-1993 వరకు, వక్రీభవనగుణకం1.4763 (250Cవద్ద) వుండును.నూనెద్రవీభవన ఉష్ణోగ్రత 21నుండి31.50C, మరి రిచర్డ్ మెస్సెల్ విలువ 1.2 వుండును[7]
భౌతిక ధర్మాల పట్టిక (సరాసరి విలువలు)
లక్షణము | విలువల మితి |
సాంద్రత | 0.915-0.919 |
వక్రీభవన సూచిక (400C) వద్ద | 1.4645-1.4665 |
సపొనిఫెకెసన్ విలువ | 188-193 |
ఐయోడిన్ విలువ | 103-120 |
అన్‌సపొనిఫియబుల్ పదార్థం | 1.5-2.0% |
బెల్లియరు టర్బిడిటి (గరిష్ఠం) | 220C |
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 3,699 కి.J (884 kcal) |
0.00 g | |
100.00 g | |
సంతృప్త క్రొవ్వు | 14.200 g |
మోనోశాచురేటెడ్ కొవ్వు | 39.700 g |
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు | 41.700 g |
0.00 g | |
విటమిన్లు | Quantity %DV† |
విటమిన్ సి | 0% 0.0 mg |
Vitamin E | 9% 1.40 mg |
విటమిన్ కె | 13% 13.6 μg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 0% 0 mg |
ఇనుము | 0% 0.00 mg |
మెగ్నీషియం | 0% 0 mg |
ఫాస్ఫరస్ | 0% 0 mg |
పొటాషియం | 0% 0 mg |
సోడియం | 0% 0 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
ప్రపంచంలో 65 దేశాలు నువ్వులను పండిస్తున్నాయి. సంవత్సరముకు 30-40 లక్షలటన్నుల నువ్వులు ఉత్పత్తి కాగా, అందులో భారతదేశం వాటా 6-8 లక్షల టన్నులు (20%). ప్రపంచం మొత్తం మీద 75 లక్షల హెక్టేరులలో నువ్వుల పంట సాగు అవుతున్నది. భారతదేశంలో 17 లక్షల హెక్టేరులలో సాగు అగుచున్నది. ప్రపంచంలో నువ్వులను అధికంగాపండించు యితర దేశాలు, చైనా (20%), మయన్మారు (17%), సూడాన్ (5.5%), ఉగాండా (5.0%), నిగెరియ, పాకిస్తాన్, బంగ్లాదేశ్. భారతదేశం నుండి సంవత్సరానికి 2.5-3.0 లక్షల టన్నుల నువ్వులు ఎగుమతి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1.6 లక్షల హెక్టేరులలో నువ్వులపంట సాగులో ఉంది.
నువ్వులనూనెను కేవలం వంటనూనెగానే కాకుండ, దేహమర్దన తైలంగా, ఆయుర్వేదమందులలో, కాస్మాటిక్స్ తయారీలో వాడెదరు. పసిబిడ్డకు (నెలల పిల్లలు) మొదట నువ్వుల నూనెతో మర్దన చేసి, ఆ తరువాత స్నానం చేయించడం ఇప్పటికీ గ్రామాలలో చూడవచ్చును. ఆంతేకాదు, ప్రసవానంతరం,15-20 రోజులవరకు బాలింతరాలికి నువ్వులనూనె, నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంగా యిస్తారు. పుష్కర సమయంలో, కర్మక్రియలలో, గ్రహదోష నివారణపూజలు చేసినప్పుడు బ్రాహ్మణులకు నువ్వులను దానంగా యిస్తారు. దేవాలయాలలో, ముఖ్యంగా శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యడం ఆచారం.
Seamless Wikipedia browsing. On steroids.