ఎం.కె.వెల్లోడి

From Wikipedia, the free encyclopedia

ఎం.కె.వెల్లోడి

ఎం.కె.వెల్లోడి గా ప్రసిద్ధి చెందిన ముల్లత్తు కడింగి వెల్లోడి నారాయణ మెనన్ హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, దౌత్యవేత్త, ప్రముఖ ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) అధికారి.

Thumb
ఎం.కె.వెల్లోడి

కేరళీయుడైన వెల్లోడి 1896, జనవరి 14న కేరళ రాష్ట్రములోని మలప్పురముకు 12 కిలోమీటర్ల దూరములో ఉన్న కొట్టక్కళ్ పట్టణములో జామోరిన్ రాజవంశంలో జన్మించాడు. ఈయన తండ్రి కె.సి.మనవేదన్ రాజా 1932 నుండి 1937లో మరణించేవరకు కాలికట్ జామోరిన్ గా ఉన్నాడు. వెల్లోడి ఆ కుటుంబంలో నాలుగవ కుమారునిగా జన్మించాడు.[1] జామోరిన్ కళాశాల ( ఆ తరువాత గురువాయురప్ప కళాశాల) లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 25 యేళ్ల వయసులో ఇండియన్ సివిల్ సర్వీసులో చేరి, ఒకటిన్నర దశాబ్దం పాటు అనేక ప్రదేశాలలో కలెక్టరుగా పనిచేశాడు.[2]

1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 వరకు హైదరాబాదు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశాడు. ఈయన భారత ప్రభుత్వముచే నియమించబడిన ముఖ్యమంత్రి

నిర్వహించిన పదవులు

Thumb
1952లో అమెరికా పూర్వ ప్రథమ మహిళ ఎలినార్ రూజ్‌వెల్ట్ హైదరాబాదు పర్యటించిన సందర్భంలో అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు ఆమెకు వీడ్కోలు పలుకుతున్న ఎం.కె.వెల్లోడి దంపతులు
  • 1928 - తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు
  • ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టరు
  • 1934 - సంయుక్త కార్యదర్శి
  • 1937 మార్చి 18 నుండి 1937 నవంబర్ 26 - గంజాం జిల్లా కలెక్టరు[3]
  • 1939 - ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి[4]
  • 1940 - భారత ప్రభుత్వంలో ధరల సలహా సూచక అధికారి
  • 1942 - 1945 ఎగుమతుల నియంత్రణా అధికారి (బొంబాయి)
  • ‍1945 - భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ కార్యదర్శి
  • 1945 నవంబరు - 1947 ఇంగ్లాడులో భారత ఉపరాయబారి
  • 1947 - ఇంగ్లాడులో ఆపద్ధర్మ భారత రాయబారి
  • 1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 - హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి
  • 1954, 55 భారతదేశ రక్షణ కార్యదర్శి
  • స్విట్జర్‌లాండ్లో భారత రాయబారి
  • 1957 ఆగష్టు 1 నుండి 1958 జూన్ 4 - భారతదేశ కేబినెట్ కార్యదర్శి [5]
  • 1958 - 1958 అక్టోబరు - ప్రణాళికా సంఘ కార్యదర్శి
  • 1958 - 1959 ఆస్ట్రియాలో భారత రాయబారి[6]
  • 1958 - 1961 జర్మనీలో భారత రాయబారి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.