భారతీయ కళాకారుడు From Wikipedia, the free encyclopedia
మక్బూల్ ఫిదా హుసేన్ (సెప్టెంబరు 17 1915 - జూన్ 9, 2011) (జననం: 1915, పంఢర్‌పూర్, మహారాష్ట్ర) ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి.
ఎం.ఎఫ్. హుసేన్ | |
జననం | సెప్టెంబరు 17 1915 పంఢర్‌పూర్, భారత్ |
మరణం | జూన్ 9, 2011 |
జాతీయత | భారతీయుడు |
రంగం | పెయింటింగ్, చిత్రలేఖనం |
శిక్షణ | సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ |
పిల్లలు | శంషాద్ హుస్సేన్ |
ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ పికాసో".[1] తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం.[2][3] ఇతను జూన్ 9 2011 న లండన్లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 ని.కు) అనారోగ్యంతో మరణించారు.
హుసేన్ సులేమాని బోహ్రా కుటుంబానికి చెందిన వాడు. ఇతడి తల్లి, హుసేన్ 2వ యేటనే మరణించింది. తండ్రి రెండవ పెళ్ళి చేసుకుని ఇండోర్ వెళ్ళిపోయాడు. 1935లో హుసేన్ ముంబాయి లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. హుసేన్ సినిమా హోర్డింగుల పెయింటింగ్ ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎదిగాడు. ఫోర్బ్స్ మేగజైన్ "భారతీయ పికాసో"గా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్ జూన్ 9 (8) 2011 న లండన్లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30ని|| కు) అనారొగ్యంతో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో అతను తనువు చాలించారన్న వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది.
నేనే నేరమూ చెయ్యలేదు. నన్ను వ్యతిరేకించే వాళ్లు చాలా కొద్దిమందే.. నేను ఎందుకు తిరిగి రాలేనో వాళ్లకు తెలుసు.. నేనేమీ రాజకీయ నాయకుడినో, సామాజిక ఉద్యమకారుడినో కాదు. నేనో కళాకారుడిని. నేను చేసే ప్రతి పనీ ఓ కళాత్మకమైన వ్యక్తీకరణే! కళాకారుడి ప్రకటనే. దేశవ్యాప్తంగా నా మీద దాదాపు 900 కేసులున్నాయి. ఇంత పెద్ద వయసులో ఎక్కడెక్కడో కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతాను? గత 12 ఏళ్లుగా మా లాయర్‌కు నెలనెలా 60-70 వేలు కడుతూనే ఉన్నా.నేను భారత్‌కు దూరం కాలేదు.. కాలేను__ హుస్సేన్
చంపేస్తామని బెదిరించారు. చనిపోయాడుగా... ఇప్పుడేం చేస్తాం? ఆయన బొమ్మలూ శైలీ, రీతులూ, మార్గం- అజంతా ఎల్లోరాల్లా చిరాయువులు. అవి ఈ దేశ సంపద. హుసేన్ చిరాయువు. -- శ్రీధర్ కార్టూనిస్టు
1940 ఆఖరులో హుసేన్ ప్రసిద్ధి చెందాడు. ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా స్థాపించిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూపులో 1947 లో, చేరాడు. 1952 లో, ఇతడి మొదటి ప్రదర్శన జ్యూరిచ్ నగరంలో జరిగినది, , తరువాతి సంవత్సరాలలో యూరప్ , అమెరికాలో పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 1955 లో, ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించినది.[4]
1967లో త్రూ ది ఐస్ ఆఫ్ ఎ పెయింటర్ అనే సినిమా నిర్మించాడు. దీనికి బెర్లిన్ సినిమా ఉత్సవం లో బంగారు ఎలుగుబంటు (అవార్డు) లభించింది.[5][6]
ఎం.ఎఫ్.హుసేన్ , పబ్లో పికాసో, 1971 సావోపోలో బయెన్నియల్, లో ప్రత్యేక ఆహ్వానితుడు.[6] 1973 లో పద్మ భూషణ పురస్కారం, , 1986లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడ్డాడు.[6] 1991లో పద్మ విభూషణ పురస్కారం లభించింది.
భారత్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న కళాకారుడిగా పేరుగాంచాడు. ఈ మధ్యన జరిగిన క్రిస్టీ యొక్క వేలంలో 20 లక్షల అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి.[7]
ఇతను కొన్ని సినిమాలనూ నిర్మించాడు, గజ గామిని (మాధురీ దీక్షిత్ (నటి)).[8] మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీజ్ (తాబు (నటి)). ఇతడి "స్వీయచరిత్ర" (autobiography) "ద మేకింగ్ ఆఫ్ ద పెయింటర్".[9]
పీబాడి ఎస్సెక్స్ మ్యూజియం (PEM) (అ.సం.రా. మసాచుసెట్స్) లో, 2006 నవంబరు 4 నుండి 2007 జూన్ 3 వరకు, హుసేన్ "మహాభారత" పై గీచిన పెయింటింగ్ లు ప్రదర్శింపబడ్డాయి.
92 సం. వయస్సులో ఇతనికి రాజా రవివర్మ పురస్కారం, కేరళ ప్రభుత్వంచే ఇవ్వబడింది.[10] ఈ అవార్డుకు వ్యతిరేకంగా కేరళలో సంఘ్ పరివార్ సంస్థలు గళం విప్పాయి, కేరళ కోర్టులో కేసులు కూడా వేసారు. కేరళ కోర్టు, తుది తీర్పు విడుదలయ్యేంత వరకూ, ఈ అవార్డు పై స్టే విధించింది.[11]
1990లో హుసేన్ చిత్రాలు పలు వివాదాలు సృష్టించాయి.హిందూ దేవతా చిత్రాలను అర్ధనగ్నంగాను అసభ్యంగాను చిత్రించాడని అభియోగం.[12]
ఈ చిత్రాలను హుసేన్ 1970లో చిత్రించాడు, కానీ 1996లో ఈ చిత్రాలు విచార మీమాంస అనే హిందీ పత్రికలో ముద్రితమైన తరువాత వివాదం దాల్చుకున్నాయి. ఈ వివాదపు ఫిర్యాదును 2004 లో, ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.[13][14]
1998లో 'బజ్‌రంగ్ దళ్' సభ్యులు హుసేన్ ఇంటిపై దాడికి దిగారు, 26 మంది దుండగులను పోలీసులు అరెస్టు చేసారు. శివసేన ఈ దాడిని సమర్థించింది.[15]
ఫిబ్రవరి 2006 లోనూ, ఇలాంటి అపవాదు హుసైన్ పై వచ్చింది.[16] తాను ఎప్పటికీ కూడా భారతీయ చిత్రకారుడినే అని తన జన్మభూమి భారత్‌అనీ... స్వదేశంతో సంబంధాలను తెగతెంపులు చేసుకునే ప్రసక్తేలేదని తానెప్పటికీ కూడా భారతదేశంలో జన్మించిన వ్యక్తినేనని ఎం.ఎఫ్.హుస్సేన్ పునరుద్ఘాటించారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.